తొలియాత్రికుడా శరణాగతుడా //2//
ఇరుముడిమూటను తలను పెట్టి కొండకోనలు దాటి దాటి //2//
పదునెనిమిది మెట్లెక్కుట ఎప్పుడు ఎప్పుడయా //2//
మండల జ్యోతికా మకర జ్యోతికా //2//
అయ్యప్ప దింతక తోం స్వామి దింతక తోం
స్వచ్ఛంగా స్నానమాడి అయ్యప్పను తలచుకొని శరణం శరణం అంటు వేడుకొంటివా
కొబ్బరాకుల పందిరివేసి ముడుపుమూట చేర్చి కట్టి
శబరిగిరి పోవుటకు సిద్ధమైతివా
అయ్యప్ప దింతక తోం స్వామి దింతక తోం
ఎరుమేలి పుణ్యస్థలం ముట్టుకోవలె
విభూది రాశి పేట్టతుళ్ళి పాటపాడుదాం
చిన్ని చిన్ని గుడిసెలలో భజన చేయాలి
పిదప అడవులన్ని దాటి దాటి పంపాచేరాలి
అయ్యప్ప దింతక తోం స్వామి దింతక తోం
గణపతికి కొబ్బరికాయ కొట్టి చూపాలి
పిదప ముడుపుమూట తలను పెట్టి కొండ ఎక్కాలి
పద్దెనిమిది మెట్లెక్కి అయ్యని చూడాలి
పిదప అభిషేకం అంతా కళ్ళార చూడాలి
అయ్యప్ప దింతక తోం స్వామి దింతక తోం
*శ్రీ ధర్మశాస్తా వాట్సాప్ గ్రూప్స్*
9849100044