వేంకటేశ్వర స్వామిని గోవిందా అని ఎందుకు అంటారు?

P Madhav Kumar
స్వామియే శరణమయ్యప్ప

🚩శ్రీ 🚩

🌸స్వామివారిని గోవిందా.. అని ఎందుకు అంటారు? ఆ పేరు ఎలా వచ్చింది అన్న విషయం చాలా మందికి తెలీదు. గోవిందా అనే నామం కోసం కొండ దిగి వచ్చాడని అంటారు.

🌿ఒకరోజు వేంకటేశ్వర స్వామి అగస్త్యుడి ఆశ్రమానికి వెళ్తాడు. ‘నన్ను శ్రీనివాసుడు అంటారు, మీ ఆశ్రమంలో చాలా గోవులు ఉన్నాయి కదా! అందులో నాకు ఒకటి ఇవ్వు’ అంటాడు.

🌸దానికి సంతోషించిన ఆ మహాముని ‘స్వామి! నీకు ఇవ్వడానికి నాకేమి అభ్యంతరం లేదు. కానీ, మన వేదాల ప్రకారం ధర్మపత్ని లేనిదే గోదానం చేయకూడదని అంటారు.

🌿కాబట్టి, స్వామి.. మీ సతిని తీసుకుని మరోసారి ఈ ఆశ్రమానికి రాగలరు అంటాడు. అలాగే, అని స్వామివారు కూడా వెళ్తాడు. అయితే, అదను చూసుకుని స్వామివారు ఆశ్రమంలో అగస్త్య ముని లేని సమయంలో పద్మావతి అమ్మవారిని తీసుకుని ఆశ్రమానికి వస్తాడు.

🌸ఆ సమయంలో అగస్త్యముని శిశ్యుడు ఉంటాడు. అప్పుడు, వేంటకటేశ్వర స్వామి ‘ మీ గురువుగారు నాకు గోవును ఇస్తాను, సతీసమేతంగా రావాలని అన్నాడు.

🌿అదేవిధంగా వచ్చాను అంటాడు. మరీ నాకు గోవును ఇవ్వవు అని స్వామివారు.. శిశ్యుడిని అంటాడు. కానీ, అతను స్వామి! ఈ సమయంలో మా గురువుగారు ఆశ్రమంలో లేరు. కాబట్టి మీరు మరోసారి ఆయన ఉన్నప్పుడు రాగలరు అని కోరతాడు.

🌸దానికి ఆగ్రహించిన వేంకటేశ్వరస్వామి తిరుమల కొండవైపు గబగబ నడుచుకుంటూ వెళ్లసాగాడు. అంతలో అగస్త్య ముని ఆశ్రమానికి వస్తాడు. శిశ్యుడు జరిగిన వృత్తాంతాన్ని గురువుతో చెబుతాడు.

🌿దాంతో అగస్త్యుడు తన శిశ్యునితోపాటు మరికొంత మందిని తన వెంటబెట్టుకుని గోవును తీసుకుని స్వామి వారి వద్దకు పరుగెడతారు. వేంకటేశ్వర స్వామిని కొద్ది దూరంలో చూసి ‘సామి!’ అని గట్టిగా పిలుస్తారు.

🌸ఆయన ఆగ్రహంతో స్వామి పలకరు. మళ్లీ వారు గోవ విందా అని అంటారు. గోవ అంటే గోవు అని... విందా అంటే ఇదిగో అని అర్థం. అయినా స్వామివారు పట్టించుకోకుండా ముందుకు సాగుతాడు.

🌿స్వామి..గోవు ఇందా.. స్వామి ..గోవు ఇందా అని అరవ సాగుతారు. స్వామి గోవిందా.. గోవిందా.. అంటుండగానే స్వామివారు ఆలయానికి వెళ్లి అదృష్యమైపోతారు. స్వామివారికి ‘గోవిందా’ అనే పేరు అంటే అంత ఇష్టం కాబట్టి, కొందదిగి వచ్చాడు.

🌸ద్వాపర యుగంలో ఇంద్రుని సంతృప్తి పరచడానికి గోపాలులు ఇంద్రుని పూజిస్తారు. దానికి కృష్ణుడు మనం గోపాలులం.. గోవును పూజించాలి అని చెబుతాడు. దీంతో గోవులను పూజిస్తారు.

🌿ఇంద్రుడు భీకర వర్షాలను కురిపిస్తాడు. దానికి ప్రజలు, గోవులు ప్రమాదంలో పడతాయి. దాంతో కృష్ణుడు వాటిని కాపాడటానికి తన చిటికెన వేలుతో గోవర్ధనగిరిని పైకెత్తుతాడు.

🌸పశుపక్షాదులతో సహా అందరూ ఆ కొండ కిందకు చేరుకుంటారు. మరింత కోపోద్రిక్తుడైన ఇంద్రుడు ఏడు రాత్రులు.. ఏడు పగళ్లు ఆగకుండా వర్షం కురిపిస్తూనే ఉంటాడు. ఏమాత్రం కదలకుండా.. కేవలం తన ఏడవ ఏటనే కృష్ణుడు ఏడు రోజులపాటు అలాగే ఉంటాడు.

🌿చివరకు ఆయన కృష్ణపరమాత్ముడని గ్రహిస్తాడు. ఆ సమయంలో తన లేగదూడను కాపాడినందుకు ఒక ఆవు చిన్ని కృష్ణుడికి క్షీరాభిషేకం చేస్తుంది.

🌸గర్వం తగ్గిన ఇంద్రుడు నేను దేవతలకు మాత్రమే అధిపతిని, మీరు గోవులకు కూడా.. కాబట్టి మీరు ఇప్పటి నుంచి ‘గోవిందా’ అని పిలువబడతారు అంటాడు.

🌿ఇప్పటికీ ఈ గిరి ఉత్తరప్రదేశ్‌లోని మధురలో ఉంది. గోవిందా అని పిలుస్తే..

🌸కేవలం వేంకటేశ్వర స్వామి మాత్రమే కాదు విష్ణువు కూడా పలుకుతాడు...స్వస్తి..🚩🌹🙏


#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat