🍁“వాళ్లంతా అధర్మంగా సంపాదిస్తున్నా బాగున్నారు కదా! మరి ధర్మంగా సంపాదించాలి - అని ప్రబోధించడంలో అర్థమేముంటుంది?" అని సందేహం కలుగుతుంది.
🍁అదే ఒక పెద్ద సమస్యగా మారి మనసుని తొలుస్తూంటుంది.
🍁 కానీ పురాణ గ్రంథాల దాకా పోనవసరం లేకుండా, సమాజాన్ని పరిశీలించి చూసినా అధర్మ సంపాదన వలన దుష్ఫలితాలు లభించి తీరతాయనే ఉదాహరణలు కోకొల్లలు.
🍁భారతంలో రోమశుడనే మహర్షి పాండవులతో చెప్పిన కొన్ని చక్కని మాటలు ఏ కాలం నాటి వారికైనా శాశ్వత సత్యాలు.
🍁వసుధన ధర్మవర్తులగు వారల వర్ధన మెన్నడున్ సమం
🍁జసమయి నిల్వనేరదు, భృశంబున నాశమునొందు దుర్మద
🍁వ్యసనుల ధర్మవర్తన ప్రవర్థితులయ్యును నేను జూడ, రా
🍁క్షసులను దైత్యదానవుల్ గాగరె తొల్లి సహస్ర సంఖ్యలన్.
🌼(మహాభారతం - అరణ్య పర్వం. నన్నయ ఆంధ్రీకరణ).🌼
🍁 "అధర్మ వర్తనులైన వారి అభివృద్ధి సమంజసంగా నిల్వదు.
🍁 శీఘ్రంగా నాశనమౌతుంది.
🍁 నా అనుభవం ప్రకారం - దుర్మదంతో, వ్యసనంతో అధర్మ జీవనం గడిపేవారు రాక్షసులు దైత్య దానవులు వేలసంఖ్యలో మరణించారు.
🍁వారందరూ క్రమంగా దెబ్బతిన్న వారే."
🍁అసురులు అధర్మం వల్ల అభివృద్ధి చెందినట్లుకనిపించినా, అదినిత్యంగా నిలవలేదు.
🍁 క్రమంగా వారు ఆ సంపదలను, సౌభాగ్యాలను కోల్పోక తప్పదు.
🍁ఎందరో దనుజులు ధర్మ విరుద్ధంగా అర్థాన్ని సంపాదించి తాత్కాలికంగా విజయవంతుల్లా కనబడ్డా, క్రమంగా సర్వస్వాన్ని కోల్పోయారు.
🌼"అధర్మ వర్తన వలన దర్పం పుడుతుంది.
🌼దర్పం వలన మానము (గర్వం) పుడుతుంది.
🌼దాని వలన క్రోధం కలుగుతుంది.
🌼 క్రోధం వలన లజ్జ పోతుంది. (లజ్జ అనగా అధర్మ కార్యాలను ఆలోచించడానికీ, ఆచరించడానికీ వెనుకాడే సంస్కారం) లజ్జ నశించితే సర్వమూ నశించడమే.
🍁 భగవద్విషయమై ఆసక్తికరమైన సమన్వయంతో దీనికి మరో విధంగా అర్థం చెప్పుకోవచ్చు.
🌼"ధర్మం వలన వివేక వైరాగ్యాలు కలుగుతాయి.
🌼 దాని వలన అభిమానం, అహంకారం తొలగుతాయి.
🌼తద్వారా లజ్జ కలుగుతుంది. శాంతి, ఐశ్వర్యం ప్రాప్తిస్తాయి."🌼
🍁లజ్జపోయిన నాడు శాంతం, ఐశ్వర్యం కూడా హరించుకుపోతాయి.
🍁దేవతలు ధర్మాన్ని ఆశ్రయించడం చేతనే శాశ్వత కీర్తిని, ప్రతిష్ఠను కలిగి ఉన్నారు.
🍁ధర్మం వలన వచ్చే ఆర్జనకి నిలకడ, ఆనందం ఉంటాయి - అని కూడా శాస్త్రాలు చెబుతున్నాయి.
🔥 'యతః సత్యం యతో ధర్మో
🔥 యతో హ్రీరోర్జవం యతః!
🔥 తతో భవతి గోవిన్దో
🔥యతః కృష్ణస్తతో జయః"
- అని సంజయుని మాట .
🌼 "ఎక్కడ, సత్యం, ధర్మం, లజ్జ, ఆర్జనం (నిష్కపటత్వం) ఉంటాయో, అక్కడ గోవిన్దుడుంటాడు. గోవిన్దుడున్న చోట జయం ఉంటుంది."
🍁 ధర్మ జీవనంలో పవిత్రత మాత్రమే కాక, అమోఘమైన శక్తి కూడా ఉంటుంది.
🍁ఆ శక్తి భగవత్స్వరూపమే.
🍁ధర్మం వలన కలిగే భగవశ్శక్తి తృప్తినీ, రక్షణనీ కూడా ప్రసాదిస్తాయి.