హరిహరసుతుడు అయ్యప్పస్వామి భూలోకములో పంబానది ఒడ్డున మణికంఠునిగా పుట్టినది ఫాల్గుణమాసము శుక్లపక్షము పంచమి రోజున శనివారము నాడు ఉత్తర ఫల్గుణి నక్షత్ర యుక్త వృశ్చికలగ్నమందు జన్మించారు. ఆ రోజున స్వామివారి ఉత్తర ఫంగుని పూజను నిర్వహిస్తారు. అదే విధంగా పందళ రాజుకి పంబానది తీరాన బుధవారం రోజున మేష సంక్రాంతి రోజున దొరికిన మణికంఠునికి ఆరోజున విషుకణి (మేడవిషు) పూజను నిర్వహిస్తారు. ఇవి ఎందుకు చెబుతున్నానంటే అసలు అయ్యప్ప స్వామి జన్మవారము బుధవారమ! శనివారమ! అన్న అనుమానాలు ఉన్నందున, జన్మనిచ్చిన తల్లితండ్రుల జన్మదినం ఉత్తర ఫంగునిరోజు, పెంచిన తల్లిదండ్రుల జన్మదినం విష్ణు పూజరోజు అంటే శనివారము, బుధవారము రెండు రోజులు పాటించవచ్చు. అలాగే కళ్యాణము కాని వారు, సంతానము లేనివారు, ఉత్తర నక్షత్ర పూజలలో దంపతులు పాల్గొని స్వామివారిని పూజించి ప్రసాదం స్వీకరించిన భగవంతుని ఆశీస్సులతో వివాహము మరియు సంతానము లభిస్తుంది.
ఓం శ్రీ శబరిగిరివాసనే శరణం అయ్యప్ప