45. తులసీ దళాలతో / Tulasi dalalato l అయ్యప్ప భజన పాటల లిరిక్స్
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം

45. తులసీ దళాలతో / Tulasi dalalato l అయ్యప్ప భజన పాటల లిరిక్స్

P Madhav Kumar

తులసీ దళాలతో తుల తూచుదామంటే ||2||
రుక్మిణమ్మను నేను కానయ అయ్యప్పా
అంత భక్తి నాకు లేదయా
||తులసి దళాలతో||
ఏటేటా నీ కొరకు ఎదురు చూచుదమంటే ||2||
మంజుమాతను నేను కానయా అయ్యప్పా 
అంత ప్రేమ నాకు లేదయా ||2||
||తులసి దళాలతో||
జగమెల్ల నీ గుడులు నేనే నిర్మిద్దమంటే ||2||
రామదాసును నేను కానయా అయ్యప్ప
అంత ధనము నాకు లేదయా || 2||
||తులసి దళాలతో||
వేల వేల కీర్తనలు నీకై రచిఇద్దుమ్మంటే ||2||
అన్నమయ్యను నేను కానయా అయ్యప్ప
కారణాజన్ముని కానయా ||2||
||తులసి దళాలతో||
మధురంగా నీ పాటలు నేనే పాడుదమంటే ||2||
జేసుదాసును నేను కానయా అయ్యప్పా
అంత గళము నాకు లేదయా ||2||
||తులసి దళాలతో||
మెల్ తాంత్రి పూజలను నేనే చేయుదమంటే ||2||
కేరళలో పుట్టలేదయా అయ్యప్ప
మలయాళం నాకు రాదయా ||2||
||తులసి దళాలతో||
ఎంతో వైభోగంగా పడి పూజను చేద్దమంటే ||2||
జనార్ధన్ గురు స్వామిని కానయా అయ్యప్ప
అంత శక్తి నాకు లేదయా || 2||
||తులసి దళాలతో||
ఈ పాటను ఎలా పాడాలో ఇక్కడ టచ్ చేసి వినండి.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
💬 Chat 📢 Follow