కారడవుల్లో ఉన్నావా ఈ వార్తను విన్నావా (2)
ఎందరో స్వాములను తీర్చిదిద్దిన మా సూర్య ప్రకాష్ గురు స్వామి.....
నీ సన్నిధి చేరుకున్నాడా అయ్యప్ప
నీ శబరి స్వర్గంలో ఉన్నాడా
ఓ........మణికంఠ ఓ........ మణికంఠ
నీ దారి నడిచినప్పుడు మేమలసిపోయినప్పుడు
మాచెంత కొచ్చి స్వామీ సేవలు చేసినడు...
కాళ్ళకు ముల్లిరిగినప్పుడు కన్నీళ్లు వచ్చినపుడు
పాదాల ముల్లు తీసి ప్రాణం అయినాడు....
10 మంది నోట స్వామి మనసై పోయినడు....
గురుస్వాములు కలిసినప్పుడు గుర్తుకొస్తున్నడు....
తారతమ్యం లేనోడు తల్లిదండ్రులోలే చూశాడు (2)
కంటి రెప్ప పాటున వెళ్లి కన్నీరే మిగిలించాడు
ఓ........మణికంఠ ఓ........ మణికంఠ (కారడవుల్లో)
వేలాది స్వాములకు వెన్నంటి నిలిసేనని
సూర్య ప్రకాష్ గురు స్వామి కవాలంటుర్రు
నియమాల మాల మెడలో పడుతున్నప్పుడు
గురు స్వామి చేతులు లేవని గల్లుమంటున్నరు
గురు స్వామి మమ్మల వదిలి ఎక్కడ ఉన్నాడని
ఓ స్వామీ నీ బొట్టుంటే మాకు పంపామని
స్వామీ కొలుస్తున్రు... నిత్యము నిన్నే తలుస్తున్రు (2)
హరిహర తనయ ఓ అయ్యప్ప గురు స్వామే కావాలంటున్న రు.
ఓ........మణికంఠ ఓ........ మణికంఠ (కారడవుల్లో)
దారోంటి మేం పోతున్నా వేలాది స్వాముల ఉన్నా
పేరు పెట్టీ మము పిలిచి ప్రేమగా మాట్లాడి....
తనయుడి లా చేర్చుకొని తన గుండెలకు హత్తుకొని
ఆప్యాయంగా అందరినీ అడిగి ఆనందించి..
పోతా స్వామెంటు మతో చివరిగా మాట్లాడి
మళ్లీ కనిపించలేదు మా సూర్య ప్రకాష్ గురు స్వామి
నీ సన్నిధి కే చేరేనని కళలో కొచ్చి చెబితివి
నిన్ను వేడుకుంటిమి స్వామి ఆ గురు స్వామి అందరి వాడని
ఓ........మణికంఠ ఓ........ మణికంఠ. (కారడవుల్లో)