🙏 సూర్యోదయం సూర్యాస్తమయం..🌞

P Madhav Kumar



ప్రతి రోజు సూర్యుడు ఉదయిస్తాడు, అస్తమిస్తాడు దీనివలన మనకు రాత్రి పగలు ఏర్పడుతున్నాయి భూమి కుడివైపునుండి తిరగటం వలన దిక్కులను అనుసరించి సూర్యుడు తూర్పు దిక్కున ఉదయించి, పడమర దిక్కున అస్తమిస్తాడు. భారతీయ ఇంకా కొన్ని దేశాల సంస్కృతిలో సూర్య గ్రహాన్ని భగవంతునిగా కొలుస్తారు


సూర్యోదయం ముందు మేలుకొనడం వలన ఉపయోగాలు


సూర్యోదయంకన్నా ముందు నిద్ర లేచి, సూర్యకాంతులు మానవ శరీరం పై పడటం వలన ‘డి ‘ విటమిన్ లభిస్తుందని అంటారు. బ్రహ్మ సమయం లో నీటి లో సాక్షాత్తు సూర్య భగవానుడు ఉంటాడని భారతీయ సాంప్రదాయ నమ్మకం. సూర్యోదయం కాక ముందు లేచి స్నానం చేయడం వళ్ళ సూర్యుని యొక్క శక్తి మానవ శరీరంలోనికి వస్తుందని, అది ఆరోగ్యాన్ని కలిగిస్తుందని అంటారు. బ్రహ్మగారు సృష్టికి ముందు తపస్సు చేసారని. సూర్యోదయం తో సృష్టి మొదలు అనుకుంటే సూర్యోదయం చెట్లకు సగం సూర్యకాంతి నుంచి ఆహార పోషకాలు అందుతాయని శాత్రవేత్తలు పేర్కొన్నారు. సూర్యోదయం సమయంలో మనము చేసే పనికి సత్పలితాలు లభిస్తుందంట(అంటే మంచి ఫలితాలు ఇస్తుందంటారు). సూర్యోదయం కన్నా ముందు సమయాన్ని బ్రహ్మ సమయం అని పిలుస్తారు. బ్రహ్మ సమయం లో సకల తీర్ధాలు నీటిలో వుంటాయని అంటారు. కన్నా ముందు సమయం బ్రహ్మ సమయం అంటారు(బ్రహ్మముహూర్తం లో ధ్యానం లో ఊహాపరితమైన పని చేయడం వల్ల ఆ పనికి 41 రోజులలొ కార్య రూపం రావచ్చు అని, మనస్ఫూర్తిగా చేయడం వాళ్ళ కార్య ఫలితం జరుగుతుందని అంటారు.


హిందూ ధర్మ శాస్త్రాల ప్రకారం సూర్యభగవానుడి చరిత్ర


కశ్యపు మహర్షి, అదితి అను దంపతులకు జన్మించిన వాడు సూర్య భగవానుడు(ఆదిత్యుడు)​దేవదూత అయినా అదితిని, ఆమె కోరిక మేరకు సూర్యుడు ఆమె గర్భమున జన్మించాడు. సూర్యుడికి సంధ్యాదేవి, ఛాయాదేవి, పద్మిని అను ముగ్గురు భార్యలు కలరు. మొదటి భార్య అయినా సంధ్యాదేవి గర్భమున ముగ్గురు బిడ్డలు జన్మించారు. వారు మనువు, యముడు, యమునా అను పేర్లతో పిలవబడ్డారు . సూర్యుని కుమారుడైన మానవునిచే పరిపాలించడం వలన మనము మానవులం అయ్యామని అంటారు. హిందువులు సూర్యుడి ని ప్రపంచానికే ఆత్మ గా భావిస్తారు. సంధ్యా వందనం చేసే సమయం లో, కలశ లోని నీటిని సూర్యుడికి సమర్పించేటప్పుడు, వక్రీభవనం వలన, సూర్యుడి నుంచి వచ్చే కాంతి, రంగు లను ఉత్పత్తి చేస్తాది. ఈ రంగులు, కంటికి చాలా ఉపయోగపడతాయి, శరీరాన్ని జీవచేతనత్వము చేస్తాయి, మానవులను ఆహ్లాదపరంగా ఉంచుతాయని నమ్మకము. సూర్యకిరణాలు శరీరంలోని ఏడు చక్రాలకు జీవచేతనాన్ని ఇస్తాయని హిందువులు నమ్ముతారు.


సూర్యాస్తమయం🌺


చిన్న పెద్ద వయస్సు భేధాన్ని మరిచి ప్రతి ఒక్కరు ఇష్టపడే ప్రాంతము సముద్రతీరం. సముద్రతీర ప్రాంతాలల్లో ఇసుక లో గవ్వ లను ఏరుకోవడం, దగ్గరనుంచి అలలలో పోటీ పడుతూ తుల్లింతాలు ఆడటం వరకు ప్రతి ఒక్కటి ప్రత్యేకమే. అటువంటి సముద్రతీరాలలో సూర్యాస్తమయాలు చాల అందంగా కనిపిస్తూవుంటాయి. కేవలం సముద్రతీరాలే కాకుండా సరస్సులు, నదీతీర ప్రాంతాలు పర్వత శిఖరము కూడా సూర్యాస్తమయ సమయంలో సప్త వర్ణాలశోభితంగా వెలుగొందుతాయి. అలా అందమైన సూర్యాస్తమయ సమయం కి ఇంట్లో దీపారాధన చేయటం మంచిది అని అంటారు

(భారతీయ సాంప్రదాయ ప్రత్యేకత)


సూర్యుడు ఎర్రగా ఉండటానికి గల కారణం


సూర్య కిరణాలు భూమి వాతావరణం లో మానవుని కంటికి చేరేవరుకు ప్రయాణించే దూరాలు మారుతూ ఉంటాయి. సూర్యకిరణాలు మన కంటికి చేరడానికి ఉదయం, సాయంత్రవేళల్లో ఎక్కువ సమయం తీసుకుంటాయి. సూర్యుడు ఉదయించే సమయాలలో దగ్గరగా ఉండుట వలన సూర్యుడు ఎర్రగా కనిపిస్తాడు. అదే మధ్యాహ్న సమయాల్లో సూర్యుడు నడి నెత్తి పైన ఉన్నప్పుడు కిరణాలు తక్కువ దూరం పాటు ప్రయాణించి మన కంటికి చేరుతాయి. అలాంటి సమయాలలో సూర్యుడి రంగు మామూలు గానే ఉంటుంది. సూర్యకిరణాలు వాతావరణం లో ఎక్కువ దూరం ప్రయాణిస్తూ, తక్కువగా చెదిరి పోయే ఎరుపురంగు మన కంటికి ఎక్కువగా చేరుకోవడంవల్ల సూర్యుడు ఉదయించేటప్పుడు, అస్తమించేటప్పుడు ఎర్రగా కనిపిస్తాడు.


⭐️సూర్యుని గురించి మరి కొన్ని వాక్యాలు


జాతి ,మత భేదాలు లేకుండా పశుపక్షాదులందరికి సూర్య భగవానుడు ఒకే విధముగా కాంతిని ప్రసరింపజేస్తాడు. దక్షిణాయనం ముగించుకొని , ఉత్తరాయణం ప్రారంభించడానికి సూచనగా రెండు పర్వ దినాలను మనము జరుపుకుంటున్నాము. అందులో ఒకటి సంక్రాంతి. రెండవది రధసప్తమి. రధసప్తమి అనేది సూర్యుని కి సంబంధించిన జన్మ తిధి. పేదవాడు, ధనికుడు అనే తేడా లేకుండా అందరికీ ఒకే విధమైన వెలుగును నింపుతాడు. కనుక, రథసప్తమిని మనము పండుగగా జరుపుకుంటాము. అరణ్యవాసం సమయం లో ధర్మరాజు సూర్యభగవానుని ప్రార్ధించగా, ప్రసన్నమైన సూర్యుడు ఒక అక్షయ పాత్రను ప్రసాదించాడు. సత్రాజిత్తుడు అను రాజు సూర్య భగవానున్ని ప్రార్ధించి శమంతకమణి ని పొందుతాడు. అది రోజూ స్వర్ణం(బంగారం) ప్రసాదిస్తుంది అని సూర్యభగవానుడు అనుగ్రహించాడు. జీవుడు పుట్టుక, పోషణకు అవసరమైన వన్నీ సూర్యుని నుంచే లభిస్తున్నాయి. శరీరంలో 24 తత్వాలు ఉంటాయని సూర్యకాంతి ప్రసారంతో వీటిని మేలుకొలిపి చైతన్యవంతం చేస్తే జ్ఞానం లభిస్తుంది అని చెబుతున్నారు

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat