అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ ప్రణవప్రియ |
స్నానం పంచామృతైర్దేవ గృహాణ పురుషోత్తమ || శ్రీ పూర్ణపుష్కళాంబ సమేత శ్రీ హరిహరపుత్ర ధర్మశాస్త్రే నమః పంచామృత స్నానం సమర్పయామి. (పంచామృతం)
క్షీరాభిషేకం (పాలు)
కామధేను సముద్భూతం దేవర్షి పితృతృప్తితాం ||
పయోదధామి దేవేశ స్నానాయ ప్రతిగృహ్యతాం॥
శ్రీ పూర్ణపుష్కళాంబ సమేత శ్రీ హరిహరపుత్ర ధర్మశాస్త్రే నమః క్షీరాభిషేకం సమర్పయామి. (పాలు)
ధధ్యాభిషేకం (పెరుగు)
చంద్రమండల సంకాశం సర్వదేవ ప్రియం దధి | స్నానార్థం మయాదత్తం పంచశైల నివాసినే ॥
శ్రీ పూర్ణపుష్కళాంబ సమేత శ్రీ హరిహరపుత్ర ధర్మశాస్త్రే నమః దధ్యాభిషేకం సమర్పయామి. (పెరుగు)
అజ్యాభిషేకం (నెయ్యి)
ఆజ్యం సురాణామహారం ఆజ్యం యజ్ఞే ప్రతిష్ఠితం |
ఆజ్యం పవిత్రం పరమం స్నానార్థం ప్రతి గృహ్యతాం॥
శ్రీ పూర్ణపుష్కళాంబ సమేత శ్రీ హరిహరపుత్ర ధర్మశాస్త్రే నమః అజ్యాభిషేకం సమర్పయామి. (నెయ్యి)
మధునాభిషేకం (తేనె)
సర్వౌషధి సముత్పన్నం పీయూష సదృశం మధుః || స్నానార్థంతే ప్రయచ్ఛామి స్వీకరుష్య దయానిధేః ||
శ్రీశ్రీశ్రీ పూర్ణపుష్కళాంబ సమేత శ్రీ హరిహరపుత్ర ధర్మశాస్త్రే నమః మధునాభిషేకం సమర్పయామి. (తేనె)
శర్కరాభిషేకం (చక్కర)
స్వాధుః పవస్య దివ్యాయ జన్మనే స్వాదురింద్రాయ సుహావీతు నామ్నే ! స్వాదుర్మిత్రాయ వరుణాయ వాయువ్య బృహస్పతయే మధుమా అదాభ్యాః ॥
శ్రీ పూర్ణపుష్కళాంబ సమేత శ్రీ హరిహరపుత్ర ధర్మశాస్త్రే నమః శర్కరాభిషేకం సమర్పయామి. (చెక్కెర)
కొబ్బరికాయలు పండ్లు .
యా ఫలివీర్య అఫలా అపుష్పాయశ్చ పుష్పిణీః |
బృహస్పతి ప్రసూతాస్తానో ముంచస్తగ్ం హసః 1
శ్రీ పూర్ణపుష్కళాంబ సమేత హరిహరపుత్ర ధర్మశాస్త్రే నమః రుచికర ఫలాభిషేకం సమర్పయామి. (పండ్లరసంతో)
జలాభిషేకం
గంగాది సర్వతీర్థేభ్యో సమాహృత్యం సువాసితం ।
శుద్దోదక మిద స్నానం గృహణ సురనాయక ॥
శ్రీ పూర్ణపుష్కళాంబ సమేత శ్రీ హరిహరపుత్ర ధర్మశాస్త్రే నమః శుద్ధ జలాభిషేకం సమర్పయామి. (నీరు)
గంధాభిషేకం
కర్పూరేణ సమాయుక్తం సుగంధద్రవ్య సంయుతం ||
గంధోదకం మయాదత్తం గృహాణత్వం మహేశ్వర ॥
శ్రీశ్రీ పూర్ణపుష్కళాంబ సమేత శ్రీ హరిహరపుత్ర ధర్మశాస్త్రే నమః గంధాభిషేకం సమర్పయామి. (చందనము)
భస్మాభిషేకం (విభూతి)
విభూతిర్భూతిరైశ్వర్యం అపమృత్యుహరం శుభం |
స్నానార్థంతే ప్రయచ్ఛామి గృహ్యతాం సురనాయకః ॥
శ్రీ పూర్ణపుష్కళాంబ సమేత శ్రీ హరిహరపుత్ర ధర్మశాస్త్రే నమః భస్మాభిషేకం సమర్పయామి. (విభూతి)
సుగంధ పరిమళ స్నానం
సుగంధి విష్ణు తైలంచ సుగంధామల కీ జలమ్ ।
దేహ సౌందర్య బీజం గృహ్యతాం హరిహరాత్మజ ||
శ్రీ పూర్ణపుష్కళాంబ సమేత శ్రీ హరిహరపుత్ర ధర్మశాస్త్రే నమః సుగంధ పరిమళ ద్రవ్య సంయుక్త జలాభిషేకం సమర్పయామి. (సుగంధద్రవ్యాలు)
కలశోధక స్నానం
నానానదీ సమానీతం సువర్ణ కలశస్థితం
శుద్ధోదకేన సుస్నానం గృహ్యతాం హరిహరనందన |
శ్రీ పూర్ణపుష్కళాంబ సమేత శ్రీ హరిహరపుత్ర ధర్మశాస్త్రి వా సమర్పయామి. (కలశజలము) నమః శుద్ధోదక స్నానము
వస్త్రము
వేదసూక్త సమాయుక్తే యజ్ఞసామ సమాన్వితే |
సర్వవర్ణ ప్రతేదేవ వాసాంసి సంగృహణ భ్యో ||
శ్రీ పూర్ణపుష్కళాంబ సమేత శ్రీ హరిహరపుత్ర ధర్మశాస్త్రే నమః వస్త్రాన్సమర్పయామి. (వస్త్రం)
యజ్ఞోపవీతం:
బ్రహ్మవిష్ణుమహేశైశ్చ నిర్మితం బ్రహ్మసూత్రకం |
గృహణ సర్వవరద ధర్మశాస్త్రా నమోస్తుతే ॥
శ్రీ పూర్ణపుష్కళాంబ సమేత శ్రీ హరిహరపుత్ర ధర్మశాస్త్రే నమః యజ్ఞోపవతీం | సమర్పయామి. (జందెము)
ఉపవీతము
రాజితం బ్రహ్మసూత్రంచ కాంచనం ఉత్తరీయకం |
గృహణ సర్వవరదాం భక్తా మీష్ట ప్రదాయక॥
శ్రీ పూర్ణపుష్కళాంబ సమేత శ్రీ హరిహరపుత్ర ధర్మశాస్త్రే నమః ఉత్తరీయము సమర్పయామి (ఉత్తరీయకము).
చందనము
శ్రీ ఖండం చందనం దివ్యం గాంధడ్యం సుమనోహరం |
విలేపనం సురశ్రేష్ఠ చందనం ప్రతి గృహ్యతాం॥
శ్రీ పూర్ణపుష్కళాంబ సమేత శ్రీ హరిహరపుత్ర ధర్మశాస్త్రే నమః
పసుపు కుంకుమ హరిద్రా చూర్ణ సంయుక్తం కుంకుమం కామదాయకం |
నా పరిమళం దివ్యం గృహాణ గుణభూషితా ॥ శ్రీ పూర్ణపుష్కళాంబ సమేత శ్రీ హరిహరపుత్ర ధర్మశాస్త్రే నమః అలంకరణార్ధం హరిద్రా కుంకుమాన్ ధారయామి. (పసుపుకుంకుమ)
ఆభరణాలు
హిరణ్య కేయూర గ్రైవేయ మణికంకణైః |
మణిహారం భూషణైర్యూక్తం గృహాణ పురుషోత్తమ ||
శ్రీ పూర్ణపుష్కళాంబ సమేత శ్రీ హరిహరపుత్ర ధర్మశాస్త్రే నమః అలంకరణార్ధం, ఆభరణాం సమర్పయామి (ఆభరణాలు).
అక్షింతలు
అక్షతాన్ తండులాన్ దివ్యాన్ కుంకుమేన విరాజితాన్ | హరి కుంకుమోపేతాన్ అక్షతాన్ ప్రతిగృహ్యతాం ॥ శ్రీ పూర్ణపుష్కళాంబ సమేత శ్రీ హరిహరపుత్ర ధర్మశాస్త్రే నమః అక్షతాన్ సమర్పయామి (అక్షింతలు).
పుష్పములు
3 మల్లికాది సుగంధీని మలాద్యాదీని వైప్రభో ||
మాయా హృతాని పూజార్థం పుష్పాణి ప్రతి గృహ్యతాం ॥
శ్రీ పూర్ణపుష్కళాంబ సమేత శ్రీ హరిహరపుత్ర ధర్మశాస్త్రే నమః పుష్పమూల్యం సమర్పయామి పుష్పైః పూజయామి (పుష్పమాల, పుష్పములు).
(స్వామి వారికి అభిషేకం చేయునపుడు నమకం, చమకం, పురుష సూక్తం, నారాయణసూక్త మన్యుసూక్తం చదవవచ్చును).
తాంబూలం
పూగీఫల సమాయుక్తం నాగవళ్ళి దళైర్యుతం |
కర్పూర చూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం॥
శ్రీ పూర్ణపుష్కళాంబా సమేత శ్రీహరిహరపుత్ర ధర్మశాస్త్రే నమః సుగంధ తాంబూలం సమర్పయామి.