*కంచిలో బంగారుబల్లి కథ* / Kanchi lo Bangaru Balli Katha

P Madhav Kumar


*బంగారు బల్లి అంటే ఎవరికైనా యిట్టె గుర్తొచ్చేది తమిళనాడులోని కంచిలో గల కామాక్షి అమ్మవారి ఆలయం.* 

*అక్కడి ఆలయంలో బంగారు తొడుగులతో ఏర్పాటు చేసిన బల్లిని ముట్టుకుంటే దోషం వెళ్లి ఫలితం లభిస్తుందని భక్తుల నమ్మకం.*

*ఈబంగారు బల్లి గురించి ఒక పురాణ గాధ ఉంది.* 

*అదేమిటంటే గౌతమ మహర్షికి ఇద్దరు శిష్యులు ఉండేవారు. ఎప్పటిలాగే శిష్యులు కుండ పట్టుకొని నది తీరానికి వెళ్లి నీటిని తీసుకొస్తుండగా అందులో బల్లి పడింది. వారు చూసుకోలేదు.*

*దీన్ని గమనించిన గౌతమ మహర్షి శిష్యులిద్దరినీ బల్లి వలె మారిపొమ్మని శపించారు.* 

*శాప విముక్తి కోసం ఇరువురూ మహర్షిని వేడుకొనగా, కాంచీపురం లోని వరదరాజపెరుమాళ్ ఆలయానికి వెళ్ళమని, అక్కడ పరిష్కారం లభిస్తుందని చెప్తాడు.*

*ఇద్దరూ కూడా    సరే అనుకొని వరదరాజపెరుమాళ్ ఆలయానికి వెళ్తారు. బల్లుల రూపంలో ఉండి స్వామి వారిని నిత్యం ప్రార్ధించగా, ఒకానొక రోజు శాపం నుండి వారిద్దరికీ విముక్తి లభిస్తుంది.* 

*ఈ సమయంలో సూర్యుడు, చంద్రుడు సాక్ష్యంగా ఉండటంతో బంగారు, వెండి రూపంలో శిష్యుల శరీరాలు బొమ్మలుగా ఉండి, భక్తులకు దోష నివారణ చేయమని ఆదేశిస్తాడు.*

*బంగారం అంటే సూర్యుడు, వెండి అంటే చంద్రుడు అనే అర్థం వస్తుంది.* 

*సరస్వతి దేవి నుండి శాపం పొందిన ఇంద్రుడు దోష నివారణకై పెరుమాళ్ ఆలయంలో బల్లులను ప్రతిష్టించినట్లు మరో కధనం కలదు.*

*ఇంట్లో బల్లి తిరుగుతున్నప్పుడు అది మీద పడితే ఎట్లా? అనే అపోహ అందరికీ ఉంటుంది. అలా పడినపుడు వెంటనే కామాక్షి ఆలయంలోని బల్లిని తలుచుకొని స్నానం చేసి, ఇష్టదైవాన్ని ఆరాదిస్తే దోషం పోతుందంటారు.* 

*ఏమోఇంకా దోషం ఉందేమో అనుకునేవారు కంచి అమ్మవారిని దర్శించుకొని బల్లులను తాకుతారు.*✍️

.                      🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat