మాల ధరించకూడని పరిస్థితులు
1. తల్లిదండ్రులు మరణించిన ఒక సంవత్సరము వరకు దీక్ష స్వీకరించరాదు.2. భార్య మరణించిన ఆరు మాసముల వరకు దీక్ష స్వీకరించరాదు.
3. కూతురు, కోడలు, అల్లుడ, మరణించిన (41) రోజుల వరకు దీక్షస్వీకరించరాదు.
4. ఇంటిపేరు గలవారు మరణించినచో వారి సృష్టి (సూతకం) కాలం (11) రోజులు అయిపోయేవరకు దీక్ష స్వీకరించరాదు.
5. భార్య, కూతురు, కోడలు, మరదలు, 7వ నెల గర్భిణి అయినచో దీక్ష స్వీకరించరాదు. ఎవరైనా తెలియక దీక్ష తీసుకొన్ని యెడల మధ్యలోనే మాల విసర్జన చేయవలసియుండును.
6. బంధు వర్గములో ఎవరైనా చనిపోయిన యెడల విషయము తెలిసిన వెంటనే గురుస్వామిని సంప్రదించి మాలవిసర్జించవలయును.
7. మనవళ్ళు, మనుమరాళ్ళు, దాయాదులు మరణించినచో 21 దినముల వరకు దీక్ష స్వీకరించరాదు.
8. గోత్రము (ఇంటిపేరు) గలవారు రక్తసంబంధీకులు మకణిస్తే 13 దినముల వరకు దీక్ష స్వీకరించరాదు.
9. భార్య మరణించినచో 6 మాసాలు దీక్షగైకొనరాదు.
10. సోదరులు, పుత్రులు, అల్లుండ్లు, మేనత్తలు, మేనమామలు, తాత, బామ్మ, మున్నగవారు మరణించన 30 రోజులవరకు దీక్షగైకొనరాదు.
11. ఆత్మీయులు, మిత్రులకు 3 దినముల వరకు దీక్ష స్వీకరించరాదు.