పుష్య మాసం శనైశ్చరునికి అత్యంత ప్రీతికరమైన మాసం,శని స్తోత్రం, అష్టోత్తర శతమామావళి, శనిగ్రహ దోష జపం

P Madhav Kumar

 🌿🌼🙏పుష్య మాసం శనైశ్చరునికి అత్యంత ప్రీతికరమైన మాసం, శనివారం రోజున త్రయోదశి మరియూ అమావాస్య తిథులు శనైశ్చరుని పూజించుటకు ఫలవంతమైన రోజులు, శనైశ్చరుని జన్మతిథి అమావాస్య, మరి పుష్యమాసంలో శనివారం రోజున అమావాస్య తిథి కలిసి వస్తే ఎంత అమోఘమైన రోజో ఒక్కసారి ఆలోచించండి. ఇటువంటి రోజున శని భగవానుని ఆరాధించి శని దోషాలు తొలగించుకుని, ఆయనను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేద్దాం ...🙏🌼🌿


🌿🌼🙏ఇది ఏల్నాటి శని, అష్టమ శని, అర్ధాష్టమశని, జాతకరీత్యా శని దశలు, అంతర్దశలు నడిచే వారు ప్రతి రోజు వీలైనన్ని సార్లు పఠిస్తే చాలా మంచి ఫలితం వుంటుంది. గ్రహబాధ తొలగి మనశ్శాంతి తప్పక లభిస్తుంది.🙏🌼🌿


🌿🌼🙏శని స్తోత్రం🙏🌼🌿


నమస్తే కోణ సంస్థాయ పింగల్యాయ నమోస్తుతే

నమస్తే బభ్రురూపాయ కృష్ణాయ చ నమోస్తుతే

నమస్తే రౌద్రదేహాయ నమస్తే చాంతకాయ చ

నమస్తే యమసంజ్ఞాయ నమస్తే శౌరయేవిభో

నమస్తే మంద సంజ్ఞాయ శనైశ్చర నమోస్తుతే

ప్రసాదం మమ దేవేశ దీనస్య ప్రణతస్య చ ||


🌿🌼🙏ప్రతి శనివారం ఈ మంత్రాన్ని పఠిస్తే శని బాధ కలగదు. ఈ మంత్రం వెనుక ఉన్న పురాణ గాథ ఇలా ఉన్నది.🙏🌼🌿


🌿🌼🙏నల మహారాజు రాజ్యభ్రష్టుడై బాధపడుతున్నప్పుడు అతనికి శనిదేవుడు కలలో కనిపించి ఈ మంత్రం ఉపదేశించాడు. ఈ మంత్రాన్ని పఠించిన నలమహారాజుకు తిరిగి పూర్వ వైభవం కలిగింది.🙏🌼🌿


🌿🌼🙏నవగ్రహాల్లో శని దోషం ఎక్కువ అపకారం కలిగిస్తుంది. శని దోషం నుండి బయటపడేందుకు పైన ఉదహరించిన ”క్రోడం నీలాంజన ప్రఖ్యం..” అనే శ్లోకాన్ని 11 సార్లు జపించి, 


"క్రోడం నీలాంజన ప్రఖ్యం నీలవర్ణసమస్రజమ్

ఛాయామార్తాండ సంభూతం నమస్యామి శనైశ్చరమ్

నమో అర్కపుత్రాయ శనైశ్చరాయ నీహార

వర్ణాంజనమేచకాయ శ్రుత్వా రహస్యం భవకామదశ్చ

ఫలప్రదో మే భవ సూర్యపుత్రం నమోస్తు ప్రేతరాజాయ

కృష్ణదేహాయ వై నమః శనైశ్చరాయ కౄరాయ

శుద్ధబుద్ధి ప్రదాయనే

య ఏభిర్నామభి: స్తౌతి తస్య తుష్టా భవామ్యహమ్

మదీయం తు భయం తస్య స్వప్నేపి న భవిష్యతి" ||


తర్వాత కింది శ్లోకాన్ని 11 సార్లు జపించాలి, 


"శన్యారిష్టే తు సంప్రాప్తే శనిపూజాంచ కారయేత్   

శని ధ్యానం ప్రవక్ష్యామి ప్రాణి పీడోపశాంతయే"||


🌿🌼🙏శని అష్టోత్తర శతమామావళి - మంగళాష్టకం🙏🌼🌿


ఓం శనైశ్చరాయ నమః 

ఓం శాంతాయ నమః

ఓం శరణ్యాయ నమః 

ఓం వరేణ్యాయ నమః 

ఓం సర్వేశాయ నమః

ఓం సౌమ్యాయ నమః 

ఓం సురవంద్యాయ నమః 

ఓం సురలోక విహారిణే నమః

ఓం సుఖాననోవిష్టాయ నమః 

ఓం సుందరాయ నమః 


ఓం ఘనాయ నమః

ఓం ఘనరూపాయ నమః 

ఓం ఘనాభరణధారిణే నమః 

ఓం ఘనసారవిలేపాయ నమః

ఓం ఖద్యోతాయ నమః 

ఓం మందాయ నమః 

ఓం మందచేష్టాయ నమః

ఓం మహనీయగుణాత్మనే నమః 

ఓం మర్త్యపావనపాదాయ నమః

ఓం మహేశాయ నమః 


ఓం ఛాయాపుత్త్రాయ నమః 

ఓం శర్వాయ నమః

ఓం శ్రతూణీరధారిణే నమః 

ఓం చరస్థిరస్వభావాయ నమః 

ఓం చంచలాయ నమః

ఓం నీలవర్ణాయ నమః 

ఓం నిత్యాయ నమః 

ఓం నీలాంబసనిభాయ నమః

ఓం నీలాంబరవిభూషాయ నమః 

ఓం నిశ్చలాయ నమః 


ఓం వేద్యాయ నమః

ఓం విధిరూపాయ నమః 

ఓం విరోధాధార భూమయే నమః

ఓం వేదాస్పదస్వాభావాయ నమః 

ఓం వజ్రదేహాయ నమః 

ఓం వైరాగ్యదాయ నమః

ఓం వీరాయ నమః 

ఓం వీతరోగభయాయ నమః 

ఓం విపత్పరంపరేశాయ నమః

ఓం విశ్వనంద్యాయ నమః 


ఓం గృద్రహహాయ నమః 

ఓం గుధాయ నమః

ఓం కూర్మాంగాయ నమః 

ఓం కురూపిణే నమః 

ఓం కుత్సితాయ నమః

ఓం గుణాధ్యాయ నమః 

ఓం గోచరాయ నమః 

ఓం అవిద్యామూలనాశాయ నమః

ఓం విద్యావిద్యాస్వరూపిణే నమః 

ఓం ఆయుష్యకారణాయ నమః 


ఓం ఆపదుద్దర్త్రే నమః

ఓం విష్ణుభక్తాయ నమః 

ఓం వశినే నమః 

ఓం వివిధాగమనేదినే నమః

ఓం విధిస్తుత్యాయ నమః 

ఓం వంద్యాయ నమః 

ఓం విరూపాక్షాయ నమః

ఓం వరిష్టాయ నమః 

ఓం వజ్రాంకుశధరాయ నమః 

ఓం వరదాయ నమః


ఓం అభయహస్తాయ నమః 

ఓం వామనాయ నమః 

ఓం జేష్టాపత్నీసమేతాయ నమః

ఓం శ్రేష్టాయ నమః 

ఓం అమితభాషిణే నమః 

ఓం కస్టౌఘనాశకాయ నమః

ఓం ఆర్యపుష్టిదాయ నమః 

ఓం స్తుత్యాయ నమః 

ఓం స్తోత్రగమ్యాయ నమః

ఓం భక్తివశ్యాయ నమః 


ఓం భానవే నమః 

ఓం భానుపుత్త్రాయ నమః

ఓం భావ్యాయ నమః 

ఓం పావనాయ నమః

ఓం ధనుర్మందల సంస్థాయ నమః

ఓం ధనదాయ నమః 

ఓం ధనుష్మతే నమః 

ఓం తనుప్రకాశ దేహాయ నమః

ఓం తామసాయ నమః 

ఓం అశేషజనవంద్యాయ నమః 


ఓం విశేషఫలదాయినే నమః

ఓం వశీకృతజనిశాయ నమః 

ఓం పశూనాంపతయే నమః 

ఓం ఖేచరాయ నమః

ఓం ఖగేశాయ నమః 

ఓం ఘననీలాంబరాయ నమః 

ఓం కాఠిన్యమానసాయ నమః

ఓం అరణ్యగణస్తుత్యాయ నమః 

ఓం నీలచ్చత్రాయ నమః 

ఓం నిత్యాయ నమః


ఓం నిర్గుణాయ నమః 

ఓం గుణాత్మనే నమః 

ఓం నిరామయాయ నమః 

ఓం నింద్యాయ నమః

ఓం వందనీయాయ నమః 

ఓం ధీరాయ నమః 

ఓం దివ్యదేహాయ నమః 

ఓం దీనార్తి హరణాయ నమః

ఓం దైన్య నాశకరాయ నమః 

ఓం ఆర్యజనగణణ్యాయ నమః 


ఓం క్రూరాయ నమః

ఓం క్రూరచేష్టాయ నమః 

ఓం కామక్రోధకరాయ నమః 

ఓం కళత్రపుత్త్రశత్రుత్వ కారణాయ నమః

ఓం పరిపోషితభక్తాయ నమః 

ఓం భక్త సంఘమనోభీష్ట ఫలదాయ నమః  

ఓం శ్రీమచ్ఛనైశ్చరాయ నమః


🌿🌼🙏శని మంగళాష్టకమ్🙏🌼🌿


శని మంగళాష్టకమ్ మందః కృష్ణవిభస్తు పశ్చిమ ముఖః సౌరాష్టవో కాస్యవః |

నక్రేశో ఘటన సుహృద్భుధ భ్రుగుర్వైరీంద్వ వక్ష్యాసుతః ||


స్థానం పశ్చిమ దిక్ర్పజాపతిర్యమౌదేవౌ ధనస్త్వాసనం |

షట్రష్ట స్శుభకృచ్ఛమీ రవిసుతః కూర్యాత్సదా మంగళం ||


🌿🌼🙏శనైశ్చరుని జపం మంత్రాలు🙏🌼🌿


నీలాంజన సమాభాసం 

రవి పుత్రం యమాగ్రజం 

ఛాయా మార్తాండ సంభూతం 

తమ్ నమామి శనైశ్చరం ||


|| ఓం శం శనయేనమ:|| 


|| ఓం నీలాంబరాయ విద్మహే సూర్య పుత్రాయ ధీమహి తన్నో సౌరి ప్రచోదయాత్ ||


|| ఓం ప్రాం ప్రీం ప్రౌం శం శనైశ్వరాయ నమః ||


🌿🌼🙏శని గాయత్రీ మంత్రం🙏🌼🌿


ఓం కాకథ్వజాయ విద్మహే ఖఢ్గ హస్తాయ ధీమహి తన్నో మంద: ప్రచోదయాత్.


|| ఓం శనైశ్వరాయ విద్మహే సూర్యపుత్రాయ ధీమహి తన్నో: మంద: ప్రచోదయాత్ ||


బ్రహ్మాండ పురాణంలో తెలుపబడిన "నవగ్రహ పీడహర స్తోత్రం"::


||సుర్యపుత్రో దీర్ఘదేహో విశాలాక్షః శివప్రియః మందచారః ప్రసన్నాత్మా పీడం హరతు మే శని: || 


||ఓం శం శనైస్కర్యయే నమః|| 

||ఓం శం శనైశ్వరాయ నమః|| 

||ఓం ప్రాంగ్ ప్రీంగ్ ప్రౌంగ్ శ: శనయే నమః ||


||కోణస్ధః పింగళో బబ్రుః కృష్ణో రౌద్రంతకో యమః సౌరిః శనైశ్చరో మందహ పిప్పలాదేన సంస్తుత:||


ఓం నమో శనైశ్వరా పాహిమాం, ఓం నమో మందగమనా పాహిమాం, ఓం నమో సూర్య పుత్రా పాహిమాం, ఓం నమో చాయాసుతా పాహిమాం, ఓం నమో జేష్టపత్ని సమేత పాహిమాం, ఓం నమో యమ ప్రత్యది దేవా పాహిమాం, ఓం నమో గృధ్రవాహాయ పాహిమాం 


🌿🌼🙏శనిగ్రహ దోష జపం🙏🌼🌿


అస్యశ్రీ శనిగ్రహ మహా మంత్రస్య హిళింభి ఋషిః శనైశ్చర

గ్రహోదేవతా! ఉష్టిక్ చంధః! శనైశ్చర గ్రహ ప్రసాద సిద్దర్ధ్యే

శనిపీడా నివారణార్ధే శనిమంత్ర జపే వినియోగః


::కరన్యాసం::

------------------

ఓం శమగ్ని - అంగుష్టాభ్యాసం నమః

ఓం అగ్నిభిస్కరత్ - తర్జనీభ్యాం నమః

ఓం విష్ణుశంనస్తపతుసూర్యః - మధ్యమాభ్యాం నమః

ఓం శంవాతః - అనామికాభ్యాం నమః

ఓం వాత్వరపాః - కనిష్ఠికాభ్యాసం నమః

ఓం అపశ్రిధః - కరతల కరపృష్టాభ్యాసం నమః 


::అంగన్యాసము::

-------------------------

ఓం శమగ్ని: - హృదయాయ నమః

ఓం అగ్నిభిస్కరత్ - శివసేస్వాహ

ఓం శంనస్తపతుసూర్యః - శిఖాయైవషట్

ఓం శంవాతః - కవచాయహు

ఓం వాత్వరపాః - నేత్రత్రయాయ వౌషట్

ఓం అపశ్రిధ్ర - అస్త్రాయఫట్

ఓం భూర్భువస్సువరోమితి దిగ్భంధం


ఆదిదేవతాః


ఇమం యమ ప్రస్తరమాహి సీదాంగి రోభి: పితృభిప్సం విధానః |

అత్వా మంత్రాః కవిసహస్త్వా వహ న్వైనారాజన్ హవిషామదయస్వ ||


ప్రత్యథి దేవతా: ప్రజాపతే సత్వ దేవతాన్యోన్యో విశ్వాజాతాని పరితాబభూవ |

యత్కామాస్తే జుహుమస్తన్నో అస్తువయగ్గౌ శ్యామ పతయోరయీణాం ||


::వేదమంత్రం::

*************

ఓం శమగ్ని రాజ్ఞి భిస్క రచ్చన్న స్తపతు సూర్యః శం వాతో వాత్వరపా అపశ్రిధః |

శని కవచ స్తోత్రము శనైశ్చరశ్శిరో రక్షేత్ | 

ముఖం భక్తార్తి నాశనః కర్ణౌకృష్ణాంబరః పాతు |

నేత్రే సర్వ భయంకరః |

కృష్ణాంగో నాసికాం రక్షేత్ |

కర్ణౌ మేచ శిఖండిజ: |

భుజౌమే సుభుజః పాతు |


హస్తా నీలోత్పల ప్రభః |

పాతుమే హృదయం కృష్ణ: |

కృక్షిం శుష్కోధర స్తధాః |

కటిం మే వికటః పాతు |


ఊరూ మే ఘోర రూపవాన్ |

జానునీ పాతు దీర్ఘోమే | 

జంఘేమే మంగళ ప్రభః |

గల్పౌ గణాకరః పాతు |


పాదౌ మే మంగుపాదకః |

సర్వాణిచ మామాచంగాని |

పాతు భాస్కరనందనః ||


ఫలశ్రుతి


య ఇదం కవచం దివ్యం సర్వ పీదాహరం ణాం పఠతి శ్రద్ధయా యుక్తః! సర్వాన్ కామానవాప్నుయాత్ ||


🌿🌼🙏శనైశ్చరుడు ప్రసన్నుడవాలంటే, చేయవలిసినవి🙏🌼🌿


🌿🌼🙏కంటక శని🙏🌼🌿


(చాంద్రయానాన్ని అనుసరించి జన్మరాశి నుండి ఎనిమిదవ ఇంటిలోనికి శని ప్రవేశించినప్పుడు) లేదా, 


🌿🌼🙏ఏలినాటి శని🙏🌼🌿

(చాంద్రయనాన్ని అనుసరించి జన్మరాశి నుండి పన్నెండు, మొదటి మరియు రెండవ ఇంటిలోనికి శని యొక్క గమన సమయంలో) ఉన్నా శని ప్రస్సనుడవాలంటే, 


అమావాస్య రోజున కాళీ మాత పూజ చేయాలి. 

విష్ణువును, కృష్ణుని రూపంలో ధ్యాన్నిస్తూ 'ఓం నమో నారాయణాయ', 'హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే' అని జపించాలి. 

హనుమంతుడిని సర్వోత్కృష్టమైన (అనంతమైన) రూపంలో ధ్యానించాలి. శని, హనుమంతుని వీపుపై, చేరి అతన్ని పట్టి పీడించాలని ప్రయత్నించినప్పుడు, తన బలం అంతా ఉపయోగించి, ఒక్క విదిలింపుతో శనిని, విసిరి పారేసినప్పుడు సూర్య భగవానుడు, హనుమంతుడిని మెచ్చుకుని, "న్నిన్ను పూజించిన వారికి శని బాధలుండవు" అని దీవించాడట. 

శనిత్రయోదశి, శనిజయంతి (పుష్యమాసం, బహుళ అష్టమి) మరియు శనిఅమావస్య రోజులలో తిలాభిషేకం చేయాలి.

బ్రాహ్మణునికి నల్ల నువ్వులు దానం చేయాలి.నల్ల గోవు (కపిల గోవు) కు బెల్లం మరియు నువ్వుల మిశ్రమాన్ని తినిపించాలి.

శనివారాలలో (శ్రావణ మాసంలో తప్పనిసరిగా) ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఉపవాసం ఉందాలి. 

కాకులకు ఉదయం, మధ్యాహ్న వేళాలలో అన్నం పెట్టాలి.

వికలాంగులైన వారికి ఆహారం అందివ్వాలి. నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయాలి. 

శని క్షేత్రాలు సందర్శించాలి. ప్రతిరోజూ సూర్యాస్తమయం తరువాత ఇంటి ముఖద్వారం వద్ద నువ్వుల నూనెతో దీపాలను వెలిగించాలి. 

దశరథ మహారాజ కృత శని స్తోత్రమును పఠించాలి. శ్రావణ పూర్ణిమ నాడు, జ్యేష్టాదేవికి, శనీశ్వరుడికి కళ్యాణం జరిపించాలి. 

మూలమంత్రం, పునర్చరణ, హవనం, దానములతో పాటుగా 19000 సార్లు శనిజపం చేయటం మంచిది. శ్రావణమాసలో, శనివారాలలో శనైశ్వరవ్రతం, హోమం చేయటం చాలా మంచిది. 

శనైశ్వర దీక్ష, శ్రావణ శుద్ధ విదియ నుండి శ్రావణ బహుళ షష్ఠి వరకు పూనాలి. 'రామ నామం', హనుమాన్ చాలీసా, దుర్గా స్తుతులను జపించటం. హనుమంతుడు, శ్రీ దుర్గా దేవి, వినాయకులను ప్రార్థించటం ఎంతో మంచిది. పెరుగన్నం, దేవునికి నైవేద్యంగా పెట్టిన ఆ తరువాత కాకులకు పెట్టాలి. అనాథ బాలలకు అన్నదానం చేయాలి. పై వాటిలో ఏది పాటించినా శని ప్రసన్నుడవుతాడు.


🌿🌼🙏శనైశ్చరుని దివ్య చరిత్ర🙏🌼🌿


(కనీసం ప్రతి శనివారం "పిప్పలాద మహర్షి" ని తలవండి)


హిందూ జ్యోతీష్య శాస్త్రం ప్రకారం 'శనీశ్వరుడు', నవ గ్రహాలలో ఒక గ్రహం. సూర్యుడు, చంద్రుడు, ఛాయా గ్రహాలైన రాహువు మరియు కేతువులతో కలిపి గ్రహాలు తొమ్మిది. గగనమండలంలో ఉన్నగ్రహాలకు భూమితో సంబంధం ఉంది. కాబట్టి తొమ్మిది గ్రహాల ప్రభావం భూమి మీద, భూమిపై ఉన్న ప్రతి చరాచర జీవుల పైన, నిర్జీవ, ఝడ, నిర్లిప్త వస్తువుల మీద వుంటుంది. నవగ్రహాలలో ఒకటైన శని గ్రహం ఇందుకు బిన్నం కాదు. శని, శనిగ్రహం, శనేశ్వరుడు, శనీశ్వరుడు, అని పలు నామములతో పిలువబడి, గ్రహరూపలో పూజింపబడే 'శని' ఒక గ్రహ దేవుడు. వారంలో ఏడవవారం శనివారం. శనివారానికి అధిపతి శనేశ్వరుడు. సంఖ్యాశాస్త్రం ప్రకారం కూడా 'ఏడు' శనికి ప్రీతికరమయిన సంఖ్య.


🌿🌼🙏శనైశ్చరుని జననం🙏🌼🌿


🌿🌼🙏శనైశ్చరుని తల్లిదండ్రులు🙏🌼🌿


సకల జీవులకు ప్రత్యక్షదైవం అయినట్టి సూర్యుడు భగవానుడికి, అతని రెండవ భార్య ఛాయదేవికి పుట్టిన సంతానం శని. ఆయనకు ఛాయాపుత్రుడు అనే పేరు కూడా ఉంది. జీవుల జాతక చక్రాలపైన తన ప్రభావాన్ని ఎలా చూపబోతున్నాడో అని నిరూపించడానికి, ఆయన జననం సూర్య గ్రహణములో జరిగింది.


🌿🌼🙏ఇతర నామాలు🙏🌼🌿


ఇతనికి మందగమనుడు అని కూడా పేరు. శనయే క్రమతి , అనగా అతినెమ్మదిగా కదిలేవాడు అని అర్థం. ఒకసారి సూర్యుని చుట్టిరావడానికి శనికి 30 సంవత్సరాలు పడుతుంది. శానైస్కర్య, అసిత, సప్తర్చి, క్రూరదృష్ట, క్రూరలోచనుడు, పంగు పాదుడు, గృద్ర వాహనుడు మొదలైన పేర్లుకూడా ఉన్నాయి.


🌿🌼🙏శనైశ్చరునికి అత్యంత ప్రీతికరమైన వస్తువులు🙏🌼🌿


నువ్వులు, నువ్వుల నూనె, నల్లటి వస్త్రం, నీలం, ఇనుము, అశుభ్రత, మందకొడిగా ఉండటం.


🌿🌼🙏మహాధర్మ రక్షకుడు🙏🌼🌿


ఎద్దు వాహనముపై శని దేవుడు. సమస్త ప్రాణకోటి యొక్క పాపకర్మల ఫలాన్ని వెను వెంటనే కలిగించే దేవుడు శనేశ్వరుడు. జీవులు చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం కల్పించి, శిక్షించి, ధర్మాన్ని నిలిపే శనిభగవానుడు యమధర్మరాజుకు మరియు యమునకు అగ్రజుడు. వీరి ముగ్గురి శరీర ఛాయ నలుపే. సూర్యుని కుమారులైన శని మరియి యముడు, ఇరువురూ న్యాయాధిపతులే. యముడు మరణానంతరం దండనలు విదిస్తే, శని, జీవులు బ్రతికి ఉండగానే హింసించి, యాతనలకు గురిచేసి శిక్షిస్తాడు.


గుణపాఠం నేర్పించే విషయంలో శనీశ్వరునికి ఎవరూ సాటి లేరు. ద్రోహం, వెన్నుపోటు, హింస, పాపమార్గాలు మరియు అన్యాయ మార్గాలను అనుసరించేవారికి శనిదేవుడు మిక్కిలి అపాయకారి అని శాస్త్రాలు చెబుతున్నాయి.(మరి అదే నిజమయితే మన మధ్య నిత్యం జరుగుతున్న అరాచకాలు, అవినీతి, మోసాలు నిరాటకంగా ఎలా సాగి పోతున్నాయి? అని సందేహం కలగవచ్చు. శని దేవుడి ప్రణాళికలేమిటో సామాన్యులమైన మనకు తెలుస్తుందా!). తన దృష్టి పడ్డవారిని హింసించి, నానాయాతనలకు గురిచేసి, అత్యంత కౄరంగా అమిత బాధలకు గురిచేసే శనిదేవుడు, తను కరుణించిన వారిని అందలం ఎక్కించే శ్రేయోభిలాషి అని శాస్త్రాలు వర్ణించాయి.


నల్లని ఛాయ అతని మేని వర్ణం. నల్లని వస్త్రములు అతని ఉడుపులు. ఖడ్గము, బాణములు మరియు రెండు బాకులు అతని ఆయుధాలు. నల్లని కాకి అతని వాహనం.


శనిభగవానుడు సహజంగా నల్లటి ఛాయ కలవాడని, ఛాయా మార్తాండ సంభూతుడని, అందమైన ముఖం కలవాడుగాను, క్రూరుడిగాను, మందగమనుడిగాను, గానుగుల కులానికి చెందినవాడుగాను, కాల-భైరవుడికి మహాభక్తుడిగాను హిందూ పురాణాలు జ్యోతిష శాస్త్రాలలో వర్ణింపబడ్డాడు.


🌿🌼🙏శని మహత్యం🙏🌼🌿


శని భగవానుని జన్మ వృత్తాంతం విన్న విక్రమాదిత్యుడు ఆయనను పరిహాసమాడాడట ! ఆ పరిహాసాన్ని విన్న శని కోపగ్రస్తుడై విక్రమాదిత్యుని శపించాడట. శనిని కించపరిచే విధంగా మాటలాడి, అవమానించినందుకు ఫలితంగా విక్రమాదిత్యుడు అనేక కష్టాలు అనుభవించాడు. రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు, చేయని దొంగతనపు నింద మోపబడి, పొరుగు రాజుచే కాళ్ళు, చేతులు నరికివేయబడ్డాడు. చివరికి, విసిగి వేసారిపోయి, బాధలు ఏమాత్రం భరించే ఓపికలేక, నిర్వీర్యుడై, భ్రష్టుడై, చేసేదిలేక, తనను కనికరింపమని శనిదేవుని అత్యంత శ్రద్ధతో, ఆర్తితో, భక్తితో ప్రార్థించగా, విక్రమాదిత్యుని భక్తికి సంతృప్తి చెందిన శనీశ్వరుడు తిరిగి అతని పూర్వ వైభవం ప్రాప్తింప చేసాడు. శనిమహాత్మ్యంలో దేవతల గురువైనట్టి బృహస్పతి, శివుడు మరియు అనేక దేవతల, ఋషుల మీద శనిప్రభావం, వారి అనుభవాలు వర్ణింపబడ్డాయి. శనిమహాత్మ్యం, కష్టసమయాలలో కూడా పట్టుదలను కోల్పోకుండా ఉండి, నమ్మిన సిద్ధాంతాల పట్ల పూర్తి భక్తి శ్రద్ధలతో జీవితం సాగించడం యొక్క విలువలను, ప్రాముఖ్యతను తెలియజేస్తుంది.


బ్రహ్మ వైవర్త పురాణం ప్రకారం, పార్వతీ దేవి, నలుగు పిండి బొమ్మకు ప్రాణం పోసినప్పుడు వినాయకుడుజన్మించాడు. అప్పుడు సకల దేవతలు, నవగ్రహాలు ఆ బాల వినాయకుడిని చూడటానికివచ్చారు. ఆ ముగ్ద మోహన బాలుడిని అక్కడకు విచ్చేసిన దేవతలు మునులు కనులార చూసి దీవెనలు అందించి పార్వతీ దేవికి మోదం కలిగించారు. శనిభగవానుడు మాత్రం తల ఎత్తి ఆ బాలుని చూడాలేదు. అందుకు పార్వతీదేవి కినుక వహించి, తన బిడ్డను చూడమని శనిని ఆదేశించింది. అయినా శని తన దృష్టి ఆ బాలగణపతి పై సారించలేదు.


తన దృష్టి పడితే ఎవరికైనా కష్టాలు తప్పవని ఎంత నచ్చచెప్పినా, మాతృ గర్వంతో శననీశ్వరుడి సదుద్దేశం తెలుసుకోలేక, పార్వతీ దేవి తనకుమారుని చూడమని పదే పదే శనిని ఆదేశించింది. శని తల ఎత్తి చూసిన కారణంగా బాల గణపతి మానవ రూపంలో ఉండే తలను కోల్పోయినాడని పురాణాలు తెలుపుతున్నాయి.


సకల జీవులకు ప్రత్యక్షదైవం అయినట్టి సూర్యుడు భగవానుడికి, అతని రెండవ బార్య ఛాయదేవికి పుట్టిన సంతానం శని. ఆయనకు ఛాయాపుత్రుడు అనే పేరు కూడా ఉంది. జీవుల జాతక చక్రాలపైన తన ప్రభావాన్ని ఎలా చూపబోతున్నాడో అని నిరూపించడానికి , ఆయన జననం సూర్య గ్రహణములో జరిగింది.


నవగ్రహాలకు రారాజు, ప్రత్యక్ష దైవం సూర్యుడు. ఆయన సతీమణి సం జ్ఞాదేవి. వారికిరువురు సంతానం. ‘‘యముడు, యమునా’’… వారే య మధర్మరాజు, యమునా నది. సూర్యుని వేడికి తాళలేని సంజ్ఞా దేవి తన నీడ నుంచి తనలాంటి స్ర్తీని పుట్టించి ఆమెకు ‘ఛాయ’అని పేరు పెట్టి తన బదులుగా తన భర్త దగ్గర వుండమని కొంతకాలం పుట్టింటికి వెళ్ళి అక్కడ తండ్రైన విశ్వకర్మకు తను చేసిన పని చెప్పి రహస్యంగా ఒకచోట సూర్యుని గురించి తపస్సు చేయసాగెను. అయితే ఆమె నీడ నుంచి వచ్చిన ఛాయకి శని, తపతి అను పిల్లలు పుట్టటం వలన ఆమె యమధర్మరాజుని, యమునను చిన్నచూపు చూడటం మొదలుపెట్టింది.


తన ప్రేమాను రాగాన్ని అంతా తన పిల్లలపై చూపించ సాగెను. ఆటలాడు కొను సమయంలో యముడు, శని మధ్య అభిప్రాయబేధాలొచ్చి యముడు శని కాలు విరిచాడు. దానికి ఛాయదేవి కోపించి యముని శపించింది. యమునని నది కమ్మని శపించగా, యముడు కూడా తపతిని తిరిగి నది కమ్మని శపించాడు. అంతలో అక్కడికి వచ్చిన గ్రహరాజు సూర్యుడు విషయాన్ని అంతా దివ్యదృషితో గ్రహించి వారికి కలిగిన శాపములకు చింతించి ‘‘యమున కృష్ణ సాన్నిధ్యమున పవిత్రత పొందగలదని, లోకానికి ఉపకారిగా వుండమని ఎవరైనా నీ నదిని సృశించినా, స్నానం చేసి నా వారికి సర్వపాపాలు హరిస్తాయని చెప్పాడు. అలాగే యమునికి కూడా శాంతి వాక్యాలతో ఓదార్చాడు యముడిని యమలోకానికి, పట్టా భిషేకము చేయించాడు.


ఆకాశంలో ఛాయను కాలుతో తన్నబోయిన యమధర్మరాజుని ఆమె ఆగ్రహంతో *‘‘నీ కాలు మంటలలో కాలుతుంది’’* అని శపించగా, ఆ కాలు మంటల్లో పడకుండా మంటపై యుండును అని, రెండో కాలు ఎల్లవేళలా నీటిలో వుండునని, ధర్మం తప్పి ప్రవర్తిస్తే ఆ కాలు భగ్గున మండి పోతుందని, నా వరం వల్ల నీ కాలు నీటిలో వుంటే రెండో కాలికి ఎలాంటి ప్రమాదం వుండదని తండ్రి చెప్పెను. అందుకే యమునికి ‘‘సమవర్తి’’ అనే పేరుంది.


 (ధర్మాధర్మాలను, నీళ్లు, నిప్పును ఒకేలా చూస్తాడు కనుక) శనిని నవగ్రహాలలో ఒకనిగా చేసి జ్యేష్ఠాదేవికిచ్చి వివాహం జరిపించెను.అయితే త్రిమూర్తులు శనికి కొన్ని అధిపత్యాలు ఇచ్చారు. ఆయువుకి అధిపతిగా, జనులపై ఆతని ప్రభావం వుండేట్లుగా అన్న మాట. శివుడు అయితే శని, యముని ఒకటిగా చేసెను. అంటే యముడే శని, శనియే యముడులాగా!


జాతకంలో శని సంబంధిత నక్షత్రాలు ‘పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర; ప్రతివారి జాతకంలో ఈ ఏల్నాటి శని, అర్ధాష్టమ, అష్టమ శనులు వస్తూ వుంటాయి. వాటి ప్రభావాన్ని చూపిస్తువుంటాయి.


వారి కర్మానుసారం (వారి వారి జన్మలగ్నాలను బట్టి) ప్రతి వ్యక్తి ఎం తో కొంత శని వలన బాధలు పొందుతారు. అయితే పరిహారాలు సక్రమంగా చేసుకొని, క్రమ శిక్షణాయుతమైన జీవనం గడిపి, ‘శని’’గాడు అని ఎవర్నీ దూషించకుండా వుంటే చాలా వరకు ఇబ్బందులు అధిగమించ వచ్చు!


మనిషికి అనుకోని చిక్కులు, ఇబ్బందులు, టెన్షన్స్‌ అన్నీ కూడా శని వల్ల జరుగుతా యి. మనసులలో జోక్యం, అనారోగ్యా లు, చేద్దామనుకున పనులన్నీ వాయిదాలు, మానసి క శాంతి అన్నీ శని దేవుని ఘనతే అని చెప్పాలి. ప్రతి చోట ప్రతి వారితో ఏదో రూపంలో మోసపోవటం, నష్టపోవటం, మానసిక ఘర్షణ అన్నిటికీ సూత్రధారి.


అలానే కాకుండా ఈ ఏలినాటి శనిలో ముఖ్యంగా జన్మ శని, వ్యయ శని, ద్వితీయ శనిలో దాదాపుగా 2 1/2 సం చొప్పున 7 1/2 సం శని వుండటం వలన ఖర్చులు, చిక్కులు, అవమానాలు, బంధుమిత్రులతో విద్వేషాలు, ‘నా’ అన్న వారితో వైరాలు, మంచికెడితే చెడు ఎదురవ్వటం, అప్పులు, హాస్పిటల్‌ దర్శనాలు ఇలా అనేకరకమైన ఇ్బందులు. ఇంతేకా కుండా అర్ధాష్టమ, అష్టమ శనులు నడి చేటపుడు కార్యాల యందు అసంతృప్తి, మోకాలు, స్పాండిలైటిస్‌, నరాలు మొదలైన ఇబ్బందులు (దంతరోగాలు కూడా), ఇష్టం లేని ప్రదేశాలకి వృత్తిపరమైన మార్పులు, వైరాగ్యం, అనుకోని పరిచయాల వల్ల వూహించని పరిణామాలు, మనసు అంతా వెలితి… ఏదో పోగొట్టుకు న్న భావన. అంతా వున్నా… అందరి మధ్యవున్న, మంచి హోదా ఉన్నా తెలీని ఆందోళన, అసంతృప్తి, వేదన! ఇలా ఎన్నిటికో శని దేవుడు కార ణుడు. 


మరి ఆ శనిని సంతృప్తి పరచటానికి రెమిడీలు అవసరం! ఆ స్థానం బాగుండనపుడు కనీసం ‘గురు’ బలం అయినా అత్యవసరం. రెండూ బాగోకపోతే ఇబ్బందులు మెండు. అయితే గోచారరీత్యా రెండు గ్రహాలకి పరిహారం అవసరం.


దీని వలన ఇబ్బందులు అధికమయితే… పరిహారాలు

శని వల్ల ‘నీలం’ ధరిస్తే ఇబ్బందులు అధిగమించవచ్చు అనుకోవటం సరి కాదు. ‘నీలం’ శని దేవుని రత్నమే అయినా అది శని దశలలో, శని నక్షత్రాలలో పుట్టిన, శని రాశులలో పుట్టినా, శని (గోచారరీత్యా) అష్టమ, అర్ధాష్టమ, ఏలినాటి శని దశలు నడుస్తున్నా పెట్టుకోటం సరికాదు. పూర్తి జాతకం చూపించుకున్నాక, అవసరమైతే తప్పక ధరించాలి.


నల్ల ఆవుకు బెల్లంతో కలిపిన నువ్వుండలు తినిపించాలి.

శనివారం, శని త్రయోదశి, మాసశివరాత్రి, మొదలైన రోజులలో (నవగ్రహాలలో వున్న) శనిదేవుని తైలాభిషేకం అత్యంత మేలు, శివునికి రుద్రాభిషేకం కూడా చేయాలి. ప్రతి శనివారం దేవాలయ సందర్శన చాలా మేలు (నవగ్రహ దేవాలయాలు) నూనె, నువ్వులు, మినుములు, నల్లమేక, ఇనుము మొదలైనవి దానం ఇవ్వచ్చు. ప్రతి శని త్రయోదశికి క్రమం తప్పకుండా శని స్తోత్రం, శని చాలిసా, శని అష్టాత్తర, సహస్రనామ స్తోత్రం పారాయణ చాలా మేలు. ఆ సమయంలో ప్రత్యక్ష దైవం సూర్య నారాయణునికి నమస్కారములు చాలా మేలు. శని ‘కారకత్వాలుగా’ ఆయుష్షు, సేవకా వృత్తి, వాత వ్యాధులు, పాదు కలు, చెడు సహవాసము, సేవలు చేయటం, నపుంసకత్వం, కూలీ, అరణ్యసంచారం, నీలం, మినుములు, అబద్ధం, దున్నపోతు, పాపం, ఎండిపోవడం, దంతబాధలు, మోకాళ్ళు, కఫవాతం, ఎముకలు, దుఃఖం, శిల్పం, వ్యసనం, ఇంకా చాలా చాలా వున్నాయి.


ఏల్నాటి శని దోష నివారణకు శని వినుకొండ పట్టణంలో సతీసమేతంగా నిర్మాణమౌతున్న శ్రీ శనైశ్చరాలయానికి ఇనుమును అందించడం ద్వారా శీఘ్ర ఉపశమనం పొందవచ్చని శాశ్విత శనిదోష నివారణ దేవాలయ ప్రతిష్ఠ సమయానికి కలుగుతుందని..పితృదేవతలు సంతృప్తి చెందుతారని ఎంతోమంది దేవాలయ ఆగమ సిద్దాంతలు తెలియచేసారు.


🌿🌼🙏శనీశ్వరుడు ప్రసన్నుడవాలంటే🙏🌼🌿


అమావాస్య రోజున కాళీ మాత పూజ చేయాలి.


విష్ణువును, కృష్ణుని రూపంలో ధ్యాన్నిస్తూ ‘ఓం నమో నారాయణాయ’, ‘హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే..’ అని జపించాలి.


హనుమంతుడిని సర్వోత్కృష్టమైన (అనంతమైన) రూపంలో ధ్యానించాలి. శని, హనుమంతుని వీపుపై, చేరి అతన్ని పట్టి పీడించాలని ప్రయత్నించినప్పుడు, తన బలం అంతా ఉపయోగించి, ఒక్క విదిలింపుతో శనిని, విసిరి పారేసినప్పుడు సూర్య భగవానుడు, హనుమంతుడిని మెచ్చుకుని, “న్నిన్ను పూజించిన వారికి శని బాధలుండవు” అని దీవించాడట.


శనిత్రయోదశి, శనిజయంతి (పుష్యమాసం, బహుళ అష్ఠమి) మరియు శనిఅమావస్య రోజులలో తిలాభిషేకం చేయాలి.


బ్రాహ్మణునికి నల్ల నువ్వులు దానం చేయాలి.

నల్ల గోవు(కపిల గోవు)కు బెల్లం మరియు నువ్వుల మిశ్రమాన్ని తినిపించాలి.


శనివారాలలో (శ్రావణ మాసంలో తప్పనిసరిగా) ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఉపవాసం ఉండాలి.


కాకులకు ఉదయం, మధ్యాహ్న వేళాలలో అన్నం పెట్టాలి.


వికలాంగులైన వారికి ఆహారం అందివ్వాలి.


నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయాలి.శని క్షేత్రాలు సందర్శించాలి.


ప్రతిరోజూ సూర్యాస్తమయం తరువాత ఇంటి ముఖద్వారం వద్ద నువ్వుల నూనెతో దీపాలను వెలిగించాలి.


దశరథ మహారాజ కృత శని స్తోత్రమును పఠించాలి.


శ్రావణ పూర్ణిమ నాడు, జ్యేష్టాదేవికి, శనీశ్వరుడికి కళ్యాణం జరిపించాలి.


మూలమంత్రం, పునర్చరణ, హవనం, దానములతో పాటుగా 19000 సార్లు శనిజపం చేయటం మంచిది.


శ్రావణమాసలో, శనివారాలలో శనైశ్వరవ్రతం, హోమం చేయటం చాలా మంచిది.


శనైశ్వర దీక్ష, శ్రావణ శుద్ధ విదియ నుండి శ్రావణ బహుళ షష్ఠి వరకు పూనాలి.


‘రామ నామం’, హనుమాన్ చాలీసా, దుర్గా స్తుతులను జపించటం.


హనుమంతుడు, శ్రీ దుర్గా దేవి, వినాయకులను ప్రార్థించటం ఎంతో మంచిది.


పెరుగన్నం, దేవునికి నైవేద్యంగా పెట్టిన ఆతరువాత కాకులకు పెట్టాలి.

 

అనాథ బాలలకు అన్నదానం చేయాలి.

పై వాటిలో ఏది పాటించినా శని ప్రసన్నుడవుతాడు.

శనివారానికి అధిపతి శనేశ్వరుడు. సంఖ్యాశాస్త్రం ప్రకారం కూడా ‘ఏడు’ శనికి ప్రీతికరమయిన సంఖ్య అని ప్రతి శనివారం శని భగవానుడిని ప్రార్థిస్తే శనిగ్రహ దోషాలు తొలగిపోతాయని పండితులు అంటున్నారు. శనిభగవానుడు స్తోత్రప్రియుడు, కరుణామయుడు కావున… శనీశ్వరుడిని భక్తి ప్రపత్తులతో పూజించిన వారికి గ్రహదోషాలు తొలగిపోతాయి.🙏🌼🌿


🌿🌼🙏అంతేగాకుండా.. *“శని”* భగవానునికి అత్యంత ప్రీతికరమైన శనివారం రోజున శనిత్రయోదశి రోజున ఏకాదశ రుద్రాభిషేకం, మహన్యాస, లఘున్యాస తైలాభిషేకం వంటి విశేష పూజలు చేయించే వారి గ్రహదోషాలు దరిచేరవని పురాణాలు చెబుతున్నాయి.🙏🌼🌿


🌿🌼🙏రాష్ట్రంలోని అతిపురాతన పుణ్యదేవాలయమైన శ్రీ మందేశ్వర (శనీశ్వర) స్వామి దేవస్థానంలో “శనిత్రయోదశి” పర్వదినాన విశేష పూజలు చేయించేవారికి ఈతిబాధలు తొలగిపోయి… పునీతులౌతారని పండితులు పేర్కొంటున్నారు.🙏🌼🌿


🌿🌼🙏శనికి సమర్పించవలసిన ద్రవ్యాలేమిటి ?🙏🌼🌿


🌿🌼🙏నల్ల వస్త్రం. నూనెదీపం, అగరవత్తులు, నువ్వులనూనె, స్వీట్లు, పండ్లు, దండ, జిల్లేడు ఆకులు, కర్పూరం, తమలపాకులు, వక్కలు, కొబ్బరికాయలు, గుర్రపు

నాడా, చిన్న దిష్టిబొమ్మ. ఇవి సమర్పించలేనివారు పావు లేదా అరలీటరు నూనెతో తైలాభిషేకం చేయొచ్చు.🙏🌼🌿


🌿🌼🙏కృష్ణ స్వరూపుడు నీలవర్ణుడు, నిప్పు తునకతో సమానుడు నల్లని ఇప్పపూవువంటివాడైన శనీశ్వరునికి మనస్కారం. త్వష్ట ప్రజాపతి తన కూతురు సంజ్ఞాదేవిని సూర్యునికిచ్చి వివాహం చేయగా, సూర్యుని కిరణాల వేడిమిని భరించలేక తన ఛాయ అనగా నీడకు ప్రాణం పోసి భర్త వద్ద వదిలి తాను తన తండ్రివద్దకు వెళ్ళిపోతుంది. ఈ ఛాయాదేవి, సూర్యు భగవానుల కుమారుడే శనీశ్వరుడు. ఈయన విభవ నామ సంవత్సరం, వైశాఖమాసం కృష్ణపక్ష చతుర్దశి తిథియందు ధనిష్టా నక్షత్రంలో జన్మించాడు. ఈయన కుడిచేతిలో దండం, ఎడమ చేతిలో కమండలాలు ఉంటాయి.🙏🌼🌿


🌿🌼🙏హరిశ్చంద్రుడు, నలుడు, పురుకుత్పుడు, పురూరవుడు, సాగరుడు, కార్త్య వీర్యార్జునుడు వీరంతా శని మహిమ వల్ల అనేక కష్టనష్టాలను పొంది చివరకు శని కృపాదృష్టితో ఆనందాన్ని పొందారు. శనీశ్వరుడు విష్ణుమూర్తికి తోడల్లుడు, సూర్యుని కుమారుడు, యమధర్మ రాజుకి, యమునా నదికి సోదరుడు. గ్రహాలకు యువరాజు వంటివాడు. ఆంధ్రప్రదేశ్ లోని మందపల్లి, మహారాష్ట్రలో శని శింగనాపూర్, తమిళనాడులో తిరునళ్ళార్ శని క్షేత్రములు.🙏🌼🌿


🌿🌼🙏అయితే పూర్తి వాస్తుతో అతిశక్తివంతమైన 7వ శతాబ్దం నాటి క్షేత్రం పాండిచ్చేరిలోని తిరువళ్ళార్ లో వుంది. శని ప్రభావం వల్ల నల మహారాజు వస్త్రాలను పక్షి ఎగురవేసుకుపోయే దృశ్యాలు ఈ క్షేత్రంలో కన్పిస్తాయి. నలమహారాజు శని విముక్తి చేసే చిత్రాలు అక్కడ కన్పిస్తాయి. భక్తులు నూనెతో స్నానం చేసి ఆ తర్వాత అక్కడి చెరువులో స్నానం చేస్తే చాలు ఎంతమాత్రం జిడ్డు కనిపించదు. లక్షలాదిమంది స్నానం చేసే ఆ చెరువులో జిడ్డు కనిపించకపోవడమే అక్కడి విశేషం.🙏🌼🌿


🌿🌼🙏ఈ పవిత్ర క్షేత్రంలో బంగారు కాకిపై శనీశ్వర దేవునికి ఊరేగింపును చేస్తారు. ఈ స్వామి వారి భార్యల పేర్లు నీలాదేవి, మంగాదేవి. ఈ స్వామి పడమర దిక్కుగా వుంటాడు.🙏🌼🌿


🌿🌼🙏శింగణాపూర్, మందవల్లి, నర్సింగ్ ల్, విజయవాడ, జాల్నా, పాపగడ్, వైదీశ్వరన్ కోయిల్లలోని దేవాలయాలన్నీ శనీశ్వర దేవాలయాలలో ప్రఖ్యాతిగాంచినవి. శని త్రయోదశి పర్వదినాలలో మండవల్లిలోని శ్రీమందేశ్వర స్వామివారికి శని దోష పరిహారార్ధం తైలాభిషేకాలు చేసుకుంటే శని దేవుని వలన కలిగే సమస్త దోషాలు నివారించబడతాయని స్కంద పురాణంలో లిఖితమై ఉంది.🙏🌼🌿


ఓం శం శనైశ్చరాయ నమః ఓం శం శనైశ్చరాయ నమః ఓం శం శనైశ్చరాయ నమః ఓం శం శనైశ్చరాయ నమః ఓం శం శనైశ్చరాయ నమః ఓం శం శనైశ్చరాయ నమః ఓం శం శనైశ్చరాయ నమః ఓం శం శనైశ్చరాయ నమః ఓం శం శనైశ్చరాయ నమః ఓం శం శనైశ్చరాయ నమః ఓం శం శనైశ్చరాయ నమః ఓం శం శనైశ్చరాయ నమః









#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat