అమ్మా దుర్గమ్మ... తల్లి దుర్గమ్మ
మమ్మేలగా కొండలు దిగిరావే...మా
చల్లని తల్లి
నీ బిడ్డల బాధలు కనరావే .. మా బంగారు
తల్లి (అమ్మా)
కలకత్తాలో వెలిసిన కాళికవే.. ఓ ఉగ్ర రూపమా
శ్రీశైలం లో వెలిసిన అంబికవే.. ఓ
శాంతరుపమా
మధురలోన మేనాక్షివి నీవే....,
కంచిలోన కామాక్షివి నీవే..., బెజవాడ ఆ దుర్గవు నీవే.., బాసరలో వెలిసిన శారద
నీవే.... (అమ్మా)
ఇంట వెలసిన దీపం నీవమ్మా...
ధనలక్ష్మి రూపమా
ముచ్చట గోలోపే ముద్దుగుమ్మవమ్మ ఓ
గౌరీ రూపమా
బొంబాయిలో ఆ అమ్మవు నీవే...,
దుర్గాపూరు భావనివి నీవే.., చోటానిక్కరు భగవతి నీవే.., మైసిగండి మైసమ్మవు నీవే... (అమ్మా)
నిత్య పూజలు హారతి నీకమ్మా.. ఓంకార
రూపమా
దూపదీప నైవేద్యం నీకమ్మా ఆరాధ్య
దైవమా
పొలిమేర పోచమ్మవు నీవే.., ఉజ్జయిని
మహంకాళివి నీవే.., శబరి కొండపై వేలిసియున్న ఆ మాలిక మంజు మాతవు నీవే.... (అమ్మా)