Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

116. రావెమ్మ ఎల్లమ్మ | Ravemma Ellamma | అమ్మవారి భజన పాటల లిరిక్స్

P Madhav Kumar
రావెమ్మ ఎల్లమ్మ రావెమ్మ ఎల్లమ్మ
రావెమ్మ నా తల్లి రావెమ్మ ఎల్లమ్మ

పోచమ్మ కనుగొని పులకరించంగా
మైసమ్మ నిన్ను చూసి పరవశించంగా
పెద్దమ్మ నీ రాక వేడుక చూడా
ఎల్లమ్మ నా తల్లి ఎల్లిపోతావా

ఈ వీధిలో నీకు గుడి లేదమ్మా
ఈ మనసులో నిన్ను మరువలేమమ్మా
పసుపు కొమ్ముల తోటి నిను కొలిచెదమమ్మా
కుంకుమ బొట్టు తోటి నీ దయ పొందెదమమ్మా

బోనాలు నెత్తినెట్టి నీ బాటలో నడవంగ
వేపమండల చేత పట్టి నిన్ను వేడంగా
ఎల్లమ్మ నా తల్లి రావమ్మా వీధికి
చల్లని దీవెనలు ఇవ్వమ్మా ఊరికి

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
📢 Follow