రోజూ దీపాలు కడిగి పెట్టే ఓపిక లేదు ఏదైనా ఉపాయం చెప్పండి అని అడిగారు
లోహం దీపం ఏదైనా కడిగి పెట్టాలసిందే, మట్టి దీపాలు నిత్య దీపం కి వాడితే ఒత్తి మారిస్తే సరిపోతుంది మట్టి దీపం కడగాల్సిన పని లేదు, లోహం దీపాలు కాకుండా పాత కాలంలో మట్టి దీపాలే ఎక్కువగా వాడేవారు.. మట్టి దీపం శ్రేష్టం కూడా, పండగలు, పర్వదినాల్లో సమయం ఉంటుంది కనుక ఇత్తడి వెండి దీపాలు పెట్టుకోండి రోజూ వారి దీపారాధన లో మట్టిదీపాలు జతగా ఉంచి దీపం. పెట్టుకోండి. భగవంతుడు ముందు రోజు నీళ్లు పెట్టాలి, చిన్న బెల్లం ముక్క అయినా పెట్టాలి. మంత్రాలు చదివే సమయం లేకుంటే కులదేవత, లేక ఇంటి దేవతగా కొలిచే దైవాన్ని నామ స్మరణచేసి నమస్కరించుకోండి హారతి ఇవ్వండి భక్తిగా ఒక నమస్కారం చేయండి చాలు సమయం ఉన్నప్పుడు ప్రశాంతంగా చేసుకోండి కానీ హడావిడిగా కాసేపు పూజకాసేపు వంట ఈ హడావుడి వద్దు.
రోజూ నూనె దీపాలు తోముతూ సమయం అవుతుంది అనుకునే టప్పడు ఓ రెండు మూడు జతలు దీపాలు అధికంగా ఉంచుకుంటే సమయం ఉనప్పుడు వాడిన దీపాలు శుభ్రం చేసుకోవచ్చు, ఇటువంటి కొన్ని నియమాలు వల్ల రోజూ దీపారాధన చేయడం లేదు అని కొందరు అన్నారు అలా అనకండి దీపం జోతి పరబ్రహ్మము అన్న పదాన్ని ఇంక ఏ కైంకర్యానికి లేదు దీపం ప్రత్యక్ష దైవం ఆ ఉద్దేశం తోనే రోజు దీపం కడిగి పెట్టమంటారు.. అందులో జోతి రూపంలో మీ ఇంటి ఇల వేలుపు కొలువై ఉంటుంది నియమాలు మన క్రమశిక్షణ కోసం శుభ్రత కోసం కొందరు 6 గం ఇంటి నుండి బయలు దేరితే కానీ వారి వృత్తి కార్యాలయానికి చేరుకోలేరు అది వారి నిత్య జీవితం అయినా శ్రమ అనుకోకుండా భక్తిగా దీపం పెట్టి వెళ్ళాలి అనుకున్నారు అందుకు సంతోషం తో కృతజ్ఞతలు కూడా చెప్తున్నాను, ఆ దీపం అమ్మవారు ఆ దీపం అగ్ని దేవుడు ఆ దీపం మహా యజ్ఞం అది మీకు సదా రక్షణగా ఉంటుంది.. ఇటువంటి పరిస్థితి అందరూ దాటి వచ్చిన వాళ్ళమే ఉదయం 5 గం లేచి దీపారాధన చేసి పండో పాలో పెట్టి.. ప్రయాణంలో చెప్పులు విడిచి స్త్రోత్రలు నామజపం మంత్ర జపం చేసుకుంటాము,మనము తీరికగా కాళీగా పని లేనప్పుడు చేద్దాము అనుకోకుండా దేవుడు మనకు ఇచ్చిన అవకాశంలో వినియోగించుకుందాము.. ఏ పని చేస్తున్నా నామ స్మరణ చేసుకోవచ్చు.
ప్రతి హిందువు ఇంట్లో దీపం వెలగాలి అదే మీకు రక్షణ అవుతుంది అందులోనూ అంత ఉదయాన్నే దీపం ఇంట్లో వెలగటం చాలా భాగ్యం మంత్రాలు చదివి గంటలు గంటలు స్త్రోత్రలు చదివితే నే భక్తి కాదు.. పాత కాలంలో ఆడవాళ్లకు చదువురాదు, స్ట్రోత్రాలు రాదు అయినా ఇల్లు శుభ్రంగా ఉంచుకునే రెండు పూటలా దీపారాధన చేసుకుంటూ అన్ని పండగలు తెలిసిన విధంగా నే చేసుకుని సంతోషంగా ఉండేవాళ్ళు.