దేవుడొచ్చినాడురో / Devudochinaduro - అయ్యప్ప భజన పాటల లిరిక్స్

P Madhav Kumar
దేవుడొచ్చినాడురో సూడరో సూడరా
 అయ్యప్ప స్వామిరో వచ్చెరో వచ్చెరా
దేవుడొచ్చినాడురో సూడరో సూడరా (2)
అయ్యప్ప స్వామిరో వచ్చెరో వచ్చెరా (2)
 ఓ దేవా మా దేవా మా కొసమే వచ్చినావ..
స్వామి.. ఓ దేవా.. స్వామి.. మా దేవా.. స్వామి.. మా కొసమే వచ్చినావ



ముక్కోటి దేవుళ్ళను ముందుగానే కొలిచినాము (2)
నువ్వు ఒక్కడివే దేవుడని ఇప్పుడు తెలుసుకున్నాము (2)
మనసంతా ఇప్పేసి ఎదలన్ని చెప్పేద్దాం..
స్వామి .. మనసంతా ఇప్పేసి ఎదలన్ని చెప్పేద్దాం
హరిహరా తనయుడా అందరి దేవుడా  ఆపదలో ఆదుకొనే శబరిమలై నాధుడా......  (దేవుడొచ్చి)



రంగు రంగు పూలు తెచ్చి హారలే వేసినాము (2)
పుట్టతేనె పాలతొటి ఫలహారము చేసినాము (2)
పాదాలే కడిగేము నీ పూజలే చేసేము (2)
గణపతి సోదరుడా జ్యోతీస్వరూపుడ కార్తికేయ సోదురుడా కాంతిమలై వాసుడా...... (దేవుడొచ్చి)



పగలంతా పనిచేసి అలసిసొలసి పోయినాము (2)
సందెవేళ కాగానే అలయంబు చేరినాము (2)
ఆడేము పాడేము ఆనందమే పొందేము
ఆడేము.. స్వామి.. పాడేము.. స్వామి.. ఆనందమే పొందేము
ఎరిమేలి వాసుడా వావరకు మిత్రుడా కరిమలై వాసుడా పంబానది బాలుడా........  (దేవుడొచ్చి)



 దేవుడొచ్చినాడురో సూడరో సూడరా
అయ్యప్ప స్వామిరో వచ్చెరో వచ్చెరా
ఓ దేవా మా దేవా మా కొసమే వచ్చినావ
ఓ దేవా.. స్వామి.. మా దేవా.. స్వామి.. మా కొసమే వచ్చినావ
మా కొసమే వచ్చినా.........
మా కొసమే వచ్చినా..........
మా కొసమే వచ్చినావ...

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat