స్వామియే శరణం శరణం శరణం అయ్యప్ప
ఐదు కొండల దేవా మా దైవం నీవేగా (2)
కొండ కోనల నడుమ ఐదు కొండల పైన
శ్రీ శంభు విష్ణువుల తనయా నీవే శరణుఘోష ప్రియుడు
నా మొర ఆలకించి రావా
స్వామియే శరణం శరణం శరణం అయ్యప్ప
ఐదు కొండల దేవా మా దైవం నీవేగా (2)
శబరిగిరి శిఖరాన పంబానది తీరాన
వెలసినవా మా వేలుపుగా శశి పాలుకు తనయుడుగా
స్వామి శబరి గిరిషునిగా
స్వామియే శరణం శరణం శరణం అయ్యప్ప
ఐదు కొండల దేవా మా దైవం నీవేగా (2)
కార్తీక మాసం నీకు బహు పుణ్య దినములే మాకు
నీ మాల వేసి మేము నియమనిష్టలతో నిన్ను కొలిచేము
స్వామి నిన్నే వెడేదము
స్వామియే శరణం శరణం శరణం అయ్యప్ప
ఐదు కొండల దేవా మా దైవం నీవేగా (2)
కృష్ణవర్ణ వస్త్రముతో కృష్ణ తులసిమాలలతో
పదిలమైన మా మానస ముందు ప్రతిదినము
స్వామి నిన్నే వేడుకొందుమయ్య
స్వామియే శరణం శరణం శరణం అయ్యప్ప
ఐదు కొండల దేవా మా దైవం నీవేగా (2)
మెట్టు మెట్టు కొక అర్థం భక్తులకు అది పరమార్థం
తుది మెట్టున నీ రూపము చూసి మురిసిపోతిమ్మయ్య
మామది పరవశించేనయ్య
స్వామియే శరణం శరణం శరణం అయ్యప్ప
ఐదు కొండల దేవా మా దైవం నీవేగా (2)
నాలుగు దిక్కులు నీకు పడ్నాలుగుభువనాలు
పడిమెట్లు గా మారినే మొఖి ఎక్కి తుదిమెట్టు గా మారే
స్వామి నీ రూపం స్వామి జగతికి దివ్య వరం
స్వామియే శరణం శరణం శరణం అయ్యప్ప
ఐదు కొండల దేవా మా దైవం నీవేగా (2)
మకర సంక్రాంతి సంధ్యా సమయం జ్యోతి రూపముగా చూసి
మా దేహం ముందు ప్రతి అణువణువు స్వామి స్వామి అంటూ
నీ నామం పలుకుతున్న మయ్య
స్వామియే శరణం శరణం శరణం అయ్యప్ప
ఐదు కొండల దేవా మా దైవం నీవేగా (2)