మన ఆరోగ్యం కోసం కొన్ని సలహాలు.

P Madhav Kumar


**


*1. మీకు స్థానికంగా దొరికే పండ్లను తినండి:*

🍇🍌🍊🍉🍎🍐🍒🍑

అరటిపళ్ళు, ద్రాక్ష, సపోటా, మామిడి, ఏదైనా సరే! పళ్ళు అన్నిటిలోనూ ఫ్రక్టోజు ఉంటుంది. ఫ్రక్టోజు మీ గ్లూకోజును నియంత్రణలో ఉంచుతుంది. కనుక మీరు పళ్ళను నిరభ్యంతరంగా తినండి.


*2. మీరు గింజలనుండి వచ్చిన నూనెలను వాడండి:* 🥜🥥

ప్యాకెట్లలో వచ్చే Olive, Rice bran, Refined నూనెలకన్నా మీరు మిల్లువద్ద ఆడించుకున్న వేరుశెనగ, నువ్వుల, కొబ్బరి, ఆవనూనెలు మంచివి. 


*3. ప్రతిరోజూ నెయ్యి ఎక్కువగా తినండి:*

ఏ ఆహారపదార్ధంలో నెయ్యి ఎక్కువగా తినవచ్చో దానిలో ఎక్కువగానూ, దేనిలో తక్కువ తినాలో దానిలో తక్కువగానూ తినాలి. నెయ్యి వాడడం వలన కొలెస్టరాల్ తగ్గుతుంది. 


*4. మీ ఆహారంలో కొబ్బరి ఎక్కువగా వాడండి:*

🥥🥥🥥🥥🥥🥥🥥🥥

కొబ్బరిలో కొలెస్టరాల్ అస్సలు ఉండదు. మీ నడుము సన్నబడేలా చేస్తుంది.


*5. ఓట్స్ గానీ, ధాన్యాలుగానీ టిఫిన్ గా తినవద్దు:*

Breakfast గా పోహా (అటుకుల పులిహోర), ఉప్మా, ఇడ్లీ, దోసె తినండి. పీచుకోసం ఓట్స్ తినక్కరలేదు.


6. మీ నోట్లో పళ్ళు ఉన్నంత కాలం *జ్యూసులు త్రాగకండి.* మీకు పళ్ళు ఉన్నది కూరలు, పళ్లు తినడానికే.

🍑🍐🍉🍊🍎🍌🍇


*7. చెరుకు రసం మిమ్మల్ని డీటాక్సిఫై చేస్తుంది.* అది ఫ్రెష్ జ్యూస్ రూపంలో తాగినా చెరుకు ముక్కలు తిన్నా సరే.


8. PCOD, Thyroid problem ఉన్నవారు శక్తికారకాలూ, బరువు తగ్గేవీ అయిన వ్యాయామాలు చెయ్యాలి.

ప్యాకేజీ ఆహారం వదిలిపెట్టాలి

*9. మామూలు తెల్లని అన్నం తినండి:* బ్రౌన్ రైస్ తినవలసిన అవసరం లేదు. అది ఉడికేటపుడు మీ కుక్కర్ కీ, ఉడికాక మీ పొట్టకీ శ్రమను కలిగిస్తుంది. రైస్ యొక్క GI Index చాలా తక్కువ. అది పప్పు, పులుసు, పెరుగువంటి వాటితో కలిస్తే దాని GI Index మరింత తగ్గుతుంది. వీటికి తోడు నెయ్యిని కూడా చేరిస్తే అది మరింత తగ్గుతుంది. రైస్ లో మినరల్స్ ఉన్నాయి. కాబట్టి రోజుకు మూడుసార్లు కూడా తినచ్చు.


*10.ఎంత తినాలి? :*

ఆకలిగా ఉంటె ఎక్కువ తినండి. మీ పొట్ట ఏమి చెప్తుందో దాన్నిబట్టి తినండి.


11. మీరు రైస్, చపాతీ రెండూ తినచ్చు. లేదా రైస్ మాత్రమే తినచ్చు. మూడుపూటలా మీ ఇష్టం వచ్చినట్టు ఏమీ భయపడకుండా తినండి. మీ ఆకలినిబట్టి తినండి

*12. మీరు తినే ఆహారం మిమ్మల్ని భయపెట్టకూడదు:*

నెయ్యి, రైస్ తినకూడదు అంటూ భయం వద్దు. మీరు తినే ఆహారం మీరు మంచిగా ఫీల్ అయ్యేలా ఉండాలి.


13. అయ్యబాబోయ్! ఎన్ని కేలరీలు తిన్నానో అని భయపడకండి. ఎంత పోషకాహారం తీసుకున్నాను అనేది చూడండి.

*Never look at CALORIES. Look at NUTRIENTS.*


*14. పిజ్జా, బర్గర్, పాస్తా, బ్రెడ్, బిస్కట్, కేకులు, ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్ అస్సలు తినద్దు:*

🥘🍔🍞🍪🍘🍰🍦🍫🍬


*15. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి:* 

ఈ Food మా అమ్మమ్మ తినేదా? మీ జవాబు ఎస్ అయితే భయం లేకుండా తినండి.


*16. రుతువునుబట్టి తినండి:*

వర్షాకాలంలో పకోడీలు, జిలేబీలులాంటివి తినండి. ఎందుకంటే ఆకలి రుతువునుబట్టి ఉంటుంది. ఒక్కొక్క సీజన్ లో వేపుళ్ళు తినాలి. తినండి.


*17. ఉదయాన్నే టీ మీ మొదటి ఆహారంగా తీసుకోకండి:* 

అలాగే బాగా ఆకలిగా ఉన్నప్పుడు కూడా టీ త్రాగకండి. రోజులో రెండు, మూడుసార్లు పంచదార వేసుకుని టీ త్రాగచ్చు.


*18. గ్రీన్ టీ త్రాగకండి.* ఎల్లో టీ, గులాబీ టీ, నీలం టీ ఏమీ వద్దు.


*19. నిలువచేసిన ప్యాకేజీ ఫుడ్ / కూల్ డ్రింక్స్ ఏమీ వద్దు.*


*20. అరగడానికీ, ఆరోగ్యంగా ఉండడానికి వ్యాయామం చెయ్యండి. వాకింగ్ చెయ్యండి.*


+++

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat