Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

36. కొండగట్టు గుట్టు మీద అద్దాల మేడా | Kondagattu Guttu Meeda | Telugu Lyrics

P Madhav Kumar
కొండగట్టు గుట్టుమీద అద్దాల మేడా
అద్దాల మేడలో కొలువైనావా స్వామి అంజనర్నా
కోసల మాత మా ప్రాణదాత
కోటి మాయల దేవుడవయ్యా స్వామి అంజన్నా
వజ్రాశరీరుడవయ్యా మా వానర వీరుడవయ్యా
అడుగడుగు దండాలయ్యా మా స్వామి ఓ అంజన్నా

కాంచనవర్ణం నీదుకాయము
నిండు పున్నము తీరునిగనిగ మెరిసే స్వామి అంజన్నా
భక్తవత్సలా భవభయహరణ
భాగ్యములిచ్చే భక్తాంజనేయ స్వామి అంజన్నా
కోటి దీపాలతోటి కొలిచేము కోసలదూత
మా తోడు నీడవు నీవే మా కంటి పాపవు నీవే

భక్తుల కాచే బంగారు తోక
గాలి దెయ్యాలు కూడ గడ గడ వణుకును నీ గద చూసి
పావని నామ పరమదయలా
పాపాలు పాయగ రావేమయ్యా పవనతనయా
ఏటేటా మాలలు వేసి నీ దీక్షలు చేసేమయ్య
మదినిండా కొలిచేమయ్య మా దైవం నీవేనయ్యా

తల్లివి నీవే తండ్రివి నీవే
దినకర తేజ దివ్యస్వరూప దిక్కువు నీవే
శరణం శరణం శ్రీ అంజనేయ
శరణువారిని కరుణతో జూసే మా దొరవయ్యా
ఏమని పొగడను స్వామి నీ పాదం విడువను స్వామి
కోటి కొండల ముడుపులు నీకే కొండగట్టు మా అంజన్నా
మా ప్రాణం నీవేనయ్యా నా ప్రాణం
Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
📢 Follow