ఎవరినైనా మొదటిగా మీ సమస్య ఏమిటి అంటే ఆర్థిక ఇబ్బందులు అప్పులు ఇవే చెపుతారు ,ఇలా తీవ్ర అప్పులతో బాధపడేవారికోసం ఈ పరిహారం ,ఈ తంత్ర ప్రయోగాన్ని పంచమి తిధి రోజు మొదలు పెట్టి 5 పంచమిలలో పూర్తి చేయాలి కృష్ణ పక్ష పంచమి లేదా శుక్ల పక్షి పంచమి ఏదైనా పరవాలేదు ,గోధుమ పిండి, పసుపు , బియ్యము, తెల్లటి పువ్వులు , రెండు మట్టి దీపాలు, బెల్లం ముక్కలు, పాలు ,అగరవత్తులను అవసరం . గోధుమ పిండి లో కొంచెం పసుపు , పాలు కలిపి పిండి ముద్ద చేసుకోవాలి. ఈ పిండి ముద్దను ఐదు చిన్న సైజు బంతులు మరియు ఒక పెద్ద సైజు బంతి లా తయారు చేసుకోవాలి. చిన్న బంతులను ఉపయోగించి చిన్న నాగ ప్రతిమలను, పెద్ద సైజు బంతిని ఉపయోగించి పెద్ద నాగ ప్రతిమను చేయాలి , నాగ ప్రతిమకు తోక మరియు పడగ తప్పక ఉండాలి . నాగ ప్రతిమలకు అక్షింతలు ,పువ్వులు సమర్పించాలి ,పసుపు కుంకుమతో అలంకరించాలి ,అగరబత్తి తో ధూపం వెయ్యాలి,ప్రమిదలలో నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి . బెల్లం ముక్కలను మరియు పాలను నైవేద్యంగా సమర్పించాలి. అప్పులు,రుణాల బాధలనుండి విముక్తి చేయమని నాగదేవతను ప్రార్ధించాలి. పూజ పూర్తి చేసిన పూజ వస్తువులను ఒక చోటే పెట్టి తరువాత రోజు అన్ని (5చిన్నవి ,1పెద్దది ) నాగప్రతిమలను ,పూజ వస్తువులను తీసుకుని ఇంటి నుండి దూరంగా వున్నా ఏదైనా చెట్టుక్రింద పెట్టి వెనుకకు తిరిగి చూడకుండా వచ్చేవాలి ,ఇలా మిగిలిన ఐదు పంచమి తిధులలో కూడా ఇలా పూజ చేయాలి ఆరు పంచమి తిధులు అయ్యేలోగా మీ అప్పులు నుండి విముక్తి లభిస్తుంది .