Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

35. ముత్యంపేట ముత్యాల కొండలట | Muthyampeta Muthyala Kondalata | Telugu Lyrics

P Madhav Kumar
ముత్యంపేట ముత్యాల కొండలట మన అంజన్న కొలువుతీరివున్నాడటు
పొద్దు మాపు అహో పొద్దుమాపు అహో పొద్దుమాపు అంజన్న పూజలట
అహో నిద్రజేసి వత్తాము ఒక్కపూట

పెద్దపెద్ద గుట్టలల్ల వెలిసెనటా ఆ పొడిశెటి పొద్దోలె వుంటాడట
మన సక్కాని మన సక్కాని మన సక్కాని అంజన్న మొక్కులటా
ఆ మొక్కినా భక్తులకు మోక్షమాట

ఏటేటా శ్రావణ మాసమాట ఆముపై రోజులు పండుగట
నెలనిండా అహో నెల నిండా ఆ నెల నిండా భలే ఒక్క పొద్దులట
ఆ చిన్న పెద్దలంతా కలసి చేస్తారట

పచ్చి కొబ్బరి పలహారమాట మన పల్లె పల్లెన పంచి పెడతారట
మన అంజన్న అహో అంజన్న మన అంజన్న పేరు మీద
భక్తులంతా వారంవారం టెంకాయ కొడతారట

బండిగట్టు కొండగట్టు భక్తులారా మనకు ఒండెడన్ని వరాలు యిత్తాడట
రండి రండి అహో రండి రండి రండి రండి భక్తులారా కొండగట్టుకు
మన పాత రోగాలన్ని పారిపోవును
Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
📢 Follow