32. లేవయ్య లేవయ్య లేచిరావయ్యా Levayya Vevayya Lechi ravayya - అయ్యప్ప భజన పాటల లిరిక్స్
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം

32. లేవయ్య లేవయ్య లేచిరావయ్యా Levayya Vevayya Lechi ravayya - అయ్యప్ప భజన పాటల లిరిక్స్

P Madhav Kumar
లేవయ్య లేవయ్య లేచిరావయ్యా
వేచి ఉన్నా మయ్య లేచి చూడయ్యా

దేవతలు కోరగా మానవుడవై పుట్టి
మహిషిని వధియించి మాయమైనవంట
ధర్మాన్ని కాపాడు ఓ ధర్మశాస్త్ర
పులిపాలు తెచ్చావు ఓ పుణ్య మూర్తి
"లేవయ్య లేవయ్య "
కొండ గుట్టలు దాటి మేము వచ్చాము
మా కోరికలు తీర్చ గా లేచి రా స్వామి
మానవ జన్మ ఎత్తి పాపాలు చేసేము
పుణ్యాన్ని కోరుతూ నీకొండకు వచ్చేము
"లేవయ్య లేవయ్య "
సన్నిధానం చేరి చాలాసేపు అయింది
లేచి కూర్చో స్వామి మేము చూస్తాము
ఆవు నెయ్యి తెచ్చాము అభిషేకమునకు
అటుకులు తెచ్చాము ఆరగించవయ్యా
"లేవయ్య లేవయ్య'
మోగింది మోగింది గుడిలోని గంట
స్వామివారు నిద్రలేచినారంట
ఎక్కండి ఎక్కండి స్వాముల్లారా మీరూ
మూడార్ల మెట్లెక్కి పైకిరండయ్య
"లేవయ్య లేవయ్య "
అదిగదిగో చూడండి అయ్యప్పస్వామి
శబరి పీఠం మీద చిన్ముద్ర దారి
తెచ్చిన ముడుపులను స్వామికి ఇవ్వండి
మీ పాప భారాన్ని తగ్గించుకోండి
"లేవయ్య లేవయ్య "
మా తల్లిదండ్రులను కాపాడు స్వామి
మా అన్నదమ్ములను ఆదరించవయ్యా
మా ఆడపడుచులను కాపాడు దేవా
మా బంధుమిత్రులను కరుణించవయ్యా
మా భార్య పిల్లలను కాపాడు స్వామి
మళ్లీ వచ్చే ఏడు నీకొండకు వస్తాము
స్వామియే శరణం శరణం అయ్యప్ప
నీ నామమే మాకు శ్రీరామరక్ష
"లేవయ్య లేవయ్య "


ఈ పాటను ఎలా పాడాలో ఇక్కడ టచ్ చేసి వినండి.


#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
💬 Chat 📢 Follow