*మాటే మంత్రము*

P Madhav Kumar

 

      

*మనిషి మాయలో బ్రతుకుతుంటాడు. మానవ జీవితమంతా తమస్సు, రజస్సు, సత్వ గుణాలతో నడుస్తుంది. వీటి ప్రభావంతో ఏర్పడే కామ,క్రోథ,లోభ, మోహ,మద,మత్సరాలనే అరిషడ్వర్గాలు, మనిషి జీవిత గమనాన్ని అడ్డుకుంటుంటాయి.*

 

*వాక్కు అదుపులో ఉన్న మనిషికి సర్వగుణాలు చేతిలో ఉంటాయి. కోరికల గుర్రాల్ని అదుపు చేయగల శక్తి అలాంటి వారికి లభిస్తుంది.*


*మాట్లాడకుండా, మనసులోని భావాన్ని మాటల ద్వారా వ్యక్తీకరించకుండా ఉండటం మనిషికి చాలా కష్టం. సాధన మీదే అది సాధ్యపడుతుంది.*

 

*మనిషి మౌనంగా ఉంటే ఎన్నో సమస్యల్ని నివారించవచ్చు. మరెన్నో సమస్యల్ని అధిగమించవచ్చు. చేసే పనిపై ఏకాగ్రతను పెంచుకోవచ్చు.*


*నేటికీ చాలా మంది భక్తి పరులు, వారం కి ఒకరోజు ఉపవాసం చేస్తున్నప్పుడు మౌనవ్రతాన్ని అవలంబిస్తుంటారు. ఆరోగ్యపరంగా, మానసిక ప్రశాంతత పరంగా ఎంతో మేలు చేస్తుంది మౌనవ్రతం.*


*ఆధ్యాత్మికంగా ఈ వ్రతంతో చేసేవారి వాక్కుకు శక్తి పెరుగుతుంది. అబద్ధాలు ఆడాల్సిన అవసరం లేని కారణంగా వాక్శుద్ధి అవుతుంది.*

 

*ఎంత కోపం వచ్చినా, మౌనవ్రతంలో ఉన్న కారణంగా ఎదుటివారిని తిట్టకుండా తమను తాము నిగ్రహించుకుంటారు. తద్వారా మానవ జీవితంలో ప్రధాన శత్రువైన కోపాన్ని అధిగమించినట్టే.*


*తుపాకీ గుండు కంటే మాట్లాడే మాట చాలా శక్తి కలిగినది. మౌనవ్రతం కారణంగా అనవసర వ్యాగ్యుద్ధాలు, అశాంతి ఉండవు.*

 

*మాట విలువ తెలిసిన వాళ్లు, దాన్ని తక్కువగా వాడటానికి ఎక్కువ ఇష్టపడతారు.*

 

*వాక్శుద్ధి అనేది చాలా పవిత్రమైంది. నోటివెంట తప్పుడు కూతలు రాని వాళ్లకు, ఎప్పుడూ మంత్రసాధన చేసేవారికి ఈ వాక్శుద్ధి ఉంటుంది. అలాగే ఎక్కువ మౌనాన్ని ఆశ్రయించే వారికి కూడా వాక్శుద్ధి మెండుగా ఉంటుంది.*


*మాటను పొదుపుగా వాడితే, లాభమే తప్ప నష్టం లేదు. పరిమితమైన ఉపవాసం పొట్టకు మంచింది. పరిమితమైన వాక్కు మనసుకు మంచిది.*

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat