సాహిత్యం : [హిందోళ రాగం}
[సాకి]అదియే భూలోక కైలాసం
అదియే ముక్తికిమూలం
శ్రీశైలం శ్రీశైలం
[పల్లవి...]
శివసన్నిధానం శ్రీశైలం
ఇహపరములకు, అదెమూలం ||శివసన్నిధానం||
[కోరస్]
ఓం నమ: శివాయఓం నమ: శివాయ
ఓం నమ: శివాయ
[కామవర్ధని రాగం]
ఆదిశంకరుడు ఆ భ్రమరాంబతోభువిలొ వెలిసెను పాలించుటకై
ఆమల్లేశుని గిరిశిఖర దర్శనం
అదియే మనకు కైవల్యము.
||శివసన్నిధానం||
[కోరస్]
ఓం నమ: శివాయఓం నమ: శివాయ
ఓం నమ: శివాయ
[చక్రవాక రాగం]
భక్తుల పాలిట కల్పతరువదిముక్తికి మూలం శ్రీశైలం
ముల్లోక పూజ్యుడు జ్యోతిర్లింగమై
శ్రీశైలంబున స్థిరమై నిలచె.
||శివసన్నిధానం||
[కోరస్]
ఓం నమ: శివాయఓం నమ: శివాయ
ఓం నమ: శివాయ
[ముల్తాన్ రాగం ]
మల్లిఖార్జునుని మనమున తలచినమటు మాయములే ఆపదలెల్ల
ఆ జగదీశుని పంచాక్షరి మంత్రం
నిరతము చేసి తరించర జీవా.
||శివసన్నిధానం||
[కోరస్]
ఓం నమ: శివాయఓం నమ: శివాయ
ఓం నమ: శివాయ
నమ: శివాయ
నమ: శివాయ
