పరమేశ్వరుడు అగ్నిలింగ రూపంలో వెలసిన అతి మహిమాన్విత క్షేత్రం తిరువణ్ణామలై అనబడే అరుణాచలం. రోజువారి ప్రదక్షిణ వాటి ఫలితాలు

P Madhav Kumar

 వారిని ఒకసారి దర్శనం చేసుకొని తరించండి🙏🌼🌿


🌿🌼🙏పరమేశ్వరుడు అగ్నిలింగ రూపంలో వెలసిన అతి మహిమాన్విత క్షేత్రం తిరువణ్ణామలై అనబడే అరుణాచలం.🙏🌼🌿


🌿🌼🙏అనేక మహిమలు కలిగిన అరుణాచల గిరిని ప్రదక్షిణం చేయడం వలన కలిగే శుభ ఫలితాలు అనేకం.🙏🌼🌿


🌿🌼🙏#సోమవారం నాడు ప్రదక్షిణలు చేస్తే లోకాలను ఏలే శక్తి లభిస్తుంది.🙏🌼🌿


🌿🌼🙏#మంగళవారం ప్రదక్షిణం చేస్తే

పేదరికం తొలగిపోతుంది. సుభిక్షంగా వుంటారు. జనన మరణాల చక్రం నుండి విముక్తి లభిస్తుంది. మహాత్ములు శేషాద్రి స్వాములు వంటి సిధ్ధులు మంగళవారంనాడే గిరి ప్రదిక్షణలు చేసేవారు.🙏🌼🌿


🌿🌼🙏#బుధవారం గిరి ప్రదక్షిణం చేస్తే లలితకళలలో రాణింపు, విజయం లభిస్తుంది.🙏🌼🌿


🌿🌼🙏#గురువారం గిరి ప్రదక్షిణం చేస్తే ఆత్మజ్ఞానం ప్రాప్తిస్తుంది.🙏🌼🌿


🌿🌼🙏ప్రతి #శుక్రవారం గిరి ప్రదక్షిణం చేస్తే వైకుంఠ ప్రాప్తి చేకూరుతుంది.🙏🌼🌿


🌿🌼🙏#శనివారాలలో గిరి ప్రదక్షిణం చేస్తే

నవగ్రహాల కటాక్షం సిధ్ధిస్తుంది.🙏🌼🌿


🌿🌼🙏#ఆదివారం నాడు అరుణాచలగిరి ప్రదిక్షణలు చేస్తే కైలాసప్రాప్తి కలుగుతుంది.🙏🌼🌿

  

🌿🌼🙏సంతానహీనులైన భార్యాభర్తలు 48 రోజులపాటు భక్తితో గిరి ప్రదక్షిణలు చేస్తే సంతానభాగ్యం కలుగుతుంది.🙏🌼🌿

            

🌿🌼🙏గిరిని ప్రదక్షిణం చేయడానికి వేసే మొదటి అడుగుతోనే ముల్లోకాలు చుట్టివచ్చిన పుణ్య ఫలం లభిస్తుంది. రెండవ అడుగులో పవిత్ర తీర్ధాలలో స్నానం చేసిన పుణ్యఫలం లభిస్తుంది. మూడవ అడుగు వేయగానే అశ్వమేధ యాగం చేసిన

పుణ్యం లభిస్తుంది. నాలుగవ అడుగు వేయగానే

అష్టాంగ యోగం చేసిన ఫలితం లభిస్తుంది.🙏🌼🌿


🌿🌼🙏తిరువణ్ణామలైలో జరిగే కార్తీక దీపోత్సవం నాడు ఐదు సార్లు గిరికి ప్రదక్షిణలు చేసి వస్తే పాప విమోచనం లభిస్తుంది.🙏🌼🌿


🌿🌼🙏భరణీ దీపం రోజున ప్రాతఃకాలమున మూడున్నర ఘంటలకు ఒక సారి, ఏడు గంటలకు ఒకసారి, పగలు 11 గంటలకు ఒకసారి సాయంకాలం

దీపదర్శన సమయాన ఒకసారి రాత్రి 11గం.లకు

ఒకసారి అని ఐదు సార్లు గిరి ప్రదక్షిణలు చేస్తే

ఘోర పాపాలన్నీ హరిస్తాయి.🙏🌼🌿


🌿🌼🙏గిరి ప్రదక్షిణం చేసి రాగానే స్నానం చేయడమో.. నిద్రపోవడమో చేయకూడదు.

వాటివల్ల పుణ్యఫలం తగ్గి పాపం ఫలం కలుగుతుంది. భగవన్నామ స్మరణలోనే గడపాలి.🙏🌼🌿


🌿🌼🙏భారత దేశంలో మరెక్కడా లేని విధంగా అరుణాచలం లో మాత్రమే శివుడు నిండుగ నగలు ధరించి, పట్టు వస్త్రాలు ధరించి, కిరీటం పెట్టుకొని ఉంటాడు.. దానికి ఒక కారణం ఉంది..🙏🌼🌿


🌿🌼🙏పార్వతి మాత ఒకరోజున స్వామి వారు పక్కన కూర్చున్నపుడు స్వామి నుండి పునుగు వాసన వచ్చింది.🙏🌼🌿


🌿🌼🙏ఆ వాసన కి అమ్మవారు చాలా ప్రీతి చెందారు.. 🙏🌼🌿


🌿🌼🙏అప్పుడు అమ్మవారు ఇలా అడిగారు "మీ నుండి ఇంత సువాసన వస్తుంది మీకు పునుగు ఎక్కడ నుండి వచ్చింది" అని.. దానికి పరమేశ్వరుడు ఇలా చెప్పాడు..🙏🌼🌿


🌿🌼🙏"పార్వతి.. పునుగు పిల్లి యొక్క వాసన వల్ల ఋషుల భార్యలు పునుగు పిల్లి వెంట పడడం జరుగుతుంది అని ఋషులు ఏదో ఒకటి చేసి వాళ్ళ భార్యలని ఆ పునుగు పిల్లి నుండి రక్షించమని నన్ను అడిగారు.. నేను సరే అన్నాను..


🌿🌼🙏ఇప్పుడు నేను పునుగు పిల్లి దగ్గరకి వెళ్లి ఇలా అన్నాను "పులగా.. నీ నుండే వచ్చే ఆ సువాసన వల్ల రిషి పత్నులు నీ వెంట పడడం జరుగుతుంది.. నువ్వు వెంటనే నీ ప్రాణాలని వదిలేయ్" అని అన్నాడు...🙏🌼🌿


🌿🌼🙏దానికి అదిసరే అని ఒక చిన్నకోరిక కోరుతుంది.. నా నుండి మరియు నా వంశం నుండి వచ్చేవి అన్నీ పునుగు పిల్లిలే..వాటి నుండి వచ్చే సువాసనను నువ్వు స్వీకరించాలి ప్రభూ అని అడుగుతుంది.. అందుకు శివుడు అంగీకరిస్తాడు..🙏🌼🌿


🌿🌼🙏అప్పటినుండి ఆయన తన వంటికి పులుగు అద్దుకోవడంతో ఆ సువాసనకి అమ్మవారు పరవశించి ఉండేది.🙏🌼🌿


🌿🌼🙏అప్పుడు అమ్మవారు ఇలా అన్నారు..🙏🌼🌿


🌿🌼🙏"స్వామీ.. మీరు కొలువైయున్న ప్రతి చోట ఉన్నట్లు ఇక్కడ ఈ అరుణాచలంలో ఉండకూడదు.. ఒంటి నిండా నగలు వేసుకోవాలి.. పాములు ఏమి ఉండకూడదు.. నెత్తిన కిరీటం పెట్టుకోవాలి.. పట్టు పీతాంబరాలు చుట్టుకోవాలి.. ఒక్క మాటలో చెప్పాలి అంటే మన పెళ్ళి రోజున ఎలా ఉన్నావో అలా ఉండాలి.. అంతే కాదు.. నిన్ను శరణు కోరి వచ్చిన భక్తులు ఎవరైనా సరే వాళ్ళు నిన్ను ఏ కోరిక కోరితే అది వెంటనే నెరవేరిపోవాలి.." అని ఇలా ఈశ్వరుణ్ణి అడగడం జరిగింది.. అందుకే మనకి అరుణాచలంలో స్వామి వారు నిండుగ దర్శనం ఇస్తారు.🙏🌼🌿


🌿🌼🙏కాబట్టి అరుణాచలంలో శివుడినైనా, తిరుమలలో శ్రీనివాసుడినైనా ఏది కోరాలి అన్న ముందు అమ్మని అడగాలి.🙏


🌼🌿

Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat