Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

02. పూజ చేయగా రారండి శ్రీ లక్ష్మీదేవికి | Pooja cheyaga raarandi Sri lakshmi Deviki

P Madhav Kumar
పూజ చేయగా రారండి శ్రీ లక్ష్మీదేవికి - 2
శ్రావణమాసము శుక్రవారము శ్రీ వరలక్ష్మీదేవికి - 2

పసుపు కుంకుమ గాజులు గంధము అక్షంతలు - 2
నల్లపూసలు సింధూరములు అర్పించెదము రారండి - 2

మల్లెలు విరజాజిపువ్వులు మొగలరేకులు సంవెంగలు - 2
సన్నజాజులు గులాభిపువ్వులు తామరపువ్వులు చేమంతులు - 2

తులసి దళములు మరువము ధవనము మారేడుదళములు - 2
మాచీపత్రము గన్నేరుపత్రము అర్పించెదము రారండి - 2

కదళీ ఫలములు ఖర్జూరములు నారికేళము సీతాఫలములు - 2
మధురమైన మామిడిపండ్లను అర్పించెదము రారండి - 2

ధూపదీప నైవేద్యములతో రత్నమణిముత్యారతులతో - 2
భక్తి శ్రద్ధతో పూజించండి వారములోసగును వరలక్ష్మి - 2

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
📢 Follow