వెన్నెలమ్మ వెన్నెల శబరి కొండల్ల వెన్నెల
నా చిన్ని అయ్యప్ప వెలసిన కొండల నిత్య పున్నమి వెన్నెల
॥వెన్నెల॥
ఓరోరి వెన్నెల ఓ ! చిన్ని వెన్నెల బంగారు వెన్నెల
రతనాల వెన్నెల ఒక్కమాట నీవు స్వామితో చెప్పవే
ఒక్కసారి వచ్చిపొమ్మని చెప్పవే ॥2॥
చూడవమ్మ చూడవే చేసేటి ఈ ! పూజలు
పొద్దు పొద్దున లేచి కన్నె స్వాములు చేసే స్వామి మండల పూజలు మా ! కన్నె స్వాముల పూజలు
చేసేటి పూజలు స్వామి కోసమే మొక్కేటి మొక్కులు స్వామి కోసమే పాడేటి పాటలు స్వామి కోసమే నేను బతుకుతున్నది స్వామికోసం
నేను బతుకుతున్నది స్వామికోసం
చెప్పవమ్మ చెప్పవే చిన్నారి మా ! అయ్యతో
కలికాలమందున కన్నబిడ్డలు పడే కష్టాలు మా ! అయ్యతో
స్వామి మముగన్న మా ! అయ్యతో
తల్లిదండ్రుల మధ్య ప్రేమ లేదమ్మా అన్నదమ్ముల మధ్య ఆస్తి గొడవలమ్మ అన్నీ ఉన్నవాడికి ఆకలే లేదమ్మ ఆకలున్నవాడికన్నమే లేదమ్మ ॥2॥
వెళ్ళవమ్మ వెళ్ళవే వెళ్ళి స్వామితో చెప్పవే
బంగారు మా ! అయ్య మణికంఠస్వామిని వచ్చిపొమ్మని చెప్పవే ఒక్కసారి రమ్మని చెప్పవే
కర్పూరమల్లె నే ! కరిగిపోతున్నా కన్న బిడ్డలపైన కక్షఎందుకమ్మ కనికరించి కరుణచూపమనవమ్మా
ఒక్కసారి వచ్చిపొమ్మనవమ్మా ॥2॥