రు ద్రాక్షల గురించి తెలియన భారతీయులు ఉంటారు అంటే సందేహమే. వేల ఏండ్ల నుంచి రుద్రాక్షలను ధరించడం భారతీయులకు సంప్రదాయంగా వస్తుంది. సాక్షాత్తు పరమశివుని అంశగా చెప్పే రుద్రాక్షలు పలు రకాలు.
ఏకముఖి రుద్రాక్ష – శివస్వరూపం
ద్విముఖి – అర్థనారీశ్వరరూపం
త్రిముఖి – అగ్ని స్వరూపం
చతుర్ముఖి – బ్రహ్మస్వరూపం, సరస్వతికి ప్రీతికరం
పంచముఖి- కాలాగ్ని స్వరూపం
షణ్ముఖి- కార్తికేయ రూపం (సుబ్రమణ్య)
సప్తముఖి- మన్మథుని రూపం
అష్టముఖి- రుద్రభైవర రూపం
నవముఖి- ధర్మదేవతా స్వరూపం
దశముఖి- విష్ణు స్వరూపం
ఏకాదశముఖి- రుద్రాంశ స్వరూపం
ద్వాదశముఖి- ద్వాదశాదిత్య రూపం
పిల్లలకు చదువుకు చతుర్ముఖి, ఆరోగ్యం కోసం షణ్ముఖిని ధరించండి.