ఏమి చేతురా ఎట్లా చేతురా శ్రీశైల లింగా
మదిలో వెలసిన దేవుడు నీవే మహాకాళ లింగా
మహిమలు గల దేవుడవయ్యా మంజునాథా యా
సిరులను ఇచ్చే దేవుడవయ్య శ్రీశైల వాసాయ
గరళము మింగిన దేవుడవయ్య గంగాధరుడవయ్యా
నాగు పాములను మెడలో దాల్చిన నాగేంద్ర హారాయ
గంగను తలపై దాల్చిన నీవే గంగాధరాయ
చంద్రుని సిగలో ఉంచిన వయ్యా చంద్రశేఖరాయ
నిన్నే నమ్మిన భక్తులకు కష్టాలు ఎలా అయ్యా
కావగ రావా బ్రోవగ రావా కైలాస వాసాయ
కలలోనైనా మరువను తండ్రి కైలాస లింగా
ఇలలో వెలసిన దైవము నీవే శ్రీశైల లింగ
మదిలో వెలసిన దేవుడు నీవే మహాకాళ లింగా
మహిమలు గల దేవుడవయ్యా మంజునాథా యా
సిరులను ఇచ్చే దేవుడవయ్య శ్రీశైల వాసాయ
గరళము మింగిన దేవుడవయ్య గంగాధరుడవయ్యా
నాగు పాములను మెడలో దాల్చిన నాగేంద్ర హారాయ
గంగను తలపై దాల్చిన నీవే గంగాధరాయ
చంద్రుని సిగలో ఉంచిన వయ్యా చంద్రశేఖరాయ
నిన్నే నమ్మిన భక్తులకు కష్టాలు ఎలా అయ్యా
కావగ రావా బ్రోవగ రావా కైలాస వాసాయ
కలలోనైనా మరువను తండ్రి కైలాస లింగా
ఇలలో వెలసిన దైవము నీవే శ్రీశైల లింగ