🙏🌺గోమాత గొప్పదనం🌺🙏

P Madhav Kumar
స్వామియే శరణమయ్యప్ప

🌺ఆవుదూడ పుట్టిన మొదటి రోజునే పేడ వేస్తుంది. అప్పుడే పుట్టిన లేగ దూడ మొదటి సారివేసిన పేడ పదివేల రూపాయలకు కూడ ఎక్కడా దొరకదు. అది బ్లడ్‌ క్యాన్సర్‌కు అత్యుత్తమ ఔషధం. ఫిట్సుకు కూడ ఇది ఉపయోగపడుతుంది. దూడ మొదటిసారి పేడ వేయగానే ఆవు దానిని తినివేస్తుంది. అందువలన అది దొరకుట చాలా కష్టం.
పడక కురుపు, పుండు వున్న ఒక స్త్రీకి ఆవు పిడకల బూడిద (కచ్ఛిక) పొడి పుండుకు పట్టించుట మొదలు పెట్టగా నెల రోజులలో పుండు నయమైనది. ఆ పుండు ఎముక కనిపించేంత లోతైనది🌺

🌺 ఆవు పేడతో అగరు వత్తులు తయారవుతాయి. ఆ అగరు వత్తుల బూడిదను ఔషధంగా వాడవచ్చు. పిల్లలకు దెబ్బ తగిలిన, ఆ పొడి రెండు రోజులు వాడిన అది తగ్గుతుంది.

మధుమేహ వ్యాధిగ్రస్థులకు దెబ్బలు, పుండ్లు కూడ ఆవు పేడ బూడిద వ్రాసిన త్వరగా తగ్గుతాయి.

. ఏవైనా విష క్రిములు కుట్టినప్పుడు, (తేనెటీగ, కందిరీగ మొదలగునవి) ఈ బూడిద వేసిన 1 నిమిషంలో తగ్గుతుంది.

వరదలు, తుఫానులు వచ్చినప్పుడు, ఇతర సమయాలలో నీరు బురదగా వున్నప్పుడు, నీరు కాచి త్రాగుతారు. ఒక బిందెడు నీటిలో ఆవు పిడకల బూడిద 1 స్పూను కలిపిన ఆ నీటిని కాయవలసిన పనిలేదు. ఆ నీరు 
త్రాగిన వారికి కలరా, తలనొప్పి, జ్వరము, విరేచనములు రావు. కావున వరద సమయాలలో ఆ బూడిదను పంచిన రోగాలు రావు.🌺

🌺. ప్రయాణాలు చేసే వారు ఆవు కచ్చికల బూడిదను వెంట తీసుకువెళ్ళి బయట నీరు త్రాగవల్సి వచ్చిన బాటిలు నీటిలో 1 చిటికెడు బూడిద కలిపి వాడిన ఎలాంటి రోగాలు రావు. (అగర వత్తుల భస్మం) సేకరించి వుంచుకోండి. ఆవు పేడతో చేసినవి మాత్రమే.
. ఆవు పేడతో చేసిన అగరు వత్తులు వాడిన ఆ ధూపము ఇల్లంతా వ్యాపించి, ఆ ఇంటి దారిద్య్రము తొలగిపోతుంది.

. ఆవు పిడకల పొడితో పళ్ళపొడి తయారు చేసిన, పంటి సమస్యలన్నీ తగ్గిపోతాయి. పంటినొప్పి, కదులుట తగ్గుతుంది. పళ్ళు గట్టిపడతాయి.🌺

 🌺ఆవు పేడతో చేసిన పండ్లపొడిని నోటిలో ఉంచి 5 నిమిషముల తర్వాత పండ్లు వేలితో రుద్దాలి. చిగుళ్ళను వేలితో మర్ధన చేయాలి. బ్రష్‌ను వాడవల్సిన పనిలేదు. వ్రేలితో తోమినప్పుడే పళ్ళు బాగా గట్టిపడతాయి.

