తులసీ దళాలతో తుల తూచుదామంటే ||2||
రుక్మిణమ్మను నేను కానయ అయ్యప్పా
అంత భక్తి నాకు లేదయా
||తులసి దళాలతో||
ఏటేటా నీ కొరకు ఎదురు చూచుదమంటే ||2||
మంజుమాతను నేను కానయా అయ్యప్పా అంత ప్రేమ నాకు లేదయా ||2||
||తులసి దళాలతో||
జగమెల్ల నీ గుడులు నేనే నిర్మిద్దమంటే ||2||
రామదాసును నేను కానయా అయ్యప్ప
అంత ధనము నాకు లేదయా || 2||
||తులసి దళాలతో||
వేల వేల కీర్తనలు నీకై రచిఇద్దుమ్మంటే ||2||
అన్నమయ్యను నేను కానయా అయ్యప్ప
కారణాజన్ముని కానయా ||2||
||తులసి దళాలతో||
మధురంగా నీ పాటలు నేనే పాడుదమంటే ||2||
జేసుదాసును నేను కానయా అయ్యప్పా
అంత గళము నాకు లేదయా ||2||
||తులసి దళాలతో||
మెల్ తాంత్రి పూజలను నేనే చేయుదమంటే ||2||
కేరళలో పుట్టలేదయా అయ్యప్ప
మలయాళం నాకు రాదయా ||2||
||తులసి దళాలతో||
ఎంతో వైభోగంగా పడి పూజను చేద్దమంటే ||2||
జనార్ధన్ గురు స్వామిని కానయా అయ్యప్ప
అంత శక్తి నాకు లేదయా || 2||
||తులసి దళాలతో