తల తల మెరుపుల శిరమున శివమణి. (2)
నాగన్నా...... నాగన్నా దిగు దిగు దిగరా నాగన్నా (2)
శ్రీ విష్ణువుకు నీవు శేష పాన్పు వైనావు.. (2)
కాల కంటునికి నీవు కంట ఆహారమైనా వు (2)
నాగన్నా ...... నాగన్నా నీకు వేయిపడగలు నాగన్న.
పని పాటలకు మేము రాతివేల పోతుంటే
కానరాని చీకట్లోమా కాలే తగిలినట్లయితే. (2)
నాగన్నా ..... నాగన్నా మము కాటు వేయకురా నాగన్న
నాగన్నా మమ్ము కడకు తొలగిపో నాగన్న.....
నాగుల పంచమి నాడు మహిళలంతా చేరేరు
పుట్ట ను పూజించేరు నీకు పాలు పోసి మొక్కేరు....
పుట్ట నిండ గోవు పాలు నీవు పొట్టనిండ తాగన్న...
నాగన్న మామ చల్లగా చూడు నాగన్న