. ఈ ఆవు పిడకల పొడి క్రిమిసంహారిణి. అందువలన దీనితో చేసిన పండ్లపొడి ప్రపంచంలోనే ఉన్నతమైన శాస్త్రీయమైన పండ్లపొడి. 
. నాలుకను టంగ్‌క్లీనర్‌ను వుపయోగించి శుభ్రం చేస్తాము. అలా కాకుండా రెండు వేళ్ళతో బాగా రుద్దిన, గొంతులోని ప్రాతం కూడా శుభ్రపడుతుంది.🌺

🌺. ఆవు పేడతో చేసిన సబ్బులు వుపయోగించిన చర్మవ్యాధులు రాకుండా, ఒకవేళ వున్నచో తగ్గుటకు, చెమటలు పట్టుట తగ్గుటకు తోడ్పడుతుంది. ఇతర సబ్బులలో కెమికల్స్‌ కలియుటచే చర్మానికి మంచిది కాదు.
. ఆవు పేడ విషనాశకము. విష పదార్థములు తీసుకున్నప్పుడు, ఆవు పేడతో చేసిన బూడిద నీళ్ళలో కలిపి త్రాగిన విషం విరుగుతుంది. నీటిలో బూడిద కలిపి స్నానం చేయించిన విష ప్రభావము తగ్గుతుంది. 
. పాముకాటుకు గురైన వ్యక్తి చనిపోయినట్లు డాక్టరు చెప్పగా, ఒక యోగి అతని శరీరానికి పలుమార్లు పూర్తిగా ఆవు పేడ పట్టించగా, లోనవున్న విషమంతా విరిగి రెండోరోజుకు అతను శ్వాస పీల్చుకోవడం జరిగింది. అందువలన ఆవుపేడ అద్భుతమైన విష నాశని.
. ఆవు పిడకల పొడిని నీళ్ళలో కలిపి స్నానం చేయాలి. ఒంటికి నలుగు పెట్టవచ్చు. పుల్లటి మజ్జిగలో కలిపి తలకు పట్టించండి. పొడిబారిన చర్మం గల వారు పాలలో కలిపి ఫేస్‌ప్యాక్‌గా వాడవచ్చు. చర్మము స్వచ్ఛమై మృదువుగా తయారవుతుంది. 
దెబ్బతగిలి నొప్పి వున్న చోట, ఇతర నొప్పులకు నీటిలో కలిపి పట్టీ వేయించండి. బాగా అలసినచో, లలాట భాగంలో మందముగా ఆ లేపనాన్ని పూసిన 30 నిమిషాల్లో అది ఆరిపోయి తాజాగా తయారవుతారు.🌺

🌺ఆవు మలం కాదు. దానిని గోమయం అంటారు. దానిని పూజల్లో, యజ్ఞాల్లో, వాకిట్లో కళ్ళాపిగాను, పవిత్ర కార్యాలలోను ఉపయోగిస్తాము. అందువలన అది విశిష్టమైనది.

పొలాల్లో ఆవు పేడను ఎరువుగా ఉపయోగించిన ఆహారపదార్థాలు అద్భుతమైన రుచిని కలిగిస్తాయి. పండ్లు మంచి వాసన కలిగి వుంటాయి. పంజాబ్‌లో రసాయనిక ఎరువులు వాడుట వలన అచట ఎక్కువ మంది క్యాన్సర్‌ వ్యాధికి గురైనారు.🌺

🌺ఇవన్ని మీరు నమ్మకపోవచ్చు ఎందుకంటే ఇది మన సంస్కృతి సంప్రదాయాల్లో భాగమైన గోమాతకు సంబంధించినవి కాబట్టి. అదే ఇంగ్లీషు మందులు తగ్గుతాయో లేదో అనే ఆలోచన కూడా మనకి రాదు. మనల్ని ఈ విధంగా మార్చేసింది మన విద్యావిధానం... 
చెప్పడం మాత్రమే మా బాధ్యత. నమ్మడం నమ్మకపోవడం అది మీ వ్యక్తిగతం.🌺

🌺సర్వేజన సుఖినోభవంతు
జై గోమాత🌺


#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat