*శ్రీ సూర్యనారాయణస్వామి వారి దేవాలయం…*గొల్లలమామిడాడ*

P Madhav Kumar



*తెలుగు ప్రజలకి సైతం అంతగా తెలియని మరో పురాతన సూర్య ఆలయం తూర్పుగోదావరి జిల్లాలోనే ఉంది.*


*కాకినాడకు కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ‘గొల్లల మామిడాడ‘ అనే గ్రామంలో ఈ ఆలయం ఉంది.*


*ఈ గ్రామం చెంతనే తుల్యభాగా నది అంతర్వాహినిగా ప్రవహిస్తోందని ఓ నమ్మకం.*


*వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ గొల్లల మామిడాడలో అంతే చరిత్ర కలిగిన ఆలయాలకీ కొదవ లేదు.*


*160 అడుగుల ఎత్తు గోపురం కలిగిన రామాలయం, వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన సూర్యదేవాలయం వాటిలో ప్రముఖమైనవి.*


*ఊరిలోకి అడుగుపెడుతూనే అనేక గోపురాలు దర్శనమిస్తుంటాయి. అందుకే ఈ ఊరిని…. ‘గోపురాల మామిడాడ’ అని కూడా పిలుచుకుంటారు.*

 

*’గొల్లల మామిడాడ’ లోని సూర్యనారాయణస్వామి దేవాలయం ఈనాటిది కాదు.*


*ఎప్పుడో 1902లో కొవ్వూరి బసివిరెడ్డి అనే జమీందారు భక్తిశ్రద్ధలతో…. ఈ ఆలయాన్ని నిర్మింపచేశారు.*


*అప్పటి నుంచి ఇప్పటి వరకూ నిరాటంకంగా ఈ ఆలయంలో పూజాదికాలను నిర్వహిస్తూ వస్తున్నారు.*


*ముఖ్యంగా ఆదివారం వేళ్లలో ఈ ఆలయంలో జరిగే విశేష పూజలను చూసి తీరాల్సిందే.* 


*ఇక రథసప్తమి వంటి పర్వదినాలలో అయితే స్వామివారికి జరిగే కళ్యాణంలో పాలుపంచుకునేందుకు వేలాది భక్తులు వస్తుంటారు.*

 

*’గొల్లల మామిడాడ’ లో సూర్య భగవానునికి ఆలయం ఉండటమే ఓ విశేషం అయితే, ఈ స్వామి ‘ఉష, ఛాయ’ అనే దేవేరులతో కలిసి సతీసమేతంగా దర్శనమివ్వడం మరో ప్రత్యేకత.*


*చుట్టూ ప్రకృతి సోయగాల మధ్య, ఆ ప్రకృతికి పురుషునిలా భాసిస్తూ ఉండే సూర్యుని ఆలయాన్ని చూడటం ఓ గొప్ప అనుభూతిగా మిగిలిపోతుంది.*✍️

🎶 *స్వరం : గౌతమి*🎙️

 *ఓం నమో భగవతే శ్రీ సూర్య దేవాయ నమః* 

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat