తీర్థయాత్రలు ఎందుకు చేయాలి కలిగే పుణ్య ఫలితం ఏమిటి ?

P Madhav Kumar



🌺తీర్థయాత్రలకు వయసు పైబడ్డాక వృద్ధాప్యంలోనే వెళ్లాలని కొందరు అనుకుంటారు. బాధ్యతలన్నీ పూర్తిచేసిన తర్వాత తీర్థయాత్రలకు వెళ్తుంటారు అనేకమంది. అయితే తీర్థయాత్రలకు వయస్సుతో పనిలేదు. భగవంతుడి నామస్మరణ చేయడానికి వయసుతో సంబంధం లేదు. భగవంతుడి దర్శనం, ఆయన నామస్మరణ , పూజాభిషేకాలు మనకు అనంతమైన పుణ్యఫలితాలను ఇస్తాయి.🌺


🌺అందుకే స్వామిని దర్శించుకునేందుకు వయస్సును అడ్డుపెట్టకూడదు.తీర్థయాత్రలకు వయస్సున్నప్పుడే వెళ్లడం ఉత్తమం. ఇలా చేస్తే, సమస్త దోషాలు తొలగిపోయి.కోరిన కోరికలు నెరవేరుతాయి. సంతృప్తికర జీవితం లభిస్తుంది.🌺


🌺కొందరు అనుకునే విధంగా బాధ్యతలు తీరిన తర్వాత తీర్థయాత్రలకు వెళ్తే మాత్రం అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు తప్పవు. కనుక అనుకున్న క్షేత్రానికి వెళ్ళాలనే ఆలోచనను జాప్యం చేయకుండా పూర్తి చేసుకోవాలి. వృద్ధాప్యంలో తీర్థయాత్రలకు శరీరం సహకరించకపోవడం ద్వారా స్వామి దర్శనానికి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. అందుకే ఆరోగ్యంగా ఉన్నప్పుడే తీర్థయాత్రలు చేయడం ఉత్తమం.🌺


🌺వయస్సున్నప్పుడే తీర్థయాత్రల్లో భాగం కావడం ద్వారా వివాహం, సంతానానికి సంబంధించిన దోషాలు సైతం తొలగిపోతాయి. అందుకే వయస్సున్నప్పుడే పవిత్ర క్షేత్రాలు, యోగులు, మహర్షులు, మహాభక్తులు, సిద్ధులు నడయాడిన ప్రాంతాల్లో తీర్థయాత్రలు చేపట్టాలి. జీవితంలో ఆధ్యాత్మికత, ధార్మికం మొదలైన ఉత్తమ గుణాలను చిన్న నాటి నుండి పెంచుకోవాలి.సుప్రసిద్ధ ఆలయాలకు వెళ్లడం ద్వారా దోషాలన్నీ తొలగిపోయి.. అష్టైశ్వర్యాలు చేకూరుతాయని విశ్వాసం.🌺


🌺దైవానుగ్రహం నా పట్ల పుష్కలంగా ఉందని నమ్మే నాలో దైవ చింతన, పాప భీతి, కర్మ సిద్ధాంతం పట్ల పూర్తి నమ్మకం వుంది. 🌺

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat