▪️ *సామాన్యంగా లోకంలో ముక్తి అంటే ఏవో పైనున్న లోకాలకు వెళ్ళి కైలాసం, వైకుంఠం, లేదా స్వర్గానికి వెళ్ళి సుఖాలు అనుభవించటమే అని అనుకుంటారు.*
▪️ *అందుకే అంటారు. పూజలు, యజ్ఞాలు, దానాలు, వ్రతాలు చేసుకోకపోతే ముక్తి ఎలా వస్తుంది? వాడు పిల్లికి బిచ్చం పెట్టడు, ఫలానా వాడు ఎంగిలి చేత్తో కాకిని తోలడు, వాడికి పూజా లేదు పునస్కారం లేదు. ఇంక వాడేం మోక్షాన్ని పొందుతాడు? అని..!’*
▪️ *అంటే మోక్షాన్ని గనక పొందాలంటే పూజా పునస్కారాలు చెయ్యాలని, భక్తితో భగవంతుని కొలవాలని, జపతపాలు చేయాలని, దానధర్మాలు చేయాలని--ఇలా చేస్తేనే ముక్తి అని అంటూ ఉంటారు - సామాన్యంగా.*
▪️ *మరిఇక్కడశంకరాచార్యుల వారు స్పష్టంగా చెబుతున్నారు. శాస్త్రాలను గురించి బాగా ఉప న్యాసాలిచ్చినా, యజ్ఞాలు చేసి దేవతలను ఆహ్వానించి తృప్తి పరచినా; సత్కర్మలు - పుణ్య కార్యాలు ఎన్ని చేసినా, దేవత లను ఎంతగా పూజించినా ముక్తిలేదు.*
▪️ *వందమంది బ్రహ్మలకాలం అంటే కోటానుకోట్ల జన్మలు ఇలా చేసినప్పటికీ ముక్తి రాదు - అని.*
♦️ *మరి ఎలా వస్తుంది?*
▪️ *'ఆత్మైక్య బోధేన' - నేను ఆత్మను అని అనుభవరీత్యా గ్రహిస్తే తప్ప ముక్తిలేదు.*
▪️ *పైన చెప్పిన కార్యాలన్నీ సత్కార్యాలే, వాటిని సక్రమంగా చేసినట్లైతే స్వర్గ లోకాలకు వెళ్ళి అక్కడ భోగాలు అనుభవించ టం కూడా నిజమే. అయితే పుణ్యఫలం ఖర్చై పోగానే తిరిగి ఈ లోకంలోకి రావాలాల్సిందే. మళ్ళీ చరిత్ర ప్రారంభించవల సిందే. అయితే ముక్తి పొందా లను కున్నవారు - మోక్షప్రాప్తిని కోరేవారు ఇవన్నీ చెయ్యాల్సిన పనిలేదా? చేయకూడదా? అంటే చేయాల్సిందే. అయితే ఎలా చేయాలి? ఎందుకు చేయాలి? మన మనోబుద్ధుల యొక్క అలజడులు తగ్గించి శాంత పరచుకోవటానికి - నిష్కామంగా - ఎట్టి కోరికలు లేకుండా కర్మలను చేయాలి. అంతవరకే వీటి ప్రయోజనం.*
(వివేక చూడామణి: ఆచార్య శంకరులు)
*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
♦️ *మోక్షం ఎలా -పొందాలి?*♦️
➖➖➖
▪️ *భగవంతుడు ప్రతి మనిషికి.... ఈ శరీరం నీదికాదు. ఇది నీ అద్దె ఇల్లు అని మూడు అవకాశాలు ఇస్తాడు.*
▪️ *ఒకటి కళ్ళకి చత్వారం,*
▪️ *రెండు పళ్ళు ఊడగొడతాడు,*
▪️ *మూడు జుట్టు నెరిసిపోతుంది...*
▪️ *1. మొదటిది వచ్చినప్పుడు అర్థం చేసుకోకుండా డాక్టర్ దగ్గరి కి వెళ్లి కళ్ళజోడు తగిలిస్తాం. తెలుసుకోము ఎందుకు జరిగిందని.*
▪️ *2. రెండోది వచ్చినప్పుడు పళ్ళకి టింకరింగ్ వేయిస్తారు, రకరకాల పేస్ట్స్ వాడి ఉన్నవి కూడా ఊడగొట్టుకొని పళ్ళు కట్టించుకుంటారు, అయినా అర్థం కాదు.*
▪️ *3. మూడు తలమెరుపు.. జుట్టంతా తెల్లబడి మూడో వార్నింగ్ వచ్చినా సరే.. ఊహు ఈ ఇల్లు నాది. అని రంగులు వేస్తారు. అప్పటికి అర్థంకాదు.*
▪️ *4. నాలుగు చివరిది…*
▪️ *యముడు దిగుతాడు రంగంలోకి.. మెడకి తాడు వేసి లాక్కొని వెళుతూ...*
▪️ *”ఒరేయ్ ఈ శరీరం నీది కాదు అని ఎన్ని నోటీసులు పంపినా వినకుండా ‘నాది నాది’ అంటేదానిఓనర్ఊరుకుంటాడా! ఇంటికి అద్దె కట్టే యజమాని అంటే భయం ఉంది గాని ఈ శరీరం అద్దెకిచ్చిన యజమాని అంటే భయం లేదు.*
▪️ *తెలుసుకోవడానికిప్రయత్నం కూడా చేయకుండా నాది నాది అన్నావ్. ఏది ఇప్పుడు చూపిం చు నీది అనేది ఏది ఉందో!” అని నరకంలో పడేసి నానాయాతన లు పెట్టి.. “ఒరేయ్ ఈసారైనా తెలుసుకొని మలుచుకో”మని పంపుతాడు.*
▪️ *సద్గ్రంధాలు చదివి, సద్గురువులని ఆశ్రయించి, సత్సంగాలు చేస్తూ ఆత్మజ్ఞానం పెంచుకొని సాధనలు చేసి ‘జన్మరహిత్యాన్ని’ అంటే ‘మోక్షం’ పొందాలి..!*
*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
*లోకా సమస్తా సుఖినో భవన్తు*!
హరిః ఓమ్.