Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

37. చెయ్యండిరా భజన చెయ్యండిరా | Cheyyandira Bhajana Cheyyandira | Telugu Lyrics

P Madhav Kumar
చెయ్యండిరా భజన చెయ్యండిరా
మన అంజన్న స్వామి భజన చెయ్యండిరా

వెయ్యండిరా దండలెయ్యుండిరా 
తెల్ల జిల్లేడు దండలల్లి వెయ్యండిరా
వెయ్యండిరా దండలెయ్యుండిరా
దండలేసి దండాలు చెయ్యండిరా

చల్లండిరా పూలు చల్లండిరా
సంజీవి నామునకు చల్లండిరా
చల్లండిరా పూలు చల్లండిరా
మన చల్లని అంజన్న తలనిండరా

మొక్కండిరా మీరు మొక్కండిరా
మన చక్కని దేవున్ని మొక్కండిరా
మొక్కండిరా మీరు మొక్కండిరా
మన ముక్కంటి రూపునకు మొక్కండిరా

వెయ్యండిరా చిందులేయ్యుండిరా
మీరు చిన్న పెద్దలంత చిందులేయ్యుండిరా
వెయ్యండిరా చిందులేయ్యుండిరా
చిందులేసి అంజన్నను కొలువండిరా

చూడండిరా అటు చూడండిరా
మన అంజన్న స్వామి నవ్వుతున్నాడురా
Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
📢 Follow