Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

95. పూజ చేయనా శివుని పూజ చేయనా | Pooja Cheyana Shivuni Pooja Cheyana| శివ భజన పాటల లిరిక్స్

P Madhav Kumar


పూజ చేయనా శివుని పూజ చేయనా
ముల్లోకాలేలు స్వామికి పూజ చేయనా॥


పూజా ద్రవ్యాలు తెచ్చి చక్కగా నీకర్పించి
తీరుతీరైన పూల మాలలెన్నో తెచ్చి నీకు

పూజ చేయనా శివుని పూజ చేయనా
ముల్లోకాలేలు స్వామికి పూజ చేయనా॥

పంచామృతాలు తెచ్చి అభిషేకం చేసి నీకు
పట్టు వస్త్రాలు కట్టి పరిమళ ద్రవ్యాలతోనూ

పూజ చేయనా శివుని పూజ చేయనా
ముల్లోకాలేలు స్వామికి పూజ చేయనా॥

దీపములు ధూపములతో విధమైన నైవేద్యం
ప్రేమతోను అర్పించి పరమ భక్తితో నీకు

పూజ చేయనా శివయ్య పూజ చేయనా
ముల్లోకాలేలు స్వామికి పూజ చేయనా॥

సారయుక్తమైనవెన్నో చక్కటి ఫలములు తెచ్చి
మిక్కిలి నువ్వారగించి చక్కగా మమ్ము దీవించు

పూజ చేయనా శివయ్య పూజ చేయనా
ముల్లోకాలేలు స్వామికి పూజ చేయనా॥

మాయను తీసేసినట్టి మహితాత్ముడవని నేను
కరములు జోడించి నేడు కర్పూర హారతి ఇచ్చి

పూజ చేయనా శివయ్య పూజ చేయనా
ముల్లోకాలేలు స్వామికి పూజ చేయనా॥

🕉️ ఓం నమః శివాయ 🕉️


Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
📢 Follow