(భూత దోషాలకు, విజయప్రాప్తి కొరకు)
హే భూతనాధా | దయాసాంధ్ర | ఆనందరూపా | ప్రభో | భూమిపై శాస్త్రా నామంబుతో నీవు సంకల్ప మాత్రంబునన్ శ్రీశగౌరీశ పుత్రుండవై, లోక కళ్యాణమున్ గూర్చగా పందళాధీశు కోర్కెల్ ఫలింపంగా అయ్యప్ప నామంబుతో జేరి, పండ్రెండు వర్షంబు లారాజు సేవించియున్, వావరున్ మెచ్చియున్, మాతృబాధన్ తొలగింపగా కానకేతెంచియున్, దేవతల్ నిన్ను ప్రార్థింపగా మహీషి ప్రాణముల్ దీసియున్, వ్యాఘ్రదుగ్ధంబునుం దెచ్చియున్ తండ్రికిన్ ధర్మశాస్త్రంబు బోధించినావే ! శబర్యాచంలంబందునన్ జ్యోతిరూపంబుతో భక్తలోకమ్మునున్ బ్రోచుచున్నావు దేవా | నినున్ పూజసేయంగ నేనెంతవాడన్ ? దయన్ మమ్ము కాపాడవే నీదు నామమ్ము నీ పాద పద్మమ్ములే నాకు దిక్కంటి, ఓ ధర్మశాస్తా । మహాదేవ సత్పుత్ర | పొన్నంబలావాస | పంచాద్రులన్ దాటగా జేసి, పంబానదిన్ తీర్థమాడించి నీ సన్నిధానంబుకున్ జేర్చి మూడార్లమెట్లెక్కి నీ దివ్య రూపంబు దర్శింపగా జేసి ధన్యాత్ములన్ జేయవే | స్వామి । నెయ్యాభిషేకంబు నేత్రోత్సవంబొప్ప వీక్షింపనీవే | సదా మాదు కష్టమ్ములన్ దీర్చి నీ దివ్య రూపంబు ధ్యానింపగా శక్తి చేకూర్చుమా, యోమోహనాకార । ఓ మోహినీపుత్ర | అయ్యప్ప దేవా | నమస్తే | నమస్తే నమస్తే| నమః