సత్యము జ్యోతిగ / Satyam Jyothiga - అయ్యప్ప భజన పాటల లిరిక్స్

P Madhav Kumar

శరణం శరణం అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప
శబరీషా అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప

సత్యము జ్యోతిగ వెలుగునయా నిత్యము దానిని చూడుమయ
పరుగున మీరు రారయ్య శబరిగిరికి పోదాము  ||శరణం||

హరిహర మానస సుతుడైన సురలు మొరలను ఆలించి
ధరణిలో తాను జన్మించి పదునాల్గేండ్లు వసియించి  ||శరణం||

 ఘోరాడవిలో బాలునిగా సర్పము నీడలో పవలించి
వేటకు వచ్చిన రాజునకు పసిబాలునిగా కనిపించి    ||శరణం||

మణికంఠ అనునామముతో పెంచిరి రాజును మురిపంగా
స్వామి మహిమతో రాజునకు కలిగెను సుతుడు మరి ఒకడు  ||శరణం||

గురువాశ్రమంలో చదివింప గురుపుత్రున్ని దీవింప
మాటలు రాని బాలునకు మాటలు వచ్చెను మహిమలతో    ||శరణం||

మాత పితలను సేవించి మహిషిని తాను వదియించి
శబరిగిరిలో వెలిసెనుగా మనలను దన్యుల చేయుటకు       ||శరణం|

అయ్యప్పా అను నామముతో శిలారూపముగా తానున్న
జ్యోతిస్వరూప మహిమలతో భక్తుల కోర్కెలు తీర్చునయ్యా   ||శరణం||

మార్గశిరాన మొదలెట్టి నలుబది దినములు దీక్షలతో
శరణనని భజనలు చేయూచు ఇరుముడి కట్టి పయనించు  ||శరణం||

భోగికి ముందు చేరాలి మకర సంక్రాంతిని చూడాలి
చాలు చాలు మనకింకా వలదు వలదు ఇక జన్మ ||శరణం||.

మకర సంక్రాంతి దినమున సాయంకాల సమయములో
సర్వం వదిలిన సత్ పురుషులకు జ్యోతిగ దర్శనమిత్తువయా ||శరణం||


పాలాభిషేకం స్వామికి నెయ్యాభిషేకం స్వామికి
తేనాభిషేకం స్వామికి పూలాభిషేకం స్వామికి    ||శరణం||

కర్పూరహారతి తనకెంతో పానకమంటే మరిఎంతో
శరణన్న పదము యింకెంతో ఇష్టం ఇష్టం స్వామికి  ||శరణం|| .

హరిహరాసనం స్వామిది-సుందరరూపం స్వామిది ,
కన్నులపండుగ మనకెలె-జన్మతరించుట మనదేలే ||శరణం||

 శరణం శరణం మా స్వామి శరణం శరణం శరణమయా
శరణం శరణం అయ్యప్పా దరకి చేర్చుకో మా స్వామి    ||శరణం||

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat