అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప / Annadana prabhuve - అయ్యప్ప భజన పాటల లిరిక్స్

P Madhav Kumar

అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప
అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప
అరియం గాపు అయ్యవే శరణం అయ్యప్ప
స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే

శబరిగిరీశ అయ్యప్ప
 శ్రీ ధర్మ శాస్త్ర అయ్యప్ప
వన్ పులి వాహన అయ్యప్ప
శరణం శరణం అయ్యప్ప


వావరు స్వామియే అయ్యప్ప
 విల్లాలి వీరనే అయ్యప్ప
వీర మనికంటనే అయ్యప్ప
శరణం శరణం అయ్యప్ప

హరిహరపుత్ర అయ్యప్ప
 కానన వాస అయ్యప్ప
సద్గురు నాద అయ్యప్ప
శరణం శరణం అయ్యప్ప

పంబా వాసా అయ్యప్ప
 కర్పూరదీపం అయ్యప్ప
నీ దివ్య రూపం మా కప్ప
శరణం శరణం అయ్యప్ప

పల్లిం కట్టు శబరిమలక్కు కల్లుం ముల్లుం కాలికి  మేత్తే 
స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే

కార్తిక మాసం మాలలు వేసుకొని మండల దీక్షలు చేసి తిమా
 మండల పూజలు ముగిసిన పిదప స్వామి యాత్రలో సా గేదమా


ఎరుమేలి చేరి తీమా వావరూ స్వామిని చూసితీమా
పెటైతుళ్లి ఆటలు ఆడి అలుదా నదినే చేరుదమా


అల్లుడా నదిలో స్నానము చేసి రాళ్ళను రెండు తీ సేదమా
కలిడం కుండ్రేలో రాల్లను వేసి కరి మల కొండకు సాగుదమా

కరిమల ఎట్రం కటినం కటీనం స్వామియే శరణం కొరితిమా
దేహబలంద పా దబలంద స్వామి నామమే తలచితిమా

అలసిన భక్తుల సేదతీర్చగా అదిగో వచ్చాను అయ్యప్ప
చేయి పట్టుకొని నడిపింప కరిమల ఏట్రం దాటి తిమా

పెరియాన వట్టమే దాటితిమా చేరియాన వట్టం చేరితి మా
పంబా తీరము చేరితిమా పవళింపు సేవ చేయుదమా

ఉత్సాహంతో ఉరుకుతూ పెరుగుతూ నీలిమలై చేరితిమా
శబరి పీఠమే చేరితిమా శబరికి వందనం చేసేదమా


శబరి కి వందనం చేసిన పిదప శరంగుత్తి నే చేరితి మా
శరంగుత్తి లో శరములు గుచ్చి సన్నిధానము చే రేదమా

పదునెట్టాంబడి చెరితిమా కొబ్బరికాయను కొట్టితిమా
మెట్టు మెట్టుకు మొక్కితి మా స్వామి రూపమే చూచితిమా....

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat