నీలి నీలి కొండల్లోన నీలకంఠ మల్లన్న
శ్రీశైలం కొండలమీద లింగరూప మల్లన్న
మల్లన్న మల్లన్న మాలధారణ చేసినమయ్యా మల్లన్నో మండల దీక్ష బట్టినమయ్యా మల్లన్న
!! నీలి నీలి!!
విభూతి గంధం కుంకుమ దిద్ది రుద్రాక్ష మాలవేసి
గోధుమ రంగు నీలిరంగు దుస్తులు వంటికి వేస్తే
మల్లన్నో మల్లన్నో తనువెల్ల శివమయమే మల్లన్నో నీ పేరే మమ్ము పిలిసిరే మల్లన్న
!! నీలి నీలి !!
చన్నీటి తానాలతో మూడుసార్లు నీ పూజలు కామక్రోదాలు వినోదాలు విడిచి నీ సేవల మల్లన్నో మల్లన్నో అభిషేకాలు సేసినమయ్య మల్లన్నో నైవేధ్యాలు పెట్టినమయ్యా మల్లన్న
!! నీలి నీలి!!
నేలమీదే మా నిద్రలు ఒక్కపూటే భోజనాలు సౌరము గోళ్లు తీయకుండ సన్యాసం పుచ్చుకున్నం మల్లన్నో మల్లన్నో నమో నమో నమః శివాయ మల్లన్నో హరోం హర ఆత్మ నీదయా
!! నీలి నీలి!!
ధూమపాన మద్యపాన మాంసాహారము లొదిలి పాదరక్షలేయకుండ పద్దతులు మరువకుండ మల్లన్న మల్లన్నో కఠిన దీక్ష పడితిమయా మల్లన్న నీ దర్శన భాగ్యమీయవ