గురుదక్షిణ
గురుస్వామికి శక్తికొలది గురుదక్షిణ తప్పక ఇవ్వవలెను. మొదట మాలవేయునపుడు, ఇంటి యందు భజన, పూజ చేసినపుడు, ఇరుముడి కట్టిన తర్వాత, వనయాత్ర ఆరంభమున, ఎరుమేలియందు, అళుదానదిలో రాళ్ళు తీసుకున్న తర్వాత, పంపానదిలో పంపాసద్ది తర్వాత, ఇరుముడి ఎత్తినపుడు, సన్నిధానములో స్వామి ప్రసాదము తీసుకొనునపుడు, చివరగా ఇల్లు చేరినతర్వాత మాలను తీయునపుడు ఈ విధముగా 9 పర్యాయములు శక్తి కొలది గురు . దక్షిణ సమరించుకొనవలెను.