*సాలగ్రామం చరిత్ర - పురాణగాథ*

P Madhav Kumar



దేవతల ప్రతీకలలో సాలగ్రామము అతి విశిష్టమైన ది. శ్రీ శంకరాచార్యులవారు తమ వేదాంత సూత్ర భాష్యములో విష్ణువు ఉపాసనను గురించి, అందు లో సాలగ్రామ ఉపాసనను గురించి పేర్కొన్నారు. 


ఒక చోట *"యథా శాలగ్రామే హరి:"*  

(సాలగ్రామములో హరి ఉన్నట్లు) 


మరొక చోట *"శాలగ్రామ ఇవో విష్ణు"*

(విష్ణు సాలగ్రామముల వలె)


ఇంకొకచోట

*"యథా శాలగ్రామే విష్ణుః సన్నిహితః తద్వత్"* 

(సాలగ్రామమున విష్ణువు సన్నిహితుడైనట్లు)


అని పేర్కొన్నారు. 


శంకరుల కాలంలో విగ్రహోపాసన లేదనికాదు. విష్ణు ఉపాసనలో సాలగ్రామానికి ఎక్కువ మహత్వముం డినదని భావింపవచ్చు. అందువల్లనే వైష్ణవదేవాల యములలో ప్రధానమూర్తి పాద మూలమున సాల గ్రామమును ఉంచి దానినే ముఖ్యంగా పూజిస్తారు.


తిరుమల తిరుపతిలో శ్రీనివాసుని గర్భాలయము లో సాలగ్రామ రాశినే పూజిస్తారు.


*పురాణగాథ :*


స్కంద పురాణమందలి అసుర ఖండములోని గాథ ఇలా ఉంది.


గండకి అను పేరుగల ఒక స్థిరమనస్కురాలైన స్త్రీ హిమాలయ పర్వతాలలో ఘోర తపస్సు చేస్తుంది. దేవతలు తన సంతానంగా కావాలని ఆమె ఆకాంక్ష. ఆమె తపస్సుకు ప్రసన్నులైన త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఏదైనా ఒక వరము కోరుకో మంటారు. మీరు మువ్వురూ నా సంతానంగా జ న్మించి భూతలంలోని సమస్త జనులను సుఖంగా ఉండునట్లు అనుగ్రహింపమని కోరుతుంది గండకి.


త్రిమూర్తులు అందుకు సమ్మతించక మరేదైనా వర ము కోరుకోమంటారు. గండకి అందుకు సమ్మతిం చక తాను కోరిన వరమునే ప్రసాదించమని పట్టుప డుతుంది. త్రిమూర్తులు ససేమిరా వీలుకాదన్నారు. నిరాశ చెందిన గండకి కోపావేశంలో త్రిమూర్తులతో పాటు దేవతలందరూ పురుగులైపోవాలని శపిస్తుం ది. అందుకు త్రిమూర్తులు..


"నీ తపస్సుచే సంతుష్టులై నిన్ను అనుగ్రహింప వ చ్చిన మమ్ములనే శపించావు, నీ కోరిక అవివేకపూ రితమైనది. నీవు మానవ రూపమున ఉండతగవు. నీవు కృష్ణవర్ణము గల నదిగా మారిపో" అంటూ గం డకికి ప్రతిశాపమిస్తారు.


ఈ హఠాత్పరిణామానికి దేవతలు చింతాక్రాంతుల వుతారు. బ్రహ్మను ప్రమాదము నుండి రక్షించమని ప్రార్థిస్తారు. బ్రహ్మ వారిని పరమశివుని ఆశ్రయించ మన్నాడు. శివుడు తాను నిస్సహాయుడను అంటా డు. అందరూ విష్ణువును అర్థిస్తారు. వారి విన్నపా న్ని ఆలకించిన విష్ణువు, దేవతలను సమాధానప రుస్తూ.... 


"శాపమును వమ్ము చేయుటకు వీలుకాదు. అందు కొక పరిహారముంది. మా శాప కారణంగా గండకీ హిమాలయాల్లో నదిగా మారింది. దేవతల రూప ముదాల్చిన భక్తులిద్దరు మరొక శాపకారణంగా జల రాక్షసులుగా జన్మించారు. నేను వారి ఆత్మలకు ము క్తిని ప్రసాదించి, వారి శరీరములోనికి ప్రవేశిస్తాను. వారి శవాలు కుళ్ళినపుడు, మీరు అస్తికల కొవ్వు తో క్రిములుగా మారి, వారి కళేబరాలలోని కఠిన భా గాలలో చేరవచ్చు. మీరు పురుగులుగా మారినప్ప టికీ, మీ దేహాలు కఠినంగా ఉంటాయి. అందువల్ల రాక్షసుల దేహాలను వజ్రకీరీటములంటారు. నేను ప్ర వేశించిన గండకీ నదిలో మిమ్ము మునిగేటట్లు చే స్తాను. శవములు కుళ్ళిన తర్వాత మీరు క్రిముల రూపంలో వాటిలో చేరుతారు. మీరు గండకీ సంతా నంగా వ్యవహరింపబడుతారు. మీరు క్రిములుగా మారిపోవాలన్న గండకీ శాపం కూడా వాస్తవమౌ తుంది. అంతేకాక త్రిమూర్తులైన మేము ఆమె బిడ్డ లుగా జన్మించాలన్న ఆమె కోరిక కూడా ఈడేరు తుంది.” అని అన్నాడు విష్ణువు.


జరుగనున్న సంఘటనా స్థలాన్ని కూడా శ్రీమహావి ష్ణువే సూచిస్తాడు. గండకీ నది హిమాలయ పర్వ తాల దక్షిణ భాగంలో ప్రవహిస్తుంది. ఈ నది పాయ నొక దానిని చక్రతీర్థం అంటారు. మహర్షులకు దేవ తలకు ప్రియమైన ఈ స్థలములో జలరాక్షసులు దే హాలను పడవేస్తారు. దేవతలు వాటితో పాటు వజ్ర కీరీటములుగా పరిణమిస్తారు. విష్ణువు చిత్రవిచిత్ర రూపాలతో కళేబరాలతో కనిపిస్తాడు.


ఇలా వజ్ర కిరీటములు లేదా సాలగ్రామాల క్రిములే దేవతలు. చక్రము సాక్షాత్ మహావిష్ణువే. గండకీ న దిలో స్నానం మరియు సాలగ్రామ రూపియైన వి ష్ణువును పూజించుట వల్ల మోక్ష ప్రాప్తి కలుగును.


*ఎంత ప్రాచీనం ఈ పరంపర :*


సాలగ్రామ ఉపాసన ఎప్పటి నుండి ప్రారంభమైనదో కచ్చితంగా చెప్పలేము. క్రీ.పూ. రెండవ శతాబ్దినాటి శాసనమొకదానిలో వాసుదేవ మరియు సంకర్షణ (కృష్ణ, బలరాములు) అను యుగళ దేవతలు సాల గ్రామ శిలారూపమున పూజింపబడినట్లు ఒక దేవా లయ శాసనంలో ఉంది. ఈ శిలాశాసనం రాజస్తాన్ లోని మేవాడ సమీపంలోని ఘోసుంది నాగరిలో ఉ న్నది. పారాశర గోత్రమునకు చెందిన గాజాయన వంశీయుడైన సర్వతత అను రాజు ఈ దేవాలయం చుట్టూ రాతి గోడను (పూజా శిలా ప్రాకారం) కట్టిం చాడు. దీనినే నారాయణ వాటికా అని శాసనం పే ర్కొన్నది. 


శాసన వాక్యమిట్లున్నది. "కారితోయం రాజా నేన పారాశర పుత్రేణ, సర్వతాతేనే అశ్వమేథ యాజినా భగవద్భ్యాం సంకర్షణ వాసుదేవాభ్యాం అనిహతా భ్యం సర్వేశ్వరాభ్యాం పూజా శిలా ప్రాకారో నారా యణ వాటికా."


గుప్త సమ్రాట్టుల సామంతుడైన మహారాజా నరవ ర్మ వేయించిన మాండసోర్ శిలాశాసనం (క్రీ.శ. 40 4) విష్ణువు యొక్క ప్రార్థనతో ప్రారంభమవుతుంది. 


*“సహస్ర శిరసే తస్మై పురుషా యామి తాత్మనే చతు: సముద్ర పర్యంతో యనిద్రాలవే నమః"* 


అన్న ఈ శ్లోకం, విష్ణువు సాలగ్రామ శిలలో పూజిం పబడుతుండినందుకు సాక్ష్యంగా ఉంది.


ప్రాచీనకాలం నుండి విష్ణువును విగ్రహ రూపంలో ఆరాధించేవారని నిరూపించుటకు మధ్యప్రదేశ్ లో ని బిలాస్పూర్ లో లభించిన ఒకే పంక్తిలోని బ్రాహ్మీ లిపిలో గల శాసనం (క్రీ.పూ. 1వ శతాబ్ది) సాక్ష్యంగా ఉంది. విష్ణువును ఆ విగ్రహ రూపంలోని సాలగ్రామ రూపంలోనే పూజించుచుండినట్లు పై రెండు శాసన ములు నిరూపిస్తున్నాయి.


ఇంతకంటే స్పష్టంగా వివరములు తెలుపు శాసన మొకటి (క్రీ.పూ. 1వ శతాబ్ది) మథుర సమీపంలోని వృష్టి వంశమునకు చెందిన (యాదవవంశం) అయి దుగురు పూజ్యులైన వీరులను వారు అయిదు రూ పాలలో పూజించినట్లు చెప్పబడింది. 


విష్ణువు యొక్క అయిదు వ్యూహా రూపములైన వా సుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ మరియు సాంబులే ఈ పంచవీరులు. వారిని ప్రతిమల రూ పంలోను, శిలారూపంలోను ఆరాధించినట్లు శాసన ములో చెప్పబడింది. ఈ అయిదు రూపములతో పాటు విష్ణువు యొక్క అన్ని రూపాలను ప్రతిబిం బించే ప్రత్యేక సాలగ్రామాలున్నాయి.


శంకరాచార్యులవారు ఆచరణలో తెచ్చిన మరియు నేటికి ఆచరణలోనున్న పంచాయతన పూజా పద్ధ తిలో విష్ణు సంకేతంగా సాలగ్రామార్చన జరుగుతు న్నది. విష్ణు, శివ, దేవి, కార్య, గణపతి ఈ అయిదు గురు దేవతలను నవగ్రహ రూపములో పూజించు ట పంచాయతన పూజా విధానంగా ఉన్నది. 


విష్ణువునకు సాలగ్రామం, శివునికి లింగము, దేవికి ధాతు పత్రం లేదా యంత్రం, సూర్యునికి స్ఫటికం, గ ణపతికి శోణశిల ప్రతీకలుగా ఉన్నాయి. ఈ క్రమం లో స్కందోపాసన కూడా వాటితో ఉంది.


మన దేశంలో పెక్కు ప్రసిద్ధ దేవాలయాలలో సాలగ్రా మ శిలతో నిర్మింపబడిన నవగ్రహములు పూజింప బడుతున్నవి. బదరిలోని నారాయణుడు, ఉడిపి లోని శ్రీకృష్ణుడు సాలగ్రామ శిలావిగ్రహాలు.


*సృష్టిలోని అద్భుతం :*


సాలగ్రామాలు నేపాల్ లో మాత్రమే లభించాయి. చూసేందుకది నల్లరాయి. దానిలో రంధ్రం, ఆ రం ధ్రంలోను బయట కూడా చక్రముల గుర్తు. శంఖ, చ క్ర, గద, పద్మం, విల్లు మొదలగు సంకేతాలు. కొన్ని మెరుస్తాయి. కొన్ని పారదర్శకాలు. కొన్ని పచ్చని చా రలతో ఉంటాయి. వీటిని ఇంటిలో ఉంచుకోవటం శుభప్రదం. వీటి స్పర్శతోనే తీర్థం శాస్త్రోక్తంగా పూ జించినా, కేవలం తులసీ దళాలతో పూజించినా, స కలాభీష్టదాయకములని విశ్వాసము.


సాలగ్రామం ప్రకృతిదత్తమైన శిల. ప్రకృతి దత్తమై నందువల్లనే, మానవ నిర్మితమైన విగ్రహముకంటే శ్రేష్ఠమైనది. ఇవి నేపాల్ మరియు భారతదేశము లో ప్రవహించు గంగానది యొక్క ఉపనదియైన గం డకీ నదిలో మాత్రమే లభించుచున్నవి. హిమాల య పర్వతాలకంటే ముందుగానే గండకీనది ఉంద ని భూగర్భశాస్త్రవేత్తల అభిప్రాయం. గండకీ నదిని నేపాల్ లో శాలిగ్రామ అని, ఉత్తరప్రదేశ్లో సప్తగండకీ లేదా నారాయణీ అని అంటారు. ప్రాచీన గ్రీకులు గండకీ నదిని 'కొండోబెట్స్' అనేవారు. 


సాలగ్రామం, వాస్తవంగా గండకీ నదీ తీరంలోని ఒక గ్రామం పేరు. వరాహ పురాణం ప్రకారం శాలంకా యన మహర్షి గుడిసె (శాల) నుండి ఈ పేరు వచ్చిం ది. ఈ గ్రామములో శాల వృక్షములెక్కువగా ఉన్నా యి. అందువల్ల శాలగ్రామ శిల అన్న పేరు వచ్చింది.


స్వతః దేవుడే అయినా సాలగ్రామాలు ఉన్నందున గండకీ నది పవిత్రమైనదని పురాణాలు చెబుతు న్నాయి. 


*"తస్యాం భవాయే చా శ్మనః చక్ర చిహ్నారలంకృతా: తేసాక్షా ద్భగవంతో హి స్వస్వరూపధరాః తరా"* 


అని వర్ణింపబడినది. సాలగ్రామాలు గండకీ నదిలో రూపొందిన శిలాజములు.


నేపాల్లోని కాలీ గండకీ నదీ మూలంలో దామోదర కుండమను సరోవరముంది. శాలంకాయన మహర్షి గాథలోని ఈ సరస్సు భారత్-నేపాల్ సరిహద్దులో ఉంది. దానిని శాలిగ్రామ క్షేత్రమంటారు. ధవళగిరి మరియు అన్నపూర్ణా పర్వతాల మధ్య నున్న 'తుక్బె' సమీపంలోని కాలీ గండకీ తీరములో సాల గ్రామాలు విరివిగా లభిస్తాయి. దామోదర కుండ ము శైవయాత్రా స్థలంగా ప్రసిద్ధమై, సోమేశ్వర క్షేత్ర మని పిలువబడుతున్నది. నేపాల్ రాజులు శివరా త్రి పర్వదినమున ఈ క్షేత్రమును దర్శించి గండకీ న దిలో సేకరించిన సాలగ్రామాలను స్వీకరించే ఆచా రం చాలా కాలంగా ఉంది. అమూల్యమైన సాలగ్రా మాలను రాజుగారు తమ వశం చేసుకొంటారు. కొ న్నిటిని గుత్తదారులు తీసుకొంటారు. కొన్ని సాలగ్రా మాలు అయిదు లక్షల రూపాయలు దాకా పలుకు తాయి.


ప్రాచీన గ్రంథాలు పేర్కొన్నట్లు సాలగ్రామాలు విష్ణు రూపాలు.

Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat