🌹🙏ధర్మానికి ప్రతిరూపం నందీశ్వరుడు...!!

P Madhav Kumar

          

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿


🌿కైలాసనాధుని ప్రమద గణాలలో అతి ముఖ్యుడు నందీశ్వరుడు. 


🌸ఈ నందీశ్వరునికి అనేక రూపాలు. ఐదుగురు నందీశ్వరులను ఆగమాలు వివరిస్తున్నాయి. ఆవిధంగా మన ఆలయాలలో


🌿ధర్మనంది, విష్ణునంది, 

అధికారనంది, సామాన్యనంది, మహానందిగా శివుని సన్నిధిలో దర్శనమిస్తారు. 



🌸ఇవే కాకుండా

కొన్ని ఆలయాలలో అమ్మవారి సన్నిధిలో కూడా నందీశ్వరుడు వుంటాడు.


🌿ఆ నందీశ్వరుని సోమనంది అంటారు. 

ఇంకా భోగనంది, ఆత్మనంది, బ్రహ్మనంది కైలాసనంది

మొదలైన నందులు కూడా ప్రతిష్టించబడివుండడం గమనిస్తాము.


🌸పరమశివుని శిష్యుడు...

నంది అంటేనే ఆనందం, 

జ్ఞానం, సంతోషాన్ని

యిచ్చేవాడని అర్ధం.


🌿నందీశ్వరుని ఆరాధన అన్నివిధాల శుభకరం.నంది పరమేశ్వరుని ప్రధమ శిష్యుడు. పరమశివుని 

ఎనిమిదిమంది దళపతుల‌లో

ఒకడు. నాద శైవ అష్ట శిష్యులలో ఒకరుగా పురాణాలు వివరిస్తున్నాయి. 


🌸ఉన్నత పదవి కావాలా..

శివాలయాలలో ఈశ్వరుని దర్శించడానికి అనుమతించే అధికారము , శివునికి జరిగే పూజలు, అభిషేకాలు పర్యవేక్షించే అధికారము కలిగినవాడు అధికారనంది.


🌿 ఆలయ ప్రవేశంలో ధ్వజస్ధంభం వద్ద వుండే అధికారనందిని పూజించి అనుగ్రహం పొందితే 

ఉన్నత పదవులు లభిస్తాయి.


🌹నందీశ్వరుడు పురాణం చెప్పే రహస్యం..🌹


🌸గర్భగుడిలోని ఈశ్వరునికి ఎదురుగా

బయటవుండే నందిని ధర్మనంది అంటారు. నందికి అడ్డంగా వెళ్ళ కూడదు.


🌿నందియొక్క ఉఛ్వాస నిశ్వాసాలు సదా ఈశ్వరుని

మీద పడతాయని ఐహీకం. నంది వేరు తాను వేరు కాదని ఇద్దరమూ ఒకటే అని

మహేశ్వరుడు నంది పురాణంలో చెప్తున్నాడు.


🌸నందీశ్వరుని పవిత్ర నామాలు..

వృషభుడు, రుద్రుడు, 

శైలాది,మృదంగ ప్రియుడు, 

శివప్రియుడు, కరుణా కరమూర్తి, వీరమూర్తి, ధనప్రియుడు, కనక ప్రియుడు అని అనేక నామాలతో నందీశ్వరుడు పిలవబడుతున్నాడు.


🌷నందీశ్వరునిలో ఐక్యమయ్యే పవిత్ర తీర్ధాలు..🌷


🌿ప్రదోష కాలంలో అన్ని తీర్ధాలు నందీశ్వరునిలోనే

ఐక్యమవుతాయని ఐహీకం. అందుకే ఆరోజు నందీశ్వరుని పూజించడం శుభదాయకం.


🌸 ప్రదోషకాలంలో

నందికి గరికమాల , బియ్యం, బెల్లం, పళ్ళు కలిపిన నైవేద్యం పెట్టి పూజిస్తారు. ఇందువలన

 సకల దోషాలు తొలగి సుఖ సంతోషాలతో కూడిన జీవితం లభిస్తుంది....🚩🌞🙏🌹


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat