Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

34. జై జై జై జై జై కొండల్లోన కోనల్లోన కొండగట్టు | Jai Jai Jai Kondallona | Telugu Lyrics

P Madhav Kumar
జై జై జై జై జై కొండల్లోన కోనల్లోన కొండగట్టు కోవెల్లోన
హారతులిచ్చే పూజలు చేసేరు కొండగట్టు అంజన్న నీకు
ముడుపులు కట్టి మొక్కులు పెట్టేరు కొండగట్టు అంజన్న నీకు

వందనాలు వందనాలు వందనాలయ్యో వాయుపుత్ర ఆంజనేయ వందనాలయ్యో
వందనాలు వందనాలు వందనాలయ్యో వాయుపుత్ర ఆంజనేయ వందనాలయ్యో

చల్లని అంజన్నవాని ముల్లెమూటలు కట్టుకొని
మల్లేపూలు, బంతిపూలు, గంపెడు పూలు పట్టుకొని
మా పిల్లజెల్లు నెత్తుకున్నాము కొండగట్టు అంజన్న స్వామి
జెల్లిజెల్లి వత్తావున్నము కొండగట్టు అంజన్న స్వామి

మాట మాటను పాటలు చేసి నీ పాటలే పాడుకుంటా
ఘల్లు ఘల్లున ఘజ్జెలు కట్టి చెంగు చెంగున చిందులు వేసి
నీ పాటలే పాడుకుంటాము కొండగట్టు అంజన్న స్వామి
నీ భజనలే చేతవుంటాము కొండగట్టు అంజన్న స్వామి

మా గుండెల్లోన గుడినేకట్టి గుడిలోన నిన్నే పెట్టి
భక్తితోటి నిన్నే కొలిచి బాధలన్ని చెప్పుకోని
అంజన్నా ధనము ధాన్యాలు వద్దయ్యో కొండగట్టు అంజన్న స్వామి
నీ పూజలు మాకు ముద్దయ్యో కొండగట్టు అంజన్న స్వామి
Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
📢 Follow