ఆంజనేయస్వామి కూడా శ్రీ విష్ణుమూర్తిలా అవతారాలెత్తారు.

P Madhav Kumar


🌹🙏*శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం*..

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

మహావిష్ణువు దశావతారం ధరిస్తే.. ఆంజనేయ స్వామివారు తొమ్మిది
అవతారాలు ధరించారు.
అవేంటంటే..

1. ప్రసన్నాంజనేయస్వామి
2. వీరాంజనేయస్వామి
3. వింశతి భుజ ఆంజనేయస్వామి
4. పంచముఖ ఆంజనేయస్వామి
5. అష్టదశ భుజ ఆంజనేయస్వామి
6. సువర్చలాంజనేయస్వామి
7. చతుర్బుజ ఆంజనేయస్వామి
8. ద్వాత్రింశద్భుజ ఆంజనేయస్వామి
9. వానరాకార ఆంజనేయస్వామి.

ఆంజనేయస్వామి రుద్రాంశ సంభూతుడు.
సూర్యవంశీయుని భక్తుడు :

శ్రీరామునితో పరిచయమైనా నాటినుండి హనుమంతుడు రాముని సేవకే అంకిత మయ్యాడు. 

అనితర సాధ్యమైన సముద్ర లంఘనం చేసి, శత్రు దుర్భేద్యమైన
లంకలో సీతమ్మ జాడ కనిపెట్టడం ద్వారా శ్రీరామునికి అత్యంత ప్రీతి పాత్రుడయ్యాడు.
సంజీవినిని తెచ్చి లక్ష్మణుని ప్రాణాలు కాపాడాడు.
సీతారాములను హృదయంలో నిలుపుకోవడం హనుమంతుని
భక్తికి పరాకాష్ట.
శ్రీరామభక్తులకు హనుమంతుడు సర్వదా సంరక్షకుడిగా ఉంటాడు.
త్రిమూర్తుల శక్తి :
సూర్యవంశ సంజాతుడైన శ్రీరాముడు మహావిష్ణువు అవతారం.
హనుమంతుడు శివాంశ సంభూతుడు.
అంటే రామాంజనేయుల అనుబంధం శివకేశవుల అభేదానికి ప్రతీక.
హనుమంతుని భవిష్యబ్రహ్మగా కూడా పురాణాలు పేర్కొన్నాయి.
కనుక వీరిద్దరి కలయికతో త్రిమూర్తులు ఏకామైనట్టే.

సూర్యుని కూడా త్రిమూత్రుల స్వరూపంగా శాస్త్రాలు నిర్వచించాయి.
కాబట్టి శ్రీ సూర్యరామాంజనేయులను ద్విగుణీకృతమైన శక్తికి
సంకేతంగా అభివర్ణించ వచ్చు.

ఇలా గురుశిష్య బంధంగా మొదలైన సూర్యాంజనేయుల అనుబంధం
త్రిమూర్త్యాత్మకంగా విస్తరించింది..సేకరణ...🙏🌹

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿


#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat