మకర జ్యోతి - నిజానిజాలు -ఖగోళ విశేషాము (ప్రతి స్వామి తెలుసుకోవలసిన విషయం)

P Madhav Kumar

 "ది ఆస్ట్రాలిజికల్ మేగజైన్" జనవరి 1989 లో కేరళ కాలికట్ నివాసులు డాక్టర్ సువర్ణ నలపాటు గారు ఆంగ్ల భాషలో రచించిన TheTruth Behind Makarajyothi అను వ్యాసము తెలుగులో అనువదించడం జరిగింది

 ఎంతో ఆకర్షణ కలిగి మకర సంక్రమణం నాడే ఏర్పడు మహాద్భుతం మకరజ్యోతి
 సూర్యుడు భూమికి ఉత్తరాభిముఖుడై సంచరించు నప్పుడు శబరి కొండ పై కొలువై ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం దగ్గర మాత్రమే ఈ పరమ అద్భుత దృశ్యం గోచరిస్తుంది ఇటీవల కాలంలో ఈ మకర జ్యోతి గురించి అనేక వాదోపవాదాలు వినిపిస్తున్నాయి

 హేతువాదులు లేక యుక్తి వాదులుగా చెప్పుకునే కొందరు తర్కానికి శాస్త్ర పరిశీలనా పరిశోధనలకు నిలవని ఈ అద్భుత దృశ్యం అవాస్త మైనదని జనాకర్షణ కోసం మరియు భక్తులను శబరిమలకు రప్పించేందుకు శబరిమల దేవస్థానం వారు కృత్రిమంగా ఏర్పాటు చేసిందని వాదిస్తున్నారు అయితే మీరు ఒక ముఖ్య విషయాన్ని విస్మరిస్తున్నారు ఈ జ్యోతి దర్శనం ఈనాటిది కాదు కొన్ని వందలు వేల సంవత్సరాలుగా ఈ జ్యోతి దర్శనం జరుగుతూనే ఉన్నది
 ఆరోజుల్లో ప్రస్తుత దేవస్థాన కమిటీ ఏర్పడక ముందు నుండే ఎన్నో ఏళ్లుగా ఈ మకర జ్యోతి ఏర్పడుతుంది పైగా ఒకే దిక్కు నుంచి ఆ జ్యోతి దర్శనం జరుగుతుంది శాస్త్ర రీత్యా పరికిస్తే ఈ మకరజ్యోతి దర్శనం ఒక ప్రత్యేకమైన ఖగోళ విశేషాము 

 ఆధునిక ఖగోళ భౌతిక శాస్త్రం ఈ మేషాది ద్వాదశ రాశులందు నుండి వచ్చే వెలుగును దాని ప్రతి వెలుగును ఒకింత విశదంగా పరిశీలించింది సూర్య కిరణాలు అతి సూక్ష్మమైన వాతావరణ రేణువుల వల్ల చెల్లాచెదురు అవ్వడం వల్ల ఏర్పడేది ద్వాదశ రాశుల విరజిమ్మే కాంతి ఇది సాధారణంగా ప్రకాశవంతమైన శంకువుల ఆకారంలో సూర్యాస్తమయానికి తదుపరి గాని సూర్య దానికి ముందర గాని భూభ్రమణ మార్గానికి దగ్గరగా కనిపిస్తుంది ఇది చీకటి రాత్రులలో దక్షిణ ఆకారంలో క్రాంతి వృత్తం చక్ర నాళం(Horizon) కంటే ఎత్తుగా ఉన్నప్పుడు మరింత ప్రకాశవంతంగా కనిపిస్తుంది ఇటువంటి సందర్భంలో రెండు కాంతి శంకువులు కలగలిసి ఒకే దాని గా కనిపించే అవకాశం ఉన్నది దీని ప్రతి కాంతి సూర్యుడికి ఎదురుగా ఉండేచోట ఒక ప్రకాశవంతమైన చుక్కలాగా ఏర్పడి కనిపిస్తుంది

 ఇటీవల సోవియట్ శాస్త్రవేత్తల పరిశోధనలో ఈ మేషాది ద్వాదశ రాశులందు నుండి వెలువడే కాంతి ఎన్నో విశేషాలు కలిగిన ఒక అద్భుత మనియు మరియు భూగోళ సంబంధమైన వాతావరణం ద్వారా భూమధ్యరేఖకు సమాంతరంగా సూర్యకిరణములు చెదిరి పోవటం వలన సూర్యుని చుట్టూ ఉండే ఎలక్ట్రాన్లు మరియు వాతావరణ రేణువుల వలన ఏర్పడుతుందని ఇది వాయు రూపంలో ఉండి భూమికి ఒక తోక వలె సూర్యభిముఖంగా కనిపిస్తుంది అని తేలింది

 18వ శతాబ్దపు శాస్త్రవేత్త (Mr.Lomanosov)లో మనో సావ్ ఊహా ప్రకారం భూమి వంటి తోకచుక్క లకు ప్రకాశవంతమైన వాయు రూపంలో ఉండి తోక వంటిది ఉంటుంది సోవియట్ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన లోమనోసావ్ ఊహను సమర్ధిస్తుంది ఈ సందర్భంగా సూర్యకిరణాలు వాతావరణంలోని దుమ్ము కణాలపై ప్రసరించినప్పుడు ఏర్పడే కిరణ్ ధార్మికత ( దీనినే పాయింటింగ్ రాబర్ట్ సన్ ఎఫెక్ట్ అని అంటారు) పేర్కొనదగినది పై చిత్రంలో "M" అనేది సూర్యుని చుట్టూ పరిభ్రమించే కణం అనుకుంటే "V" అనేది కాంతి యొక్క వేగం మరియు కణము పరిభ్రమించే వేగం వల్ల "V" (కాంతిరేఖ) "L 1" కు "M" వద్ద సమానమవుతుంది ఇట్లు ఒక గుండ్రని వ్యతిరేక ఒత్తిడి "P" మరియు "స్పర్శ రేఖ" వల్ల క్రమంగా తగ్గుతుండే ఒత్తిడి "T" ఏర్పడుతాయి ఈ "T" వలన కణములు సూర్యుని వైపు గా ఎగబ్రాకి సూర్యునిపై వాలిపోతాయి సూర్యుడు ప్రతి సెకనుకు కనీసం ఒక టన్ను (1000కిలోలు) వాతావరణ రేణువులను చిమ్మి వేస్తుంటాడు ఈ విధంగా సూర్యుని చుట్టూ ఏర్పడే ధూళి మేఘము ఎప్పటికప్పుడు తయారవుతుంది ఇలా దూళి మేఘములు తయారు కావడం చేతనే ద్వాదశ రాశుల జ్యోతి నిలకడగా ఉంటుంది వాతావరణ రేణువులు ఒకదానిపై మరొకటి వేగంగా పడటం ద్వారా ఈ జ్యోతి ఏర్పడుతుంది ఎప్పుడైతే ఈ వాతావరణ రేణువులు హెచ్చు సంఖ్యలో ఉంటాయో అప్పుడు ద్వాదశ రాశుల జ్యోతి లో కూడా హెచ్చుధనం కనిపిస్తుంది అదేవిధంగా దీని ప్రతి వెలుగు సైతం హెచ్చుతుంది రాహువు మరియు కేతువు సూర్య గ్రహం తో కలిసినప్పుడు సూర్యుడు మరింత ఎక్కువగా ఈ రేణువులను విరజిమ్ముతాడు ఈ విధంగా ఒకసారి సూర్య గ్రహణం ఏర్పడ్డాక ద్వాదశరాశులు విరజిమ్మే వెలుగు కూడా మరింత పెద్దదిగా ప్రకాశవంతంగా వెలుగుతుంది

 1980లో సూర్య గ్రహణం తర్వాత శబరిమల లో కనిపించిన మకరజ్యోతి ఇలాగే కనిపించింది ఈ దైవాంశ సంభూతమైన అద్వితీయమైన అద్భుతం కృత్రిమం కాదు మనుషులు కృత్రిమంగా ఏర్పాటు చిన్నది కాదని దీనిని బట్టి నిశ్చయముగా
నిస్సంశయంగా తెలుస్తున్నది స్వామి శరణం 


#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat