*ఈ ప్రశ్న ఒక పిల్లాడిని వెంటాడుతూ ఉంది. ఆ కుర్రవాడు అర్థం చేసుకోగలిగే సరళమైన భాషలో ఎలా వివరించాలో ఎంత ఆలోచించినా అతని తల్లిదండ్రులకు తెలియలేదు.*
*ఒకసారి వారు కుటుంబ సమేతంగా రమణ మహర్షి దర్శనానికి వెళ్లారు.*
*బాలుడు తన ప్రశ్నను రమణ మహర్షి ముందుంచాడు.*
*"ధ్యానం అంటే ఏమిటి గురువుగారూ?" అని ఆ అబ్బాయి అడిగాడు.*
*శ్రీ రమణమహర్షి తనలో తానే నవ్వుకున్నాడు. అప్పుడు చిరునవ్వుతో తన భక్తుడిని పిలిచి, వంటగదిలోంచి దోసె తీసుకొచ్చి ఆ అబ్బాయికి వడ్డించమని చెప్పాడు.*
*ఒక అరిటాకుపై, ఒక దోసె వడ్డించారు. రమణమహర్షి ఆ కుర్రాడి వైపు చూసి, "ఇప్పుడు నేను ‘మ్మ్’ అంటాను. అప్పుడే నువ్వు తినడం మొదలు పెట్టాలి. మళ్ళీ ‘మ్మ్’ అంటాను. ఆ తర్వాత నీ ఆకులో చిన్న దోసె ముక్క కూడా మిగలకూడదు." అని అన్నారు.*
*ఆ కుర్రాడు చాలా ఉత్సాహంగా ఒప్పుకున్నాడు. అందరూ కూడా చాలా నిశితంగా గమనిస్తూ ఉన్నారు.*
*ఇప్పుడు ఆ కుర్రాడు రమణమహర్షి ముఖంలోకి చూస్తూ, సంకేతం కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నాడు. "మ్మ్" అని సంకేతం ఇవ్వగానే ఆ కుర్రాడు తినడం మొదలుపెట్టాడు.*
*ఇప్పుడు అతని దృష్టి అంతా రమణమహర్షి పైనే ఉంది. సంకేతం ఇచ్చే ముందే దోసె పూర్తి చేయాలనుకుని, అతను హడావిడిగా దోసెను పెద్ద పెద్ద ముక్కలుగా చింపి తింటున్నాడు కానీ, ఆ సమయమంతా అతని దృష్టి రమణమహర్షి పైనే ఉంది.*
*దోసె పరిమాణం క్రమంగా తగ్గుతూ వచ్చింది. ఒక చిన్న ముక్క మాత్రమే మిగిలి ఉంది. రెండో సంకేతం కోసం అతను రమణమహర్షి వైపు ఆత్రుతగా చూశాడు.*
*సంకేతం ఇచ్చిన క్షణం, ఆ కుర్రాడు వెంటనే చివరి దోసె ముక్కను నోటిలో పెట్టేసుకున్నాడు.*
*ఇప్పుడు రమణమహర్షి అతనిని… "ఇప్పటి వరకు నీ దృష్టి ఎక్కడ ఉంది? నాపైనా లేక దోసెపైనా లేక ఇతరులపైనా?" అని అడిగారు.*
*"నా దృష్టి మీ మీదా, దోసె మీదా మాత్రమే ఉంది, ఇంక దేనిమీదా లేదు”, అని ఆ అబ్బాయి బదులిచ్చాడు.*
*రమణమహర్షి, "అవును... నువ్వు నా మీదే శ్రద్ధ పెట్టి, దోసె పూర్తి చేయడంలో పూర్తిగా నిమగ్నమయ్యావు. నువ్వు అస్సలు పరధ్యానంగా లేవు.*
*అదే విధంగా, నీవు నీ దృష్టిని లేదా ఆలోచనలను భగవంతునిపై నిల్పి, నీ రోజువారీ కార్యకలాపాలను చేసినప్పుడు, దానిని ‘ధ్యానం’ అంటారు."*
*"మ్మ్" అన్న రెండు సంకేతాలు పుట్టుక - మరణం. ఈ రెండు సంఘటనల నడుమ, శ్రీ రమణ మహర్షి చూపించిన విధంగా… ‘ధ్యానం’ లో నిమగ్నమవ్వవచ్చు.*
*అయితే దీన్ని అర్థం చేసుకోవడానికి, మనమందరం పరిపక్వమై, పరిణతి చెందాలి, దీనికి ‘దైవానుగ్రహం’ కూడా అవసరం.*
*మనమందరం ఒకరికొకరు భిన్నంగా ఉంటాం, కాబట్టి ఈ గొప్ప సత్యాన్ని అర్థం చేసుకోవడానికి పట్టే సమయం కూడా వివిధరకాలుగా ఉంటుంది.*✍️
♾️♾♾♾
*ధ్యానం చేసినప్పుడు, మనం ప్రాణాహుతి ప్రసారాన్ని అందుకుంటాం. ఇది హార్ట్‌ఫుల్‌నెస్ ప్రత్యేకత. ఇది మన చైతన్యాన్ని మెరుగుపరుస్తుంది. *✍️
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*