గంగం గణపతి గణనాధా - దండాలయ్యా గణనాదా
శివశివమూర్తివి గణనాధా - పార్వతి తనయా గణనాధా॥గం॥
లోకాలేలే గణనాధా మమ్మేలగరావా గణనాధా.
చల్లగ బ్రోచే గణనాధా మము దీవించయ్యా గణనాధా॥గం॥
మూషిక వాహన గణనాధా - గుంజీలు తీస్తాం గణనాధా
పండ్లు పూలు కాయలతో నీకు పూజలు చేస్తాం గణనాధా. ॥గం॥
పాలవెళ్లినే కట్టాము నీ మట్టి బొమ్మనే తెచ్చాము.
కొలువు తీరరా గణనాధా - మా ఇంటనుండరా గణనాధా. ॥గం॥
ఏటా నిన్ను గణనాధా - కొలిచేమయ్యా గణనాధా
ఇంటిల్లిపాది అందరము నిను మొక్కేమయ్య గణనాధా
॥గం॥