🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*మన భారతదేశం ఎన్నో పుణ్యక్షేత్రాలకు పుట్టిల్లు.*
*కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన ప్రదేశం తిరుమల తిరుపతి.*
*ఆ వేంకటేశ్వర స్వామి ఆలయాలు ప్రపంచం మొత్తం ఉన్ననూ... ఈరోజు మనం పరిచయం చేస్తున్న ఈ తిరుమలగిరి పుణ్యక్షేత్రానికి ఒక ప్రత్యేకత ఉంది.*
*అన్ని వెంకటేశ్వర స్వామి క్షేత్రాలలో వేంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రధానంగా కొలచడం జరుగుతుంది... కాని ఈ క్షేత్రములో స్వామి వారిని పుట్ట రూపంలో కొలుస్తారు...*
*తిరుమలగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం కృష్ణా జిల్లా జగ్గయ్యపేట సమీపంలో ఉన్నది.*
*ఒకసారి భృగు మహర్షి పరీక్షకోసం స్వామివారి వక్షస్థలమును పాదములతో తంతారు. వాస్తవంగా భృగు మహర్షి వారు లక్ష్మీ దేవి అమ్మవారికి పితృ సమానులు అయిననూ, తన నివాస స్థలము అయిన వక్షస్థలాన్ని భృగుమహర్షి తన్నినా స్వామి వారు ఏమీ అనలేదని... లక్ష్మీదేవి అమ్మవారు అవమానంగా భావించి స్వామివారిపై అలిగి వెళ్ళి పోతుంది.*
*లక్ష్మీ దేవి అమ్మవారు స్వామి వారిని వదిలి వైకుంఠం వదిలి అలిగి వెళుతుంది. అమ్మవారి కోసం స్వామి వారు తిరుగుతూ తిరుగుతూ అలిసి ఒక పుట్టలో విశ్రమించడం, ఆకలి గొన్న ఆయన ఆకలి తీర్చడానికి బ్రహ్మ దేవుడు గోవు రూపంలో పాలు ఇవ్వటం ఆ కథ గురించి అందరికీ తెలిసిందే..!*
*వేంకటేశ్వర స్వామి వారు పుట్టలో సేదతీరిన ప్రదేశం ఇదే అని ... ఇక్కడి భక్తుల కోరిక మేరకు స్వామి వారు ఆ పుట్ట రూపంలో ఇక్కడ వెలిశారని క్షేత్ర పురాణం.*
*వేంకటేశ్వర స్వామి వారు శ్రీదేవి భూదేవి సహితము గా పుట్ట రూపంలోనే ఇక్కడ కొలువు అందుకుంటారు...*
*అందుకే అన్ని దేవాలయాలలో ఉన్నట్లుగా ఇక్కడ అభిషేకములు ఉండవు...*
*పుట్టలో ఉన్న రంధ్రాల స్థానంలో నామములు దర్శనమిస్తాయి... అందుకే ఈ వేంకటేశ్వర స్వామిని నామాల వెంకటేశ్వర స్వామి అని కూడా పిలుస్తారు...*
*ఈ క్షేత్రం లో సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మాత్రమే దర్శనములు ఉంటాయి ... మిగిలిన వేళల్లో ఇక్కడ దర్శనం ఉండదు...*
*అర్చకుల వారి తో సహా చీకటి పడకముందే మొత్తం కొండ దిగి రావాల్సిందే...*
*స్వామివారు ఇక్కడ సర్ప రూపంలో సంచరిస్తారు అని ఒక కథనం ఉంది... అలా చీకటి పడిన తరువాత ఆ రూపాన్ని చూసి చాలా మంది చనిపోయారని అప్పటినుండి రాత్రివేళల్లో కొండపై సంచారాన్ని నిషేధించారని ఒక కథనం ప్రచారంలో ఉంది...*
*పుట్టపై నీరు పోస్తే పుట్ట కరిగిపోతుంది. అందుకే ఈ క్షేత్రంలో ఎటువంటి అభిషేకములు జరగవు...*
*అయినప్పటికీ తెల్లవారి ఆలయమును తెరచినప్పుడు చూస్తే అభిషేకం జరిగిన ఆనవాళ్లు కనపడతాయట... ముక్కోటి దేవతలు ఇక్కడకు వచ్చి స్వామిని రాత్రివేళల్లో అభిషేకిస్తారని కథనాలు ఉన్నాయి...*
*ఇంకా ఈ క్షేత్రంలో…. మంచి వేసవి సమయంలో కూడా కొండపై ఉన్న పుష్కరిణిలో నీరు ఉండటం ఆశ్చర్యాన్ని కలగిస్తోంది... ఈ పుష్కరిణిలో స్నానం చేసిన వారికి ఎన్నో వ్యాధులు నయమవుతాయని నమ్మకం... స్వామివారి పుష్కరిణి సమీపంలోనే స్వామివారి పాదముద్రలు కూడా కనపడతాయి.*✍️
ఓం నమో వెంకటేశాయ
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*