మా గుండెల్లో నిండిన దైవమయ్యా
రామరామ అనుకొంటా వచ్చేము అంజన్నా
నీ చల్లని చూపులు మాపై ఉంచవయ్యా
సంజీవి పర్వతం మోసిన వీరుడా
భక్తుల కష్టాలు తీర్చేటి దేవుడా
ఏటేటా నీ మాలలు వేసి కొలిచేమయ్య
మా పాపాలు బాపి దారి చూపవయ్యా
శరణు శరణు అంజనేయ శరణురా అంజన్నా
మా కంటి పాపవై కాపాడు దేవుడా